11, సెప్టెంబర్ 2010, శనివారం

గళ్ళ నుడికట్టు - 51

అడ్డం
1. నలుగురిని మోసము చేసి పెట్టేదా నవ్వుముఖం? (4)
3. వివాహాల సమయంలో వెదికితే దొరుకుతుంది ఆకాశం లేదా పక్షి (4)
7. రాశిచక్రం లోని పొట్టేలు (2)
8. పొడి, పుప్పొడి, త్రిగుణాలలో రెండవది (3)
9. ఇంపొదవే గుల్మం (2)
12. సంగర మంతమై తరతమ భేదం పోతే కలయిక (3)
13. అతను వున్నాడనడానికి సాక్ష్యం శరీరం (3)
17. ఒడ్డు. ఒట్టు తీసి దీని మీద పెట్టు (2)
18. సూర్యుణ్ణి కలువనంటుందీ పువ్వు (3)
19. ఎందరొ చేసే గోల, శబ్దం (2)
22. "జయ జయ వనితా కమనీయ రూపా!" అంటుంటే లేచింది తెర (4)
23. నష్టానికి ప్రతిగా సపరివారంగా ఇచ్చే హారం (4)
నిలువు
1. పూర్వం రాజులు చేసింది అశ్వమేధం. ఇప్పుడు తీవ్రవాదులు చేసేది? (4)
2. ఏమో, విప్పదు పెదవి (2)
4. ఆహా! మీదే జామీను (2)
5. రాబడి. పాద సందర్శనలో వెదకండి (4)
6. గెలుపు (3)
10. అభివృద్ధి, పురోగమనం (3)
11. విల్లు (3)
14. "వియోగమా? యమునా!" అంటూ పార్వతిని వెదకండి (4)
15. చిత్రంగా పలుకగల కీరం (3)
16. నాదబ్రహ్మ సుస్వరంగా పలికిస్తాడు సన్నాయి (4)
20. యుద్ధమని చెప్పి చూడు (2)
21. నలుగురిదీ లక్ష్యం (2)

9 కామెంట్‌లు:

 1. అడ్డం
  1. నలుగురిని మోసం చేసి పెట్టేదా నవ్వుముఖం? (4)
  నగు మౌని
  3. వివాహాల సమయంలో వెదికితే దొరుకుతుంది ఆకాశం లేదా పక్షి (4)
  విహాయసం
  7. రాశిచక్రం లోని పొట్టేలు (2)
  మేషం
  8. పొడి, పుప్పొడి, త్రిగుణాలలో రెండవది (3)
  రజస్సు
  9. ఇంపొదవే గుల్మం (2)
  పొద
  12. సంగర మంతమై తరతమ భేదం పోతే కలయిక (3)
  మైదునం
  13. అతను వున్నాడనడానికి సాక్ష్యం శరీరం (3)
  తనువు
  17. ఒడ్డు. ఒట్టు తీసి దీని మీద పెట్టు (2)
  గట్టు
  18. సూర్యుణ్ణి కలువనంటుందీ పువ్వు (3)
  కలువ
  19. ఎందరొ చేసే గోల, శబ్దం (2)
  రొద
  22. "జయ జయ వనితా కమనీయ రూపా!" అంటుంటే లేచింది తెర (4)
  యవనిక
  23. నష్టానికి ప్రతిగా సపరివారంగా ఇచ్చే హారం (4)
  పరిహారం

  నిలువు
  1. పూర్వం రాజులు చేసింది అశ్వమేధం. ఇప్పుడు తీవ్రవాదులు చేసేది? (4)
  నరమేధం
  2. ఏమో, విప్పదు పెదవి (2)
  మౌనం
  4. ఆహా! మీదే జామీను (2)
  హామీ
  5. రాబడి. పాద సందర్శనలో వెదకండి (4)
  సంపాదన
  6. గెలుపు (3)
  విజయం
  10. అభివృద్ధి, పురోగమనం (3)
  ముందుకు
  11. విల్లు (3)
  ధనుస్సు
  14. "వియోగమా? యమునా!" అంటూ పార్వతిని వెదకండి (4)
  యోగమాయ
  15. చిత్రంగా పలుకుతుందీ కీరం (3)
  చిలుక
  16. నాదబ్రహ్మ సుస్వరంగా పలికిస్తాడు సన్నాయి (4)
  నాదస్వరం
  20. యుద్ధమని చెప్పి చూడు (2)
  అని / హాని
  21. నలుగురిదీ లక్ష్యం (2)
  గురి

  రిప్లయితొలగించండి
 2. భాస్కర రామిరెడ్డి గారూ,
  ఎంత కాలానికి నా బ్లాగును పావనం చేశారు? శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
  మీ సమాధానాలలో అడ్డం 1 లో చివరి రెండు అక్షరాలు, 12, నిలువు 2,10 తప్ప మిగిలినవి సరిపోయాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. గళ్ళ నుడికట్టు - 51
  అడ్డం:
  1. నగుమోము; 3.విహాయసం; 7. మేషం; 8. రజస్సు; 9. పొద; 12. సంగమం; 13. తనువు; 17. గట్టు; 18. కలువ; 19. రొద; 22. యవనిక; 23. పరిహారం.
  నిలువు:
  1. నరమేధం; 2. మోవి; 4. హామీ; 5. సంపాదన; 6. విజయం; 10. ప్రగతి; 11. ధనుస్సు; 14. యోగమాయ; 15. చిలుక; 16. నాదస్వరం; 20. అని; 21. గురి.

  రిప్లయితొలగించండి
 4. అడ్డము:
  1)నగుమోము,3)విహయసం,7)మేషం,8)రజస్సు,9)పొద,12)సంగమం,13)తనువు,17)గట్టు,18)కలువ,19)రొద,22)యవనిక,23)పరిహారం.
  నిలువు:
  1)నరమేధం,2)మోవి,4)హామీ,5)సంపాదన,6)విజయం,10)ప్రగతి,11)ధనువు,14)యోగమాయ,15)చిలుక,16)నాదస్వరం,20)అని,21)గురి.

  రిప్లయితొలగించండి
 5. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
  మీ సమాధానాలన్నీ సరిపోయాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. గడి51.అడ్డం.1.నగుమోము.3.విహాయసం.7.మేషం.8.రజస్సు.9.పొద.12.సంగం.13.ధనువు.17.గట్టు.18.కలువ. 19.రొద.22.యవనిక.23.పరిహారం.
  నిలువు.1.నరమేధం.2.మోవి.4. హామీ .5.సంపాదన.6.విజయం.10.ఆగమం.11.తనువు.14.యోగమాయ.15.చిలుక.16.నాదస్వరం.20.అని.21.గురి.

  రిప్లయితొలగించండి
 7. ఈసారి గళ్ళ నుడికట్టు పూరించిన భాస్కర రామిరెడ్డి గారికి, భమిడిపాటి సూర్యలక్ష్మి గారికి, రాజేశ్వరి నేదునూరి గారికి, ధన్యవాదాలు. మీ సమాధానాలలో ఒకటి రెండు తప్పులో, అక్షరదోషాలో ఉన్నాయి.

  నిర్దోషంగా గడిని పూరించిన మిట్టపెల్లి అమల మా మేన కోడలు. వాళ్ళ కుటుంబంలో అంతా తెలుగు పండితులే.

  రిప్లయితొలగించండి
 8. గళ్ళ నుడికట్టు - 51 సమాధానాలు