9, సెప్టెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 90

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
ప్లేటు మీల్సు నడిగె ఫ్లైటులోన.

7 కామెంట్‌లు:

హరి చెప్పారు...

బూము వచ్చి పెరిగె భూమి రేటొకవంక
ఇబ్బు ముబ్బడిగను డబ్బు చేరె
సింగపూరు వెడలె చిలుకూరు ఆసామి
ప్లేటు మీల్సు నడిగె ఫ్లైటులోన!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్లైటు నెక్కి నంత పరవశించె నతడు

పైటె వేసి నట్టి పడతి గాంచి

మెచ్చినంత త్రాగి మత్తుగ మైమరచి

ప్లేటు మీల్సు నడిగె ప్లైటు లోన

కంది శంకరయ్య చెప్పారు...

హరి గారూ,
పూరణ చాలా బాగుంది. అభినందనలు. దాదాపు ఇలాంటి భావంతోనే నేనూ పూరించాను.

రాజేశ్వరి నేదునూరి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
మూడవ పాదంలో యతి తప్పింది. గమనించగలరు.

కంది శంకరయ్య చెప్పారు...

నా పూరణ ..............

లాటరీని గెల్చి లండను ట్రిప్పును
బహుమతిగ గడించె పామరుండు;
ఏమి కావలెనను ఎయిరుహోస్టెసుఁ జూచి
ప్లేటు మీల్సు నడిగె ఫ్లైటులోన.

Nagaraju చెప్పారు...

hi,

please read my blog
gsystime.blogspot.com
you will get so much of poetry and information

thanks,
Nagaraju

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవును శంకరయ్య గారు తర్వాత చూసాను అది " మత్తుగ " అన్నది జగణం కదు ? ఎప్పుడు అక్కడే పోతోంది

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వరి గారూ,
మూడవ పాదంలో గణదోషం లేదు. "మత్తుగ" భగణమే. నేను చెప్పించి యతిదోషం. అక్కడ మె-మ లకు యతి వేశారు. హల్లులతో పాటు వాటి అచ్చులకూ యతిమైత్రి పాటించాలని నియమం.