5, సెప్టెంబర్ 2010, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - 7

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ....
సారా త్రాగిన మోక్ష మందెదము శిష్యా! శంక నీ కేలరా?

6 కామెంట్‌లు:

  1. సారా గిరీశుఁడనుచున్నాడు:
    సారాయే సుర, సర్వ దేవతలకున్ సంపత్ప్రదాత్రిన్ యదే
    సారాయే గతి నీకు, నాకు, ఇలలో సర్వ ప్రభుత్వాళికిన్
    సారాయే నడిపించునీజగతినా సారాయె తా ద్రుంచురో
    సారా తాగిన మోక్షమందెదము శిష్యా! శంక నీకేలరా?

    రిప్లయితొలగించండి
  2. "కారాగారము వంటి జీవితమొకో! కాయంబు తోల్దిత్తిరో!
    సారా త్రాగిన మోక్ష మందెదము శిష్యా! శంక నీ కేలరా?
    సారమ్మీ గతినేర్వరా" యనుచునో సన్యాసి రూపస్థుడౌ
    సారాగ్రేసరుడున్ వచించు, భువిపై సాధుత్వమున్జంపుచున్.

    రిప్లయితొలగించండి
  3. ఈ 'రా' ప్రక్కన 'మా' ను వ్రాసి పలుక న్నీశుండె శ్లాఘించుగా
    ఏరా! చింతలు నీకుయేల వినరా !ఈ రామనామామృతం
    సార మ్మేగద వేదమంత్రములకున్ సందేహ మింకేల నీ
    సారా త్రాగిన మోక్ష మందెదము శిష్యా! శంక నీ కేలరా?

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రామనామ మనే సారా త్రాగుమన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. బోరున్ కొట్టెను బ్రహ్మచర్య మనుచున్ పోరాడి పెండ్లాడగా
    తీరా జూడగ ప్రేమ పాశములనున్ త్రెంపించి కాల్పించెడిన్
    వారం వారము నత్త గారి పలుకుల్ బాధించి సాధింపగన్
    సారా త్రాగిన మోక్ష మందెదము శిష్యా! శంక నీ కేలరా?

    రిప్లయితొలగించండి