దశావతార స్తుతి - (శ్రీరామావతారం)
శా.చాపచ్చాత్ర నిషంగ భంగ కుపితక్ష్మాభృద్ధనుః పంచ వ
క్త్రీ పంచాళిక దృఙ్నియుక్త హుతభుగ్గ్రీవా ద్వయీ పంచక
వ్యాపారభ్రమకారి పంక్తిగళ గళ్యాఖండనాఖండ దో
ర్నైపుణ్యప్రదరౌఘ రాఘవ పరబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.
(ఎలకూచి బాలసరస్వతి - 17 శతాబ్దం)
భావం -
రామావతారుడవైన ఓ పరమాత్మా! నీవు తన చాపాన్ని, శిష్యుడైన పరశురాముణ్ణి, అంబుల పొది అయిన సముద్రాన్ని భంజించడం చేత కోపించిన మేరుశరాసనుడైన శివుడు తన ఐదు ముఖాలలోని ఐదు ఫాలాగ్నులను నీపైప్రయోగించగాస్తుతిస్తున్నాను - అంటున్నాడు. వాటి పది తలలను (అగ్నికి రెండు తలలు, ఐదగ్నులకు పది తలలు) ఖండించినావేమో అనే భ్రాంతిని కలిగించే విధంగా దశకంఠుని పది తలలను ఖండించి నీ నైపుణ్యాన్నీ, నీ బాణాల మహత్త్వాన్నీ చూపించావు. అటువంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.
సార్ పద్యం చాలా బాగుంది. ప్రతిపదార్ధము ఇస్తే ఇంకా బాగుంటుంది
రిప్లయితొలగించండి