12, సెప్టెంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 93

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
రొయ్యల పులు సడిగె నయ్యవారు.

4 కామెంట్‌లు:

 1. నెయ్యి పప్పు పులుసు నియతిగ తినినేను
  చప్ప బడితి నయ్య చెప్పు కొనక
  ముక్క లేవొ తెచ్చి మక్కువగ తినబెట్ట
  రొయ్యల పులుసడిగె నయ్య వారు .

  రిప్లయితొలగించండి
 2. రాజేశ్వరి నేదునూరి గారూ,
  నిర్దోషంగా చక్కని పూరణ పంపించారు. బాగుంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 3. నా పూరణ ..........

  పూజ సేయు మనుచు పూజారి నడుగగా
  "దైవ పూజలోన తప్పనిసరి
  త్రికరణముల శుద్ధి; తిని వచ్చితివ నీవు
  రొయ్యల పులు" సడిగె నయ్యవారు.

  రిప్లయితొలగించండి
 4. అందరికీ శుభాకాంక్షలండీ! మూడునాలుగు రోజులుగా పండగ శలవల్లో ఉన్న కారణంగా పూరణలు చేయలేదు..ఇవాల్టి సమస్యకోసం ఎదురు చూస్తున్నాను.

  రిప్లయితొలగించండి