అయ్యా శంకరయ్య మాస్టారు గారు నమస్కారములు తెలుగు భాష పై మీకున్న పట్టు అభిరుచి అద్భుతం దయచేసి పురాణ జరిగిన పద్యాల భావార్థాలు ఇస్తే నా లాంటి భాష జ్ఞాన హినునికి బాగుంటుంది నాకు పద్య పురనాలంటే ఇష్టంమే కాని నాకు కష్టం దయచేసి ఒక సారి rastrachethana.blogspot.com ను సందర్శించి మీ విలువైన అభిప్రాయాన్ని అందించగలరని వినమ్ర విగ్న్యాప్తి
యోగేశ్వర్ గారూ, నమస్కృతులు. శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీరు సూచించిన "రాష్ట్రచేతన" బ్లాగును బుక్ మార్క్ చేసాను. ఈ బ్లాగు ఉన్నట్టు తెలుసు కాని ఎప్పుడూ వీక్షించలేదు. నేను ఒకప్పుడు దైనందిన శాఖకు వెళ్ళిన వాడినే. మీరు చెప్పినట్లు పూరణ పద్యాల వివరణ ఇవ్వడానికి సమయానుకూలత కష్టం. ప్రయత్నిస్తాను.
రాజేశ్వరి నేదునూరి గారూ, పూరణ చాలా బాగుంది. అభినందనలు. మూడవ పాదంలో చివర "కలిమహిమ" అన్న చోట గణదోషం ఉంది. దానిని ఇలా సవరిస్తే సరిపోతుంది. చుక్కు ముడిని విప్పి చెప్ప కలిమహిమ.
అయ్యా శంకరయ్య మాస్టారు గారు నమస్కారములు
రిప్లయితొలగించండితెలుగు భాష పై మీకున్న పట్టు అభిరుచి అద్భుతం
దయచేసి పురాణ జరిగిన పద్యాల భావార్థాలు ఇస్తే నా లాంటి భాష జ్ఞాన హినునికి బాగుంటుంది
నాకు పద్య పురనాలంటే ఇష్టంమే కాని నాకు కష్టం
దయచేసి ఒక సారి rastrachethana.blogspot.com ను సందర్శించి మీ విలువైన అభిప్రాయాన్ని అందించగలరని వినమ్ర విగ్న్యాప్తి
కుక్కనొక్కదానిఁ చక్కనిదని తెచ్చి
రిప్లయితొలగించండిపెంచుకొంటి మిగుల ప్రేమతోడ
అప్రజాతమాయెనది; కాని చూడ, దా-
నక్కకు జనియించె కుక్క యొకటి.
యోగేశ్వర్ గారూ,
రిప్లయితొలగించండినమస్కృతులు. శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీరు సూచించిన "రాష్ట్రచేతన" బ్లాగును బుక్ మార్క్ చేసాను. ఈ బ్లాగు ఉన్నట్టు తెలుసు కాని ఎప్పుడూ వీక్షించలేదు. నేను ఒకప్పుడు దైనందిన శాఖకు వెళ్ళిన వాడినే. మీరు చెప్పినట్లు పూరణ పద్యాల వివరణ ఇవ్వడానికి సమయానుకూలత కష్టం. ప్రయత్నిస్తాను.
నారాయణ గారూ,
రిప్లయితొలగించండినన్నూ, నా మిత్రులనూ బాగా నవ్వించింది మీ పూరణ. ధన్యవాదాలు.
పంది యొకటి దిరిగె పరమాత్మ గుడిచుట్టు
రిప్లయితొలగించండిభక్తి పదడు గురిసె ముక్తి నీయ
చిక్కు ముడిని విప్పి చెప్పెద కలిమహిమ
నక్క కుజని యించె కుక్క యొకటి.
padaDu = vibhUdi [ bUDida ]
కురు కులమ్ము జెరచ, కుటిల యత్నాల్ జేయు
రిప్లయితొలగించండిశకునికి తనయుండు నొకడు పుట్టి,
విభుని సేవ జేసె విశ్వాస పాత్రుడై -
నక్కకు జనియించె కుక్క యొకటి !
రాజేశ్వరి నేదునూరి గారూ,
రిప్లయితొలగించండిపూరణ చాలా బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో చివర "కలిమహిమ" అన్న చోట గణదోషం ఉంది. దానిని ఇలా సవరిస్తే సరిపోతుంది.
చుక్కు ముడిని విప్పి చెప్ప కలిమహిమ.
మక్కువగ జనించె మాంధాత తండ్రికి
రిప్లయితొలగించండివిఘ్న నాయ కుండు వెడగు ముఖము
వింత కాదిది చెప్పగ వేయి నేల
నక్కకు జనియించె కుక్క యొకటి
వెడగు = వికారము
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండినక్క వంటి శకునికి కుక్క వంటి విశ్వాసపాత్రుడైన ఉలూకుడు కొడుకుగా జన్మించిన విషయంతో అద్భుతమైన పూరణ చేసారు. ధన్యవాదాలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది పూరణ. కాని మూడవ పాదం ఆటవెలదికి బదులు తేటగీతి అయింది. దానిని ఇలా సవరించాను.
"వింత కాదు చెప్ప వేయి మాట లవేల?"
జిత్తు లన్ని జూపి చిరుత జంపెడు కోర్కె
రిప్లయితొలగించండినక్కకు జనియించె ; కుక్క యొకటి
దాని కుటిల బుద్ది దరిజేరి చిరుతకు
చెప్ప చంపి వేసె చీల్చి చీల్చి .
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమంచి విరుపుతో సమస్యను సమర్థవంతంగా పూరించారు. బాగుంది.
అభినందనలు.