7, సెప్టెంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 88

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
హరి యహల్యను మోహించి యాపదఁ గనె.


4 కామెంట్‌లు:

  1. సురులు దైత్యులు యక్ష కింపురుషులెవ్వ-
    రేని పరుల భార్యలను గోరి నెగడరొకొ
    హరి యహల్యను మోహించి యాపద గొనె
    సీతనాశించి రావణుడంతమొందె.
    (హరి అంటే ఇంద్రుడు అనే అర్థం ఎలాగూ ఉన్నది.)

    రిప్లయితొలగించండి
  2. నారాయణ గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    చివరి పాదంలో యతి (ప్రాసయతి) తప్పింది. సీత - డంత ఇక్కడ ప్రాసాక్షరం అనుస్వార పూర్వకంగా ప్రయోగించడం తప్పు. గమనించండి.

    రిప్లయితొలగించండి
  3. మూడవ పాదాన్ని ఇలా సవరించవచ్చేమో..
    "రావణుడు సీతనాశించి రాలి పోయె"
    ("రాలిపోవటం" నచ్చక చివరి నిముషంలో "అంతమొందిం"చాను..అలా ప్రాసయతిలో కొత్త సంగతి తెలుసుకోగలిగాను. గురువుగారూ, యతి ప్రాసల తప్పులు బాగా పడుతున్నై..నియమాలన్నీ ఒకచోట గూర్చిన లంకెలేమైనా చెప్పగలరా? రెండుమూడు సార్లు చదువుకుంటే వంటబడతాయి నాబోటి వాళ్ళకు. )

    రిప్లయితొలగించండి
  4. నారాయణ గారూ,
    ఛందో పాఠాలు చెప్పే బ్లాగులు రెండు, మూడు ఉన్నాయి. వెదకి వాటి వివరాలు తెలియజేస్తాను.

    రిప్లయితొలగించండి