29, సెప్టెంబర్ 2010, బుధవారం

చమత్కార (చాటు) పద్యాలు - 37

ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ! - 2
సీ.
శ్రీరాము నాత్మలోఁ జేర్చుకొన్న మహాత్మ!
చిత్తంబులోన వసింపు మయ్య;
కడు లావుమైఁ జౌటి కడలి దాటిన ధీర!
కడలేని భవవార్ధిఁ గడపు మయ్య;
ధవుని సేమంబు సీతకు నొసంగిన మేటి!
పరిణామ మొసఁగి చేపట్టు మయ్య;
ధట్టించి మందుల గట్టుఁ దెచ్చిన దేవ!
జీవనౌషధ మిచ్చి ప్రోవు మయ్య;
తే. గీ.
హనుమ! నీవు సమర్థుఁడ వయ్యు యిపుడు
నింత నన్ను నుపేక్ష సేయింపఁ దగునె?
మహిత శ్రీరామ పదభక్తిమద్విధేయ!
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!
( అజ్ఞాత కవి )

2 కామెంట్‌లు:

  1. మాష్టారూ!
    మీరు ప్రకటిస్తున్న చమత్కార పద్యాలలోని చమత్కారాన్ని కూడా మీరు వివరిస్తూ ఉంటే ప్రయోజన బాహుళ్యం సిద్ధిస్తుందని నా భావన.

    రిప్లయితొలగించండి
  2. సంజీవిని పర్వతానికి " మందుల గట్టు " అని పద ప్రయోగం చేయడం నాకు బాగా నచ్చింది. కవికి ప్రణామం.

    రిప్లయితొలగించండి