అవకాశం వచ్చింది కదా అని మరొక- 'అరుణ' పూరణ కావించాను..అవధరించండి: నేల నాది; నింగి-నీరును నావియె తల్లి అడవి నాది గాలి నాది పల్లెనాదని పోరు బావుటా నెగరేసి పచ్చనైన చెట్టు భగ్గుమనెను.
గన్నవరపు వారూ, మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
పీతాంబర్ (అంబర్ 50) గారూ, చాలా చక్కని పూరణ. బాగుంది. అభినందనలు. రెండవ పాదంలో యతిభంగం జరిగింది. దానిని ఇలా సవరించాను. "జీవ జాతి కెల్ల చేవ నిచ్చి"
రాజేశ్వరి గారూ, రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు. మొదటి పద్యం రెండవ పాదంలో "ఘాటు" కంటే "ఘనము" బాగుంటుందేమో. మూడవ పాదంలో "లేదు+అకట= లేదకట" అవుతుంది. అక్కడ యడాగమం రాదు. అలాగే "స్వాసించుట". బహుషా మీరు శ్ కొట్టబోయి స్ కొట్టారు. ఆ పాదాన్ని ఇలా చెప్తే సరి. "సందు లేదయయ్యొ శ్వాసించుటకునైన" రెండవ పద్యంలో "అనగ యంతింత" కాకుండా "అనగ నంతింత" అని ఉండాలి.
చంద్ర శేఖర్ గారూ, చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
శంకరయ్య గారు మీ సహనానికి కృతజ్ఞతలు తప్పులు తడకలు రాసినపుడల్లా సహనంతొ సవరణ చేస్తున్నందుకు ఎలా కృతజ్ఞతలు తెలియ జెప్పాలొ తెలియ టల్లేదు. మీరిబ్బంది పడినా నేర్పు తున్నందుకు మరీ మరీ ధన్య వాదములు.
నారాయణ గారూ, క్షమించాలి. అంత మంచి పద్యాలు నా దృష్టికి ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. రెండవ పద్యంలో రెండు లోపాలున్నాయి. రెండవ పాదంలో యతి తప్పింది. "తల్లి యడవి నాది తతము నాది" అంటే సరి. తతము అంటే గాలి. మూడవ పాదంలో "నాదని" అన్నచోట గణదోషం ఉంది. "పల్లె లోన" అంటే సరిపోతుందేమో. గమనించండి.
నమస్కారమండీ, నా పూరణ :
రిప్లయితొలగించండిరచ్చబండ యనుచు రావి చెట్టుకి గ్రింద
రాజకీయ మాడ ప్రజలు గూడి
రచ్చలెక్కువయ్యె చిచ్చుయు పెచ్చయ్యె
పచ్చ నైన చెట్టు భగ్గుమనియె
మరో పూరణండీ:
రిప్లయితొలగించండిపరగి చెట్టు దాపు పంచశిఖుడు వేసె
పరమశివుని వైపు పదును కోల
వెచ్చచూపు జూడ చిచ్చయ్యె ఝషకేతు
పచ్చనైన చెట్టు, భగ్గుమనియె
పంచశిఖుడు =ఝషకేతుడు =మన్మధుడు
ప్రాణవాయు విచ్చి ఫలపుష్పములనిచ్చి
రిప్లయితొలగించండిజీవ జాతి కెల్ల తిండి నిచ్చి
గాలి నీరు నేల కలుషిత మైపోవ
పచ్చనైన చెట్టు భగ్గు మనెను.
మాస్టారూ, మహా భారతం - ఆది పర్వం లోంచి తక్షక-కశ్యప సంవాదం ఆధారంగా,
రిప్లయితొలగించండితక్షక విషజనిత దహనుడు గాల్చగ
పచ్చనైన చెట్టు భగ్గు మనెను
మరల కశ్యపుండు మహిమతో నిల్పెనా
విటపి(నాగరాజు విభ్రమ మంద!
కాలకూట విషము కంటెను తీక్ష్ణము
రిప్లయితొలగించండినాదు గరము: దీని నాపలేవు
అరయుమంచు తరువునంటిన యంతనె
పచ్చనైన చెట్టు భగ్గుమనెను.
