19, సెప్టెంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 100

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
శతమానం భవతి యనుచు శాపము నొసఁగెన్.

23 కామెంట్‌లు:

  1. మితమని చెప్పెను వైద్యుడు
    సతతంబును చపల తందు శర్కర తినగా
    గత మయ్యెనొ శమరాశియు
    శతమానం భవతి యనుచు శాపము నిచ్చెన్.

    చక్కెర వ్యాధి రోగి వైద్యుని మాట వినడు. శమరాశి అంటే శమగుణ రాశో (లేక పేషెంటుల సంఖ్యో ) డాక్టరుకి తగ్గాయి. చక్కెర ఎక్కువవాలని శాప మిస్తున్నాడు. అందులో కోపం,స్వార్ధం రెండూ ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  2. మితమని చెప్పెను వైద్యుడు
    సతతంబును చపల తందు శర్కర తినగా
    గత మయ్యెనొ శమరాశియు
    శతమానం భవతి యనుచు శాపము నొసగెన్

    చక్కెర వ్యాధి రోగి వైద్యుని మాట వినడు. శమరాశి అంటే శమగుణ రాశో (లేక పేషెంటుల సంఖ్యో ) డాక్టరుకి తగ్గాయి. చక్కెర ఎక్కువవాలని శాప మిస్తున్నాడు. అందులో కోపం,స్వార్ధం రెండూ ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్య గారూ, మీ సమస్యల సెంచరీకి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. వంద సమస్యలను ఇచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  5. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    "చపలతందు" అనడం కంటే "చపలత గని" అంటే ఎలా ఉంటుంది?
    "శమరాశి" పదం కూడా సందిగ్ధార్థాన్ని ఇస్తున్నది.
    ఏది ఏమైనా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. నచికేత్ గారూ,
    కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. పరుచూరి వంశీకృష్ణ గారూ,
    ధన్యవాదాలు. "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.

    రిప్లయితొలగించండి
  8. మితి మీరిన భక్తి కలిగి
    సతతము పూజలు సలుపుచు సదాశివునిన్
    యతులిత ముగ పుణ్యమంద
    శతమానం భవతి యనుచు శాపము నొందన్

    రిప్లయితొలగించండి
  9. మితి మీరిన భక్తి కలిగి
    సతతము పూజలు సలుపుచు సదాశివునిన్
    యతులిత ముగ పుణ్యమంద
    శతమానం భవతి యనుచు శాపము నొసగెన్

    రిప్లయితొలగించండి
  10. శంకరయ్యగారూ
    మీ సలహా బాగుంది. శమము అనే పదము శాంతి,సహనము,ఓర్పు అనే అర్ధం వచ్చేటట్లు వాడేను. తప్పయితే క్షమించ గలరు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. అప్పుడా చతుర్ముఖుడు:
    గతుకుము మనిషిగ కోతిగ
    బ్రతుకీడ్చెడి గాడిదగను శునకమువోలెన్
    చతురంబగు నీ మనుగడ
    శతమానం భవతి యనుచు శాపము నొసగెన్.

    రిప్లయితొలగించండి
  12. అంత బాగా అనిపించకపోయినా, ఎలాగూ రాశాను గనక పోస్టు చేస్తున్నాను..చిత్తగించండి:
    వెతలారెడి జీవితమది
    బ్రతుకంతయు రోత! వలదు, ప్రభు!యని వేడన్
    చతురాస్యుడు నగి క్షేత్రిగ
    శతమానం భవతి యనుచు శాపము నిచ్చెన్.

    రిప్లయితొలగించండి
  13. శతధా శంకర స్ఫూర్తితొ
    శతపద్యరచన లుజేయ శంకన చంద్రా
    సతమత మైయను కొంటివి
    శతమా నంభవ తియనుచు శాపము నొసగెన్!

    విధేయుడు,
    చంద్రశేఖర్
    సూచన: నిన్ననే మీ బ్లాగు చూడట౦ వల్ల వంద సమస్యలకి పద్యాలు వ్రాయాల అనిపించి ఒక్కసారిగా మీ వందవ సమస్యక చూసేసరికి నా ఆలోచన మీరు పసిగట్టిన ట్టుగా ఊహించి పూరణ చేశాను.

    రిప్లయితొలగించండి
  14. మాస్టారూ, ఇది ఫైనల్ గాబట్టి మీ సవరణలతో దీనిని పోస్ట్ చెయ్యండి.
    శతధా శంకర దీప్తితొ
    శతపద్యరచన లుజేయ శంకన చంద్రా
    సతమత మైయను కొంటివి
    శతమా నంభవ తియనుచు శాపము నొసగెన్!
    విధేయుడు,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. రాజేశ్వరి గారూ,
    పద్యం బాగుంది. కాని రెండు చోట్ల గణదోషం ఉంది. నేను ఇలా సవరించాను.

    మితిమీరిన భక్తి గలిగి
    సతతము పూజలు సలుపుచు శశిభూషణుచే
    నతులితముగ పుణ్యము గొన
    శతమానం భవతి యనుచు శాపము నొసఁగెన్.

    రిప్లయితొలగించండి
  16. చంద్ర శేఖర్ గారి పూరణ ...........

    శతధా శంకర దీప్తిని
    శతపద్యరచనలు జేయ శంకను చంద్రా
    సతమతమై యనుకొంటివి
    శతమానం భవతి యనుచు శాపము నొసగెన్!

    రిప్లయితొలగించండి
  17. చంద్ర శేఖర్ గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు. ఒకటి, రెండు చిన్న సవరణలు మాత్రం చేసాను.

    రిప్లయితొలగించండి
  18. అవలీలగా శతం పూర్తి చేసిన మీకు శుభాకాంక్షలు. కుదిరితే, ఈ శతంలో మీకు నచ్చినవి కూర్చి ప్రచురించండి.

    రిప్లయితొలగించండి
  19. మితిమీరిన కామముతో
    పతివ్రత నహల్య గనిన పాపాత్ముని యా
    శతమఖుని కన్నుగవ దశ
    శతమానం భవతి యనుచు శాపము నొసగెన్

    ఎవరిచ్చారో చెప్పనక్కరలేదు కదా :-)

    ప్రతి దినమును పూరణకై
    అతి చతురతతో సమస్యలందించు వి"శే
    షత" నొప్పు బ్లాగుకున్ శత
    శతమానం భవతి యనుచు శంకరు గొలుతున్!

    రిప్లయితొలగించండి
  20. నారాయణ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. ధనవాదాలు.

    రవి గారూ,
    ధన్యవాదాలు. మీ సూచన గమనించాను. ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాను.

    భైరవభట్ల కామేశ్వర రావు గారూ,
    పూరణ అద్భుతంగా ఉంది.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. చితికిన కాన్సరు రోగికి
    బ్రతుకిక క్షణము క్షణము భలు భారము కాగా
    మెతుకులు కోరెడు బాపడు
    శతమానం భవతి యనుచు శాపము నొసఁగెన్

    రిప్లయితొలగించండి