10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 91

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
పరహిత మొనరించువాఁడె పాపాత్ముఁ డగున్.

6 కామెంట్‌లు:

 1. ఈనాటి సమస్యను ఒక్కరు కూడా పూరించలేదు. కారణం తెలియదు.
  ఇక నా పూరణ ............

  స్థిర పుణ్య ఫలము నందును
  పరహిత మొనరించువాఁడె; పాపాత్ముఁడగున్
  నిరతము స్వార్థపరుండయి
  కరుణా రస రహితుఁడైన కఠినాత్ముండే.

  రిప్లయితొలగించండి
 2. నరులకు హితములు,దేవుని
  వరములుగా రూపు దాల్చి వనముల బెరుగున్!
  నరుకుచు నట పాదపరూ
  ప రహిత మొనరించువాఁడె; పాపాత్ముఁడగున్!!

  రిప్లయితొలగించండి
 3. చిన్న టైపాటు సవరణ తో ... ..

  నరులకు హితములు,దేవుని
  వరములుగా రూపు దాల్చి వనములె బెరుగన్!
  నరుకుచు నట పాదపరూ
  ప రహిత మొనరించువాఁడె; పాపాత్ముఁడగున్!!

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మనోహరమైన పూరణ. ‘పాదప రూప రహితము’ చక్కని ప్రయోగం. మీకు పాదాభివందనాలు.

  రిప్లయితొలగించండి
 5. అయ్యో ! గురు వర్యా ! అదేమిటండీ! మాకు మీ ఆశీస్సు లదించండి. అదే పదివేలు. మీ పదములకు శత సహస్ర వందనాలు.

  రిప్లయితొలగించండి
 6. అరెవో! ఏమని సెబితివి?:
  "పరహిత మొనరించువాఁడె పాపాత్ముఁ డగున్"!!!
  సరిజేయర టైపాటును:👇
  "పరహత మొనరించువాఁడె పాపాత్ముఁ డగున్" :)

  రిప్లయితొలగించండి