16, సెప్టెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 97

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను నేదునూరి రాజేశ్వరి గారు పంపించారు. వారికి ధన్యవాదాలు.
బమ్మకైన తిరుగు రిమ్మ తెగులు.

11 కామెంట్‌లు:

 1. దుడ్డు వెక్కువైన నడ్డమ్ము నెవ్వడు
  దొమ్మరింట దూర దొడ్డ దొరకుఁ
  కొమ్మ గానబడిన తిమ్మ గెంతులు వైచు
  బమ్మ కైన తిరుగు రిమ్మ (జిమ్మ)తెగులు.

  రిప్లయితొలగించండి
 2. హావ భావములకు అవసరమదిలేదు
  వాచకమ్ము పైన ధ్యాస లేదు
  ఎక్సు పోజు చాలు ఇది తెలుగు సినిమా!
  బమ్మ కైన తిరుగు రిమ్మ తెగులు.

  రిప్లయితొలగించండి
 3. మరో పూరణండీ

  ఆ.వె. ఇమ్ముగుండఁ దరమె కిమ్మనకుండను
  దొమ్మ రింట నుండ బొమ్మ కైన
  కొమ్మఁ జూడగానె తిమ్మ గెంతులు వైచు
  బమ్మ కైన తిరుగు రిమ్మ తెగులు.

  రిప్లయితొలగించండి
 4. నమస్కారములు. నా పూరణ:

  అడ్డు చెప్పబోకు, బొడ్టు కిందకె బట్ట
  గట్టి పైట విసిరి కొట్టి దాచ
  దగ్గ సొగసు హొయలనారబోసెదమన్న
  బమ్మకైన తిరుగు రిమ్మ తెగులు

  రిప్లయితొలగించండి
 5. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మి రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.

  హరి గారూ,
  మంచి పూరణ. అభినందనలు.

  తెలుగుయాంకి గారూ,
  పూరణ బాగుంది. అభినందనలు.
  అన్నట్టు మూడో పాదంలో యతి తప్పింది.
  "దగ్గ సొగసు హొయలు తా నారబోయగా" అంటే సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 6. అల్లిబిల్లి లాడు బిల్లు దొరను నాడు
  ఆటలందు ఘనుడు ఆడవి పులిని
  ఆటకట్టు చేసె నంగహీనుడు చూడ
  బమ్మ కైన తిరుగు రిమ్మ తెగులు.

  రిప్లయితొలగించండి
 7. గన్నవరపు వారూ,
  పద్యం నిర్దోషంగా బాగుంది. కాని భావమే కాస్త అర్థం కావడం లేదు.

  రిప్లయితొలగించండి
 8. శంకరయ్య గారూ నమస్కారములు.
  మొదటి పాదము బిల్ క్లింటనుకు, రెండవ పాదము గాల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ కి అన్వయిస్తాయి. వారిద్దఱినీ అంగవిహీనుడు ( మన్మధుడు) జయించాడని నా భావమండీ. మీకు మరల ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 9. గన్నవరపు వారూ,
  సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. శంకరయ్య గారూ నమస్కారములు.
  మొదటి పాదము బిల్ క్లింటనుకు, రెండవ పాదము గాల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ కి అన్వయిస్తాయి. వారిద్దఱినీ అంగవిహీనుడు ( మన్మధుడు) జయించాడని నా భావమండీ. మీకు మరల ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 11. శంకరయ్యగారూ, నమస్కారములు.

  మీరు చేసిన సవరణ ఇంకా బాగుంది. ధన్యవాదాలు. కానీ ఇంకా నాకు ఒక సందేహము అలాగే మిగిలి పోయిఉంది. ఈ పాదములో యతి ఎందుకు తప్పిందో నాకింకా అర్థము కాలేదు.

  "దగ్గ సొగసు హొయల నారబో సెదమన్న"

  "ద" కి "నా" కి యతి మైత్రి కుదురుతుంది కదండీ?

  రిప్లయితొలగించండి