17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

గళ్ళ నుడికట్టు - 53


అడ్డం
1. వికలమై క్షణక్షణం "అసాధారణం"గా ఉండే లక్షణం (4)
3. శ్రీశైలంలోని తుమ్మెదమ్మ (4)
7. నిధులిచ్చే సాయి గుళ్ళో నిరంతరం వెలిగే నది (2)
8. ఆద్యుడైన గ్రహమణి (3)
9. పీకను తిరగేసి కోతిని పిలవండి (2)
12. ధర్మ సంబంధమైనది (3)
13. ప్రతివాది గళం పట్టి పగడాన్ని వెదకండి (3)
17. రథాలు వెళ్ళే రాజమార్గం (2)
18. దాస్య విముఖుని రక్తి దీని గురించే (3)
19. ఏదో మనల్ని కుట్టేది. మశకం (2)
22. నవ్వినా పండుతుందట ఈ చేను (4)
23. భీమునకు ఈ బాలుడు తమ్ముడే (4)
నిలువు
1. రోదించే విధులు గల శత్రువులు (4)
2. క్షమించే భూమి (2)
4. తామసిలో బొగ్గు నుసి (2)
5. బలమున్న వాడెక్కే పీట ప్రాణాంతకమే. రంగనాయకమ్మ నవల (4)
6. ఆయన చెప్పేవే మనకు నీతులు (3)
10. భర్తకోసం అందరూ వ్రతాలు చేస్తే ఈవిడ నిద్ర పోయింది (3)
11. పెళ్ళి. విద్యను నాశనం చేస్తుందట! (3)
14. శంకరాభరణం శంకరశాస్త్రికి ఇటువంటి సేవ "లభిస్తుందా?" (4)
15. మన్మథుడు కాముకుడు కదా! (3)
16. పొట్టివాడైనా త్రివిక్రముడు (4)
20. వస్త్రాన్ని తిరగేస్తే ఇంగ్లీషులో మధ్యాహ్న భోజనమే (2)
21. కులాసాగా చెప్పే మిష (2)

9 కామెంట్‌లు:

 1. అడ్డం: 1.విలక్షణం, 3.భ్రమరాంబ 7.ధుని, 8.ద్యుమణి,9.కపీ, 12.ధార్మికం, 13.ప్రవాళం, 17.రథ్య, 18.విముక్తి, 19.దోమ, 22.నాపచేను, 23.నకులుడు

  నిలువు: 1.విరోధులు, 2.క్షమ, 4.మసి, 5.బలిపీఠం, 6.వేమన,10.ఊర్మిళ, 11.వివాహం, 14.దొరకునా, 15.కాముడు, 16.వామనుడు, 20.లంచే, 21.సాకు

  రిప్లయితొలగించండి
 2. అడ్డం:

  1) విలక్షణం,3) భ్రమరాంబ,7) ధుని, 8) ఖమణి, 9) కపీ, 12) ధార్మికం, 13) ప్రవాళం,17) రథ్య, 18) విముక్తి, 18) దోమ, 22) నాపచేను,23) నకులుడు.

  నిలువు:

  1) విరోధులు,2) క్షమ,4) మసి,5) బలిపీఠం, 6) వేమన, 10) ఊర్మిళ, 11) వివాహ,14) దొరకునా,15) కాముడు,16) వామనుడు,20) లంచే, 21) సాకు.

  రిప్లయితొలగించండి
 3. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  మీ సమాధానాలు 100% సరిపోయాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
  ఒకవిధంగా మీ సమాధానాలు అన్ని కరెక్టే. అభినందనలు.
  అడ్డం 8 మొదటి అక్షరం నా సమాధానంతో విభేదించినా మీరు రాసింది కూడా సరిపోతుంది. నిలువు 11 చివర సున్నా పెట్టడం మరిచిపోయారు. అంతే.

  రిప్లయితొలగించండి
 5. గడి 53 అడ్డం
  1.విలక్షణం .3.భ్రమరాంబ.7.ధుని.8.....9.కపీ.12.ధార్మిక.13.ప్రవాళం .17.రధ్య .18.విముక్తి.19.దోమ.22.నాపచేను.23.నకులుడు.
  నిలువు.1.విరోధులు.2.క్షమ.4.మసి.5.బలిపీఠం.6. శ్రీ రంగ. 10.ఊర్మిళ.11.వివాహం.14.దొరకునా .15.కాముడు.16.వామనుడు.20.లంచే [ చేలం.] 21.సాకు.

  రిప్లయితొలగించండి
 6. 53 గడి అడ్డం.1.విలక్షణం.3.భ్రమరాంబ.7 .ధుని.8....9.కపీ.12. ధార్మిక.13.ప్రవాళం.17.రధ్య.18.విముక్తి.19.దోమ.22.నాపచేను.23.నకులుడు.
  నిలువు.1.విరోధులు.2.క్షమ .4.మసి.5.బలిపీఠం.6.శ్రీరంగ.10.ఊర్మిళ.11.వివాహం.14.దొరకునా?.15.కాముడు.16.వామనుడు.20.లంచే [ చేలం.].21.సాకు.
  నమస్కారములు శంకరయ్య గారూ ! ముందు పంపాను బహుస అంద లేదేమొ అని మళ్ళీ పంపుతున్నాను.అంతె

  రిప్లయితొలగించండి
 7. మిట్టపెల్లి సాంబయ్యఆదివారం, సెప్టెంబర్ 19, 2010 8:56:00 PM

  గళ్ళ నుడికట్టు 53 సమాధానాలు:-
  అడ్డం:
  1.విలక్షణం, 3.భ్రమరాంబ, 7.ధుని, 8.ధ్యుమణి, 9.కపీ, 12.ధార్మిక, 13.ప్రవాళం, 17.రథ్య, 18.విముక్తి, 19.దోమ, 22.నాపచేను, 23.నకులుడు.

  నిలువు:
  1.విరోధులు, 2.క్షమ, 4.మసి, 5.బలిపీఠం, 6.వేమన, 10.ఊర్మిళ, 11.వివాహం, 14.దొరకునా, 15.కాముడు, 16.వామనుడు, 20.లంచే, 21.సాకు.

  రిప్లయితొలగించండి
 8. నేదునూరి రాజేశ్వరి గారూ,
  అడ్డం 8 ద్యుమణి. నిలువు 6 వేమన.

  మిట్టపెల్లి సాంబయ్య గారూ,
  అన్నీ కరెక్ట్. అభినందనలు.
  అడ్డం 8 ద్యుమణిని ధ్యుమణి అని టైపు చేసారు, అడ్డం 12 కు చివర సున్నా పెట్టలేదు.

  రిప్లయితొలగించండి
 9. సమాధానాల కోసం పైన కోడీహళ్ళి మురళీమోహన్ గారి వ్యాఖ్య చూడండి.

  రిప్లయితొలగించండి