28, సెప్టెంబర్ 2010, మంగళవారం

చమత్కార (చాటు) పద్యాలు - 36

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు సేకరించి ప్రచురించిన "చాటుపద్య మణిమంజరి"లో "ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!" మకుటంతో ఏడు పద్యా లున్నాయి. వీటిని ఎవరు, ఏకాలంలో రచించారో తెలియదు. ఆ ఏడు పద్యాలు మీకోసం రోజు కొకటి!
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ! - 1
సీ.
శరధి లంఘించి దాశరథి యిచ్చిన భూష
ణము సీత కొసఁగిన నాఁటి రూపు
లంకా రమా ముఖాలంకార మాగ్రహో
న్నతి నీఱు చేసిన నాఁటి రూపు
నీవాలమునఁ జుట్టి నీ వాలమున దైత్య
నాథులఁ బొరిగొన్న నాఁటి రూపు
మరుదీశ సుతుఁడ నా మరుదీశ సుతు కేత
నం బెక్కి తోడైన నాఁటి రూపు
తే. గీ.
తలఁచు వారికి నాపదల్ తలుఁగు టరుదె
నీ కృపాస్ఫూర్తి నీ కీర్తి నిస్సమములు
మహిత శ్రీరామ పదభక్తిమద్విధేయ
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!
( అజ్ఞాత కవి )

2 కామెంట్‌లు:

  1. మీరు సేకరిస్తూ మాకందిస్తున్న యీ పద్యాలు
    నిజంగా రత్నాలు .ఇవి చదువుకొంటే చాలు
    ఇప్పుడు పద శక్తి ముందు ముందు ముక్తి
    లభిస్తాయని నమ్ముతున్నాను.

    రిప్లయితొలగించండి