ఛందస్సు నేర్చుకుందామా?
"అబ్బా! మళ్ళీ ఛందస్సు పాఠాలా? ఇప్పటికే చాలా బ్లాగుల్లో ఛందస్సు నేర్పించారు కదా!" అంటారా? నిజమే ... ఈ ధర్మసందేహం నాకూ కలిగింది. "ఆంధ్రామృతం, పద్యం.నెట్, నరసింహ, తెలుగు పద్యం, దట్స్ తెలుగు" తదితర బ్లాగుల్లో ఛందస్సు నేర్పే పాఠాలను ఇప్పటికే కావలసినంత పోస్ట్ చేసి ఉన్నారు. ఇంకా చేస్తూ జిజ్ఞాసువులకు అందిస్తూ భాషాసేవ చేస్తున్నారు.ఇప్పుడిప్పుడే బ్లాగులను చూస్తున్న వాళ్ళూ, పద్య రచన చేయాలని నూతనోత్సాహం చూపుతున్న వాళ్ళూ ఆ బ్లాగుల సంగతి తెలియక ఛందస్సుకు సంబంధించిన తమ సందేహాలను నాకు రాసి సమాధానాలను కోరుతున్నారు. ఛందోపాఠాలను అందించే బ్లాగుల పూర్తి సమాచారం నా దగ్గర లేదు. తెలిసిన వాళ్ళు ఆ వివరాలను అందిస్తే నా బ్లాగులో ప్రకటిస్తాను. తద్వారా అందరూ ఆ బ్లాగుల్లోని ఛందశ్శాస్త్ర విశేషాలను తెలుసుకొంటారు. సందేహ నివృత్తి చేసుకొంటారు.
అలా కాదంటే నేను కొత్తగా ఛందస్సుకు సంబంధించిన పాఠాలను నా పరిధిలో, నా శైలిలో ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను.
"శంకరాభరణం" బ్లాగు అభిమానులు, మిత్రులు తమ సలహాలను, సూచనలను తెలియ జేయ వలసిందిగా మనవి.
మంచి ప్రయత్నం శంకరయ్య గారూ. ఈ ఛందస్సు విశేషాలను సమగ్రంగా ఒకేచోట అన్ని వివరాలతో అందిస్తే చాలా ఉపయోగంగా వుంటుందని నా అభిప్రాయం. మొదటి విద్యార్థిగా నేను చేరిపోతున్నాను.
రిప్లయితొలగించండిఛందస్సుతో బాటు వ్యాకరణం కూడా నేర్పిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాకరణం గురించి వికిలో తప్ప ఎక్కడా చూడలేదు. అదీ సమగ్రంగా లేదు.
రిప్లయితొలగించండి- ఫణి ప్రసన్న కుమార్
గురువు గారు, చందస్సు పాఠాలు చెబుతానంతే ఎగిరి గంతేసే వారి లో నేనే ప్రధమం. ఈ ప్రయత్నం మా లాంటి ఔత్సాహికులకు ఎంతో ఉపయోగం.
రిప్లయితొలగించండిదాదాపుగా ఈ బ్లాగు ద్వారా ఛందో వ్యాకరణాలు నేర్చుకొందామనో, లేక మెరుగులు దిద్దుకొందామనుకొనే వాళ్ళంతా పెద్దవాళ్ళే కాబట్టి, interactive learning లాగా వుంటే బాగుంటుందనిపిస్తోంది. పెద్దవాళ్ళు సాధారణంగా analysis, variations, apply చేయడం ద్వారా ఎక్కువగా తేలికగా నేర్చుకొంటారు. పిల్లలకి rote learning (బట్టీ పట్టడం) తెలీకగా వుంటుంది. నా మనవి, మీరు ఒక సెక్షన్ నేర్పేటప్పుదు, ఎక్కువ రకరకాల వుదాహరణలు, working exercises, ఇచ్చి మా సందేహాలు (ఆ సెక్షన్ కి సంబంధించి) బ్లాగు ద్వారా తీర్చడం బాగుంటుందనిపిస్తోంది. ఆపై "జన వాక్యం హిత వాక్యం".
రిప్లయితొలగించండినమస్తే,
రిప్లయితొలగించండిఇప్పటికే మీ బ్లాగు ద్వారా ఎంతో మంది ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. ఛందస్సు కూడా నేర్పించే ప్రయత్నం చేస్తే ఔత్సాహికులకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు శ్రద్ధగా చదివి నేర్చుకునే శిష్యులలో నేను తప్పకుండా ఉంటాను. ధన్యవాదాలు.
ఛందస్సు గురించి జాలంలో ఎంత సమాచారం ఉన్నా గానీ నా పద్యాల్లో యతి ప్రాసల సమస్యలు ఉంటూనే ఉన్నై గదా! :( :)
రిప్లయితొలగించండిఛందో లక్షణాలను సమగ్రంగా, ఉదాహరణ పూర్వకంగా వివరిస్తే మాబోటి వాళ్ళవరకూ పరమానందం. అదేదో చర్విత చర్వణం అవుతుందనుకోనవసరం లేదు- నేర్పే గురువుల శైలి ఎవరిది వారికి ఉంటుంది.
గురువుగారూ మనబ్లాగు నభిమానించే వారందరికీ మీద్వారా ఛందస్సులో తమ ప్రఙ్ఞకు మెరుగులు దిద్దుకోవడము మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నందని నా అభిప్రాయము.
రిప్లయితొలగించండిగురువు గారూ,
రిప్లయితొలగించండిసమస్యాపూరణం లో పాల్గోవటానికి మీ ఛందస్సు పాఠాల కోసం ఆతృత గా ఎదురుచూస్తున్నాము - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
నమస్సులు.
రిప్లయితొలగించండిచందస్సు పాఠాలకయి ఎదురుచూచు వారిలో నేనూ ఒకరిని..
ఎన్నెల
శంకరార్యా !
రిప్లయితొలగించండిమిక్కిలి నావశ్యకత గలదు.
మీ పాఠముల కొరకై మేము కడు
నాత్రము నెదురు జూచు చుంటిమి.
అ,ఆ ల నుండి మొదలిడ పని లేదు .
ఇక్కడ నొక (ref link) ఇచ్చిన నవసరమగు సమయమున
అవసరమైన వారు జూచుకొన వీలగును.
మీరు యతి ప్రాసలకు సంబందించి కొన్ని ప్రత్యేక
ఉదాహరణలు జూపుతూ మీ వివరణలు జోడించి నట్లైనయెడల
చాలా మందికి చాలా సందేహములు దొలగును.
ఇటులే "సంధులు "
"సమాసములు" అను పేర
రెండు నూతన వర్గముల ప్రారంభించవలసిన
ఆవశ్యకతయున్నూ యున్నది.
ఏమందురా !
బ్లాగు మిత్రు లందరూ తొంభై తొమ్మిది వంతులు
scientists , doctors , engineers , accountanta,managers
తదితర రంగములవారే గదా!
తెనుగున నిష్ణాతు లెవరూ లేరు గదా!
అందులకు!
ఇంతే గాక" సందేహములూ-సమాధానములూ" అను వర్గమును గూడ
ప్రారంభించ వలసి యున్నది.
అప్పుడే మన "శంకరాభరణం" blog పరిపుష్ట మగును.
వీనిని పునశ్చరణ తరగతుల వలె నిర్వహించిన జాలును.
మీ వీలు వెంబడి ప్రారంభింతురు గాక.