దశావతార స్తుతి - (శ్రీ కృష్ణావతారం)
మ.అతి దోఃపీడన కర్కరీ ఫలిత కంఠాభత్వదుత్తర్తు ధూ
ర్త తృణావర్త దృఢాంగపాతహత గోత్రాభర్తృకోత్పాదిత
క్రతుభుగ్రాడ్గ్రహణాగ్రహోన్ముఖ శతారధ్వస్త మైనాక ని
ష్పతనభ్రాంతిక నందగోపకసుతబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.
(ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్దం)
భావం -నందగోపసుతుడవైన కృష్ణ పరమాత్మా! నిన్ను అపహరించుకొని పోయిన ధూర్తుడైన తృణావర్తుని కంఠాన్ని దోసకాయను నలిపినట్లు నీవు నీ హస్తాలతో నలిపివేయగా వాని శరీరం క్రింద పడగా గోపాలకులకు దెబ్బలు తగిలాయి. దేవేంద్రుని పట్టుకొనడానికి పైకి ఎగిరిన మైనాకుని రెక్కలను ఇంద్రుడు వజ్రాయుధంతో ఛేదించగా ఆ మైనాకుడు క్రింద పడిపోయాడనే భ్రాంతి గోపాలకులకు కలిగింది. అటువంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి