27, సెప్టెంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 107

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసినను సమస్య చంద్రశేఖర్ గారు పంపించారు. వారికి ధన్యవాదాలు.
ఆ సమస్య ఇది ...........

చదువు రానట్టి వారె విజ్ఞానఖనులు.

13 కామెంట్‌లు:

 1. శ్రీ చంద్రశేఖర్ గారిచ్చిన సమస్యకు పూరణ

  కరమున కాసులు చాలవు
  సిరిపురిలో బుట్టలేదు,చింతామణిగా
  ఎర వేయగ బెట్టన్ ఏ
  కరువు, మగన, కంపుమూట కష్టము దీర్చెన్.

  రిప్లయితొలగించండి
 2. పదులు వందలు వేలను పక్కనెట్టి
  పుడమి తల్లిని సేవించి పూజ్యులైరి
  ఎదగడానికి ఎన్నెన్నొ ఎత్తులేసి
  చదువు రానట్టి వారె విజ్ఞాన ఖనులు.

  రిప్లయితొలగించండి
 3. చదువు రానట్టి వారె విజ్ఞాన ఖనులు-
  ఔదురాచార్యు పదములు పొందు గూడ
  విమతులైన రాకొమరులు విష్ణుశర్మ
  జేరి సర్వ శాస్త్ర చతురులైరి గాదె!

  రిప్లయితొలగించండి
 4. కాళిదాసు రమణులునా కనకదాసు
  మొల్ల కుంబార మొదలగు ముఖ్యు లంద
  రేమి చదివి శాశ్వతముగనిల నిలచిరొ
  చదువు రా,నట్టి వారె విజ్ఞాన ఖనులు.
  విన్నపము: భక్త కనకదాసు కన్నడం, కాళిదాసు సంస్కృతం,మొల్ల తెలుగు, కుంబార మరాఠి, రమణులు తమిళం - తెలిసిన రకంగా ప్రయత్నించాను.

  రిప్లయితొలగించండి
 5. వార్త పత్రికల నమ్ముతు తిరిగి
  వాలు వీధిన ధనము బెట్టి భువి నందు కుబేరుగా
  వాసి కెక్కె గదా వార్ను దొర గారు
  చదువు రానట్టి వారె విజ్ఞాన ఖనులు!!!!

  (వాల్ స్ట్రేట్ లోని అమెరికన్ స్టాకు మార్కెట్ లో పెట్టుబళ్ళతో ప్రపంచం లో అందరికంటే ధనవంతుడు గా వార్న్ బఫ్ఫెట్ అవతరించారు!!!)

  రిప్లయితొలగించండి
 6. చలువ మేడలో చతికిలబడి
  చదువు మాని చలన చిత్రములతో కాలము గడిపినా
  చాలు కదా వైదుడగుటకు ధనము!
  చదువు రానట్టి వారె విజ్ఞాన ఖనులు.

  రిప్లయితొలగించండి
 7. చదువు కొనగల శక్తియు న్నంత వరకు
  పదును బెట్టుచు మెదడుకు పరుగులేల ?
  యెదను హాయిగ నింపెడి మధువు లుండ
  చదువు రానట్టి వారె విజ్ఞానఖనులు .

  రిప్లయితొలగించండి
 8. చదువు చదువగ దేశమ్ము చాలదనుచు
  తల్లిదండ్రులుఁ సంస్కృతిఁ దల్లిభాష
  మొదలు విడిచిన ఘనుడగు మొరటు గంటె
  చదువు రానట్టి వారె విజ్ఞాన ఖనులు.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ చంద్రశేఖర్ గారిచ్చిన సమస్యకు పూరణ

  పొరుగూరు పనికి వెళ్ళుచు
  పరకాంతల గృహముఁ చొక్క పరగడుపుననున్
  సరియైన కూడు చిక్కని
  కరువున గన గంపుమూట కష్టము దీర్చున్.

  రిప్లయితొలగించండి
 10. పీతాంబర్ గారూ,
  చంద్రశేఖర్ గారి సమస్యకు మీ పూరణ పద్యం నిర్దోషంగా ఉన్నా బావం కాస్త తికమక పెడుతున్నది.
  చంద్రశేఖర్ గారి పక్షాన ధన్యవాదాలు.

  సమస్యా పూరణం -107 కు మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  "ఎత్తులు + వేసి = ఎత్తులేసి" అనడం కంటే "ఎత్తులమర" అంటే బాగుంటుందేమో?

  నారాయణ గారూ,
  చక్కని ఐతిహ్యంతో పూరణ చేసారు. అభినందనలు.
  రెండవ పాదంలో భావం క్లిష్టంగా ఉంది. యతి తప్పింది. గమనించండి.

  చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  శ్రీ గారూ,
  మీ రెండు పూరణలను ఈ సాయంత్రానికి సవరించి వ్యాఖ్య పెడతాను. చక్కని భవాలు .. కాని పద్య లక్షణాలే కుదరలేదు.

  నేదునూరి రాజేశ్వరి గారూ,
  పూరణ భావం బాగుంది. అభినందనలు.
  మొదటి పాదంలో యతి తప్పింది.
  దానిని "చదువు "కొన"గల్గు నార్థిక శక్తి యున్న" అంటే సరిపోతుంది.

  గన్నవరపు వారూ,
  మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ గారూ,
  మీ పద్యాలకు నా సవరణలు.
  1.
  తిరిగి వీధులు వార్త పత్రికల నమ్మి
  వాలు స్ట్రీటులో తన పెట్టుబడులు పెట్టి
  వాసి కెక్కెను ధనికుడై వార్ను దొరయె
  చదువు రానట్టి వారె విజ్ఞాన ఖనులు.
  2.
  చలువ మేడల లోపల చతికిలబడి
  చదువకనె సినిమాల్జూచి సమయ మంత
  గడిపి ధనముతో వైద్యుడై ఘనత గనెను
  చదువు రానట్టి వారె విజ్ఞాన ఖనులు.

  రిప్లయితొలగించండి
 12. రైతు కిష్టయ్య నుడివెరా రత్నమైన
  మాట బుట్టిన గిట్టక మానము మరి
  మంచిజేసి మన్ననలతో మట్టిగలువు
  చదువు రానట్టి వారె విజ్ఞాన ఖనులు.
  విన్నపము: రైతు కిష్టయ్య నిజంగానే మా వూర్లో రైతు. యేమీ చదువుకోక పోయినామంచి వేదాంతం చెప్పేవాడు. అందరికి సహాయం చేసేవాడు. కాణీ ఆశి౦చేవాడుకాదు, ఇచ్చినా తీసుకోనేవాడుకాదు.

  రిప్లయితొలగించండి