(పరీక్షిత్తును కాటు వేసేందుకు వెళ్తున్న తక్షకుడు, ఆ రాజును రక్షించేందుకు వెళ్తున్న కశ్యపుడిని వారిస్తూ, తన విషం ఎంత శక్తివంతమైనదో చూపుతున్న సందర్భం ఇది)
అవకాశం వచ్చింది కదా అని మరొక- 'అరుణ' పూరణ కావించాను..అవధరించండి:
రిప్లయితొలగించండినేల నాది; నింగి-నీరును నావియె
తల్లి అడవి నాది గాలి నాది
పల్లెనాదని పోరు బావుటా నెగరేసి
పచ్చనైన చెట్టు భగ్గుమనెను.
డబ్బు కాశ పడుచు డాబాలు మేడలు
రిప్లయితొలగించండిగగన తలము నంటు ఘాటు గాను.
సందు లేదు యకట ! స్వాసించుటకునైన
పచ్చనైన చెట్టు భగ్గు మనెను.
----------------------------------
అత్త కోడ లనగ యంతింత యనరాదు
రచ్చ కెక్కి తగవు రగులు సెగలు.
చిచ్చు రేగి తుదకు హెచ్చు మంట లెగయ
పచ్చ నైన చెట్టు భగ్గు మనెను
చంద్ర శేఖర్ గారి పూరణ -
రిప్లయితొలగించండితక్షక విషజనిత దహనుడు గాల్చగ
పచ్చనైన చెట్టు భగ్గు మనెను
మరల కశ్యపుండు మహిమతో నిల్పెనా
విటపి నాగరాజు వింతపడగ.
గన్నవరపు వారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
పీతాంబర్ (అంబర్ 50) గారూ,
చాలా చక్కని పూరణ. బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో యతిభంగం జరిగింది. దానిని ఇలా సవరించాను.
"జీవ జాతి కెల్ల చేవ నిచ్చి"
రాజేశ్వరి గారూ,
రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
మొదటి పద్యం రెండవ పాదంలో "ఘాటు" కంటే "ఘనము" బాగుంటుందేమో. మూడవ పాదంలో "లేదు+అకట= లేదకట" అవుతుంది. అక్కడ యడాగమం రాదు. అలాగే "స్వాసించుట". బహుషా మీరు శ్ కొట్టబోయి స్ కొట్టారు. ఆ పాదాన్ని ఇలా చెప్తే సరి.
"సందు లేదయయ్యొ శ్వాసించుటకునైన"
రెండవ పద్యంలో "అనగ యంతింత" కాకుండా "అనగ నంతింత" అని ఉండాలి.
చంద్ర శేఖర్ గారూ,
చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
శంకరయ్యగారూ, నమస్కారం- మీకో పెద్ద వ్యాఖ్య రాసాను- ఏదో సమస్య వచ్చినట్లుంది, అది నాకు సారీ చెప్పింది. మీ పోస్టలు అడ్రసు ఇవ్వగలరా, దయచేసి?
రిప్లయితొలగించండిశంకరయ్య గారు మీ సహనానికి కృతజ్ఞతలు తప్పులు తడకలు రాసినపుడల్లా సహనంతొ సవరణ చేస్తున్నందుకు ఎలా కృతజ్ఞతలు తెలియ జెప్పాలొ తెలియ టల్లేదు. మీరిబ్బంది పడినా నేర్పు తున్నందుకు మరీ మరీ ధన్య వాదములు.
రిప్లయితొలగించండిశంకరయ్యగారు, ఈ సమస్యకు నేను రెండు పూరణలు పంపాను.. అవి వచ్చినట్లు లేదు..?
రిప్లయితొలగించండినారాయణ గారూ,
రిప్లయితొలగించండిక్షమించాలి. అంత మంచి పద్యాలు నా దృష్టికి ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు.
రెండవ పద్యంలో రెండు లోపాలున్నాయి. రెండవ పాదంలో యతి తప్పింది. "తల్లి యడవి నాది తతము నాది" అంటే సరి. తతము అంటే గాలి. మూడవ పాదంలో "నాదని" అన్నచోట గణదోషం ఉంది. "పల్లె లోన" అంటే సరిపోతుందేమో. గమనించండి.