2, సెప్టెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 84

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
ఫాలనేత్రుండు మరునకు ప్రాణసఖుఁడు.

5 కామెంట్‌లు:

  1. గరళ కంఠుని తపమును కాలరాయ
    విరుల బాణము వేసెను మరుడు- వాని
    గావలేదు; రోసెను శూలి! కాడు, కాడు-
    ఫాలనేత్రుండు మరునికి ప్రాణ సఖుడు.

    రిప్లయితొలగించండి
  2. కాల చక్రమ్ము నందుండు కాలనేమి,
    పాల సంద్రమ్ము నందుండు పదుమ నాభ.
    నేల నింగియు తరతమ బేలతనము
    పాల నేత్రుండు మరునకు ప్రాణ సఖుడు

    శంకరయ్య గారు అసలు ఇది ఎలా ఉంటుందో అని ఊరికె రాసాను ఏమాత్రం బాగుండక పోయినా ప్రింటు చేయ వలదని మనవి

    రిప్లయితొలగించండి
  3. నేదునూరి రాజేశ్వరి గారూ,
    మీరు చెప్పింది నిజమే. అందుకే ప్రచురించడం లేదు. మీ ప్రయత్నాన్ని కొనసాగించండి.

    రిప్లయితొలగించండి
  4. నారాయణ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. నా పూరణ ................

    తలను పువ్వుగా నెలవంకఁ దాల్చె నెవఁడు?
    ఆ రతీదేవి యెవని యర్ధాంగి యయ్యె?
    కష్ట సుఖములఁ దోడుండు ఘనుఁ డెవండు?
    ఫాలనేత్రుండు; మరునకు; ప్రాణ సఖుఁడు.

    రిప్లయితొలగించండి