5, సెప్టెంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 86

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
అగ్నిశిఖల మీద నాడె శిశువు.

4 కామెంట్‌లు:

 1. ఆలిఁ జూచి యొంటి కాలిపై లేచెడి
  భర్తనోపలేదు భార్య; పాప-
  మాలు మగల పెనగులాటల రేగెడి
  అగ్నిశిఖలమీద నాడె శిశువు.

  రిప్లయితొలగించండి
 2. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం గా " పూజ్యనీయు లైన గురువు లందరికి హృదయ పూర్వక శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 3. మంత్ర గాడు చేయ తంత్రవిద్యలు చాల
  మట్టి లోన చూప మణుల నైన
  చిన్ని పాప చేసె చాతుర్యమునచాల
  అగ్ని శిఖల మీద నాడె శిశువు

  రిప్లయితొలగించండి
 4. నారాయణ గారూ,
  అద్భుతమైన పూరణ. అభినందనలు.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో యతి తప్పింది. దానిని ఇలా సవరించాను.
  "చిన్ని పాప చేసె చిత్రంపు క్రీడలు"

  రిప్లయితొలగించండి