13, సెప్టెంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 94

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
పంచ పాండవు లన పదుగురు కద!

7 కామెంట్‌లు:

  1. కాడి మంచమునకు కలవు కాళ్లైదుగా!
    పంచ పాండవులన పదుగురు కద?
    ఒంటి వేలునందు ఉండును రెండేళ్లు
    యనెడి మొరకు నేమి యనగ వచ్చు?

    రిప్లయితొలగించండి
  2. విరటుఁ గొలువునందు వింత వేషములను
    దాల్చి గుప్త జీవితముఁ గడిపిరి -
    పేరు కైదు మంది వీరులు, లెక్కింప
    పంచ పాండవు లన పదుగురు కద!

    రిప్లయితొలగించండి
  3. కంది శంకరయ్యగారు,
    నా పూరణ:
    పాండునందనులకు వారినందనులకు
    ప్రేమగ పలహరమివ్వ నెంచె;
    కంచములు పదిగద గావలె నామెకు
    పంచ; పాండవులన పదుగురు కద

    పాండవులు, ఉపపాండవులు కలిపి పది మంది అని నా భావన.

    మీరు చెప్పినట్టు నా టపాలో రెండు తప్పులు చూసి సవరించాను. ఇంకా మీకు దోషముల కనపడితే అక్కడ వ్యాఖ్యలో వాటి వివరములుంచ గలరు.

    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  4. పంచ దార పలుకు ప్రజల సౌఖ్యమన్న
    ఎంచి చూడ నేత లెంత దీపి.
    కంచి కేగు నట్టి కతలేల మరలవొ
    పంచ పాండవులన పదుగు రుకద

    రిప్లయితొలగించండి
  5. తెలుగుయాంకి గారూ,
    మీ భావన బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. "పలహరము" పద ప్రయోగమూ తప్పే. ఆ పాదాన్ని ఇలా సవరించాను.
    "ప్రేమతోడఁ గృష్ణ విందు నొసఁగ"
    (ద్రౌపది అసలు పేరు కృష్ణ కదా!

    రిప్లయితొలగించండి