15, సెప్టెంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 96

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
రెక్కలు గల చాప నెక్కె రేలంగి భళా!

9 కామెంట్‌లు:

 1. ఒక్కడె రంగము నేలెను
  ప్రక్కలు విరుగేటి యటుల ప్రజలును నగగా
  టెక్కెము టక్కుల మారియొ
  రెక్కలు గల చాప నెక్కె రేలంగి భళా !

  రిప్లయితొలగించండి
 2. చక్కని చుక్కల సొక్కుచు
  చిక్కని మబ్బులను దేలు! చిక్కితి నీకే!
  నక్కను దొక్కితివన నగి,
  రెక్కలు గల చాపనెక్కె రేలంగి భళా.

  రిప్లయితొలగించండి
 3. గన్నవరపు నరసింహమూర్తి గారూ,
  నారాయణ గారూ,
  నిన్న సమస్య ఏమివ్వాలని ఆలోచిస్తుంటే టేబుల్ పైన "సువర్ణ సుందరి" సినిమా సి.డి. కనిపించింది. అందులో రేలంగి మాయల చాప నెక్కి ఆకాశంలో తిరగడం గుర్తుకొచ్చింది. సమస్య తయారయింది.
  మీ పూరణలు మనోరంజకంగా ఉన్నాయి. అభినందనలు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 4. నా పూరణ .......
  గన్నవరపు వారు ప్రస్తావించిన విషయమే.

  లెక్కింప నుత్తమంబై
  చొక్కంబైనది "సువర్ణ సుందరి" చిత్రం
  బక్కజముగ నటియించుచు
  రెక్కలు గల చాప నెక్కె రేలంగి భళా!

  రిప్లయితొలగించండి
 5. శంకరయ్యగారూ
  మీ అన్న గారి ఆత్మ శాంతించాలని ఆయనకు ఉత్తమ లోక ప్రాప్తి చేకూరాలని భగవంతునికి మా ప్రార్ధన. మీరు తెలుగు భాషకు సాహిత్యానికి పెద్ద కాలము సేవ చేయాలని మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య సుఖ సంపదలు భగవంతుడు చేకూర్చాలని కూడా కోరుకొంటున్నాను.
  నరసింహ మూర్తి.

  రిప్లయితొలగించండి
 6. చుక్కల రాణిని కనుగొన
  మక్కువ తో వెదకినంత మాంత్రికుడిచ్చెన్
  మిక్కిలి మహిమలు గలిగిన
  రెక్కలు గల చాప నెక్కె రేలంగి భళా !

  రిప్లయితొలగించండి
 7. రాజేశ్వరి నేదునూరి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 8. గ్రక్కున డైలాగులిడుచు
  వెక్కస మింతయును లేక వేడుక మీరన్
  చక్కగ నవ్వించుట కే
  రెక్కలు గల చాప నెక్కె రేలంగి భళా! ?

  రిప్లయితొలగించండి