18, సెప్టెంబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 99

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...........
మంత్రపుష్ప మేల మద్యముండ.

11 కామెంట్‌లు:

  1. ఆది దేవు డనుచు నాద్యమ్ము పూజింప
    నాలయమ్మునందు నడుగు పెట్ట
    దేవళమ్ము నడుపు దిక్పాల పూజకుఁ
    మంత్రపుష్ప మేల మద్యముండ ?


    దిక్పాలకరు అంటే నిర్దేశకులు( డైరెక్టరులు )అని నా భావమండీ.

    రిప్లయితొలగించండి
  2. భీముడు, ