29, సెప్టెంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 109

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...........
పుట్టినప్పుడే లిఖియించు గిట్టు మనుచు.
( 'వరవిక్రయం' నాటకంలోని ఈ పద్య పాదాన్ని సమస్యగా ఇవ్వమని సూచించిన నేదునూరి రాజేశ్వరి గారికి ధన్యవాదాలు )

11 కామెంట్‌లు:

  1. 'పుట్టు' టన్నది యున్నచో గిట్టుటదియె
    వుండు, మరిగిట్టగ నదియు పుట్టెనెపుడొ
    చావు పుట్టుకల చక్రమె చాటె నౌర
    పుట్టినప్పుడే లిఖియించు గిట్టు మనుచు.

    రిప్లయితొలగించండి
  2. పంచ భూతము లొప్పగఁ బ్రాణు లైరి
    అప్పు సొప్పుల బ్రతుకుల నాప్తు లైరి
    పుట్టు నప్పుడే లిఖియించు గిట్టు మనుచు
    మట్టి బొమ్మకి యేదిర గట్టి బతుకు ?

    రిప్లయితొలగించండి
  3. ఇంకొక పూరణ:
    చిత్రము చచ్చిన వారికై యేడ్చె, దెప్ప
    టికిని చావనివాని భంగి, కనబంధ
    ములవి ఋణరూపముల వచ్చు మేలుకోర
    పుట్టినప్పుడే లిఖియించు గిట్టు మనుచు.

    విన్నపము: ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా:

    రిప్లయితొలగించండి
  4. వేల దోషుల విడచిన విడువవచ్చు
    ఒక్క యపరాధి దండింప నోప యనుచు
    న్యాయమూర్తికి సాక్ష్యము నమ్మకమును
    పుట్టినప్పుడే లిఖియించు గిట్టు మనుచు.

    రిప్లయితొలగించండి
  5. పుట్టుట యెగాని గిట్టని పుణ్యజీవి ,
    ఉనికి నూహించ తరమౌన ఈశు కైన,
    సుధను గ్రోలిన సురలెల్ల సుదతి గలరె
    పుట్టినప్పుడే లిఖి యించును గిట్టు మనుచు.

    రిప్లయితొలగించండి
  6. నమస్కారములు శంకరయ్య గారు ." గూగుల్ " లొ వెదికితె " బైబిలు " అనే ఉంది. బైబులు " అని స్పెల్లింగు కొట్టినా " బైబిలు " అనె వస్తొంది. ఇక నావద్ద ఉన్న నిఘంటువు లొ అస్సలు ఆ పదం లెదు .మరేవరైనా సందేహ నివృత్తి చేయగలరు

    రిప్లయితొలగించండి
  7. పుట్టి మూణ్ణాళ్ళ ముచ్చట ముగియు కొరకు
    రట్టు చేయగ నేలనో రాజ్య మేల
    కట్టు బట్టలు సైతము కడకు రావు
    పుట్టి నప్పుడే లిఖియించు గిట్టు మనుచు

    రిప్లయితొలగించండి
  8. నేడు కాకున్న రేపైన కీడు మూడు
    చావు దప్పింప యేరికి సాధ్యమగును?
    పుట్టినప్పుడే లిఖియించు గిట్టుమనుచు
    గాన, త్వరపడి ఆర్జించు బుణ్య ధనము.
    (చివరిపాదంలో వేసిన 'త్వరపడి', న-ణ్య ల మధ్య ప్రాసయతి- ఇవి సరైనవేనా?)

    రిప్లయితొలగించండి
  9. ఎట్టి ప్రాణియు పుట్టిన గిట్టు నిజము.
    తుట్టతుదకిది సత్యము. దుఃఖమేల?
    స్రష్ట ధర్మము జగమున సకలమునకు
    పుట్టినప్పుడే లిఖియించు గిట్టు మనుచు.

    రిప్లయితొలగించండి
  10. చంద్ర శేఖర్ గారూ,
    రెండు పద్యాల భావాలు ఉదాత్తంగా ఉన్నా చందోదోషాలు చాలా ఉన్నాయి. ఈ సాయంత్రానికి వాటిని సవరించి వ్యాఖ్యానిస్తాను.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పురణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.

    పీతాంబర్ గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
    చిన్న లోపాలున్నాయి. రెండవ పాదంలో యతి తప్పింది. మూడవ పాదంలో "సుదతి" అంటే "మంచి దంతాలున్న స్త్రీ" అని అర్థం. అది ఇక్కడ పొసగడం లేదు. నా సవరణలతో మీ పద్యం......
    పుట్టుటయె గాని గిట్టని పుణ్యజీవి
    ఉనికి నూహించఁ దరమె యీశునకు నైన
    సుధను గ్రోలిన సుర లెల్ల సుఖముఁ గనిరె
    పుట్టి నప్పుడే లిఖియించు గిట్టు మనుచు.

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    పూరణ చక్కని భావంతో నిర్దోషంగా ఉంది. ధన్యవాదాలు.

    నారాయణ శర్మ గారూ,
    మంచి భావంతో పూరణ చేసారు. అభినందనలు.
    న-ణ్య ప్రాసయతి చెల్లదు. ఆ పాదాన్ని ఇలా సవరించ వచ్చు.
    "పూని త్వరపడి యార్జించు పుణ్య ధనము."

    రిప్లయితొలగించండి