దశవతార స్తుతి ( బౌద్ధావతారం)
మ.గిరియుష్మద్ధనురస్త్రతా ప్రభృతి మోఘీకృద్వధూశీల వి
స్ఫురణావర్మభిదాఢ్య దార్ఢ్య సఫలీ భూతత్రిపూతత్రిపూ
ర్వర దైతేయ జిఘాంసు శాసన పరోగ్రప్రాప్య సారూప్య ని
ర్భర దైతేయ తథాగతాంగక పరబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.
( ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్దం )
భావం -బుద్ధరూపుడవైన ఓ పరమాత్మా! శివుడు మేరుపర్వతాన్ని ధనుస్సుగాను, నిన్ను బాణంగాను గ్రహించినా, ఇంకా ఇతర ఉపకరణాలను ఉపయోగించినా వాటి నన్నింటినీ త్రిపురాసురుల స్త్రీల పాతివ్రత్యం అనే కవచం వ్యర్థం చేయగా, దానిని నీ తథాగత రూపం భేదించింది. అత్యధికమైన దార్ఢ్యం చేత సాఫల్యం పొందిన త్రిపురాసురులను సంహరించాలనే కోరికతో స్తుతించిన శివునితో సారూప్యంగా దిగంబరత్వాన్ని ధరించి ఆ స్త్రీల పాతివ్రత్యాన్ని చెరిచావు. అట్టి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి