మాష్టారూ, "విను" అన్న చోట విరామం ఇచ్చి ఇంకో రకంగా పూరించాను. బాగుంటే బ్లాగులో వేయ ప్రార్ధన.
చని విశ్వనాధకు తెలుగు మన బాలమురళికి సరిగమల సంగీతం అని నేర్పబూనకు నెపుడు విను, వారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్. సూచన: "అని" అంటే పోరున అనే అర్థం తీసుకొనవచ్చు.
మందా పీతాంబర్ (అంబర్ 50) గారూ, "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. చక్కని పూరణ. అభినందనలు. కాకుంటే మొదటి పాదంలో మూడవ గణం "జగణం" అవుతున్నది. అక్కడ సరి గణం ఉండాలి కదా. దానిని "కనిపించిన వారలకున్" అని సవరిస్తే ఎలా ఉంటుందంటారు?
నేదునూరి రాజేశ్వరి గారూ, మంచి పూరణ. అభినందనలు. కాకుంటే గణదోషాలున్నాయి. రెండవ పాదంలో "కూర్చున్న కుత్సిత శూకములకుకున్" అన్నచోట, మూడవ పాదంలో "య జేయ" అని బేసి గణంగా జగణాన్ని వేయడం. నా సవరణలతో ఆ పద్యం ...................
కనకపు సింహాసనమున శునకములౌ కుత్సితమతి శూకమ్ములకున్ తన గోడును తెలియ పరచ విను వారికి చెప్పువాడు వెధవగ దోచున్.
నమస్కారమండీ. నా పూరణ:
రిప్లయితొలగించండిపెను పెద్దల గ్రామమ్మున
కనకమ్ములు గలిగి యున్న కాసరములకున్
శునకములై పైబడెడున్
వినువారికి చెప్పువాఁడు వింతగ (వెధవగఁ) దోచున్.
ఘనవేద విద్యల మరచి
రిప్లయితొలగించండిజని భారతదేశ మహిమ శంకిం చెడినా
మనముతొ ఘనపాఠంబుల్
విను వారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్.
సూచన: జని=జనని=తల్లి
మరో పూరణండీ:
రిప్లయితొలగించండిపెను విద్దెలు చదివుండియు
వినయమ్మున భూషితుండు విదురుడు నయ్యున్
తన భాష గాకపోతే
వినువారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్.
కని పించిన వారి కెల్ల
రిప్లయితొలగించండికని పించిన వన్ని జెప్పి కథ వినిపింపన్
మనమున విసుగని పించును
వినువారికి చెప్పు వారు వెధవగ దోచున్
మాష్టారూ, "విను" అన్న చోట విరామం ఇచ్చి ఇంకో రకంగా పూరించాను. బాగుంటే బ్లాగులో వేయ ప్రార్ధన.
రిప్లయితొలగించండిచని విశ్వనాధకు తెలుగు
మన బాలమురళికి సరిగమల సంగీతం
అని నేర్పబూనకు నెపుడు
విను, వారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్.
సూచన: "అని" అంటే పోరున అనే అర్థం తీసుకొనవచ్చు.
కనకపు సిం హాసనమున
రిప్లయితొలగించండిశునకములై కూర్చున్న కుత్సిత శూకములకున్
తన గోడును తెలియ జేయ
విను వారికి చెప్పు వాడు వెధవగ దోచున్
శూకము = తేలు కొండి ,వరి ముల్లు.
వినినంత జనులు ఆగక
రిప్లయితొలగించండితనగొప్పలు చెప్పి చెప్పి దంచుచు ఊకన్
జనులను ఊదర గొట్టగ
వినువారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్.
చంద్ర శేఖర్ గారి పూరణ .............
రిప్లయితొలగించండిచని విశ్వనాధకు తెలుగు
మన బాలమురళికి సరిగమల సంగీత
మ్మని నేర్పబూనకు నెపుడు
విను, వారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్.
గన్నవరపు వారూ,
రిప్లయితొలగించండిపద్యం చక్కగా, నిర్దోషంగా ఉంది. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నాయి. ముఖ్యంగా రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
మందా పీతాంబర్ (అంబర్ 50) గారూ,
రిప్లయితొలగించండి"శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది.
చక్కని పూరణ. అభినందనలు.
కాకుంటే మొదటి పాదంలో మూడవ గణం "జగణం" అవుతున్నది. అక్కడ సరి గణం ఉండాలి కదా.
దానిని "కనిపించిన వారలకున్" అని సవరిస్తే ఎలా ఉంటుందంటారు?
నేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిమంచి పూరణ. అభినందనలు.
కాకుంటే గణదోషాలున్నాయి. రెండవ పాదంలో "కూర్చున్న కుత్సిత శూకములకుకున్" అన్నచోట, మూడవ పాదంలో "య జేయ" అని బేసి గణంగా జగణాన్ని వేయడం.
నా సవరణలతో ఆ పద్యం ...................
కనకపు సింహాసనమున
శునకములౌ కుత్సితమతి శూకమ్ములకున్
తన గోడును తెలియ పరచ
విను వారికి చెప్పువాడు వెధవగ దోచున్.
పనిలేని బధిరు డొక్కడు
రిప్లయితొలగించండిచనగ ప్రసంగమునకున్ ప్రసాదము కొరకై
తనకట బుర్రల నూపుచు
వినువారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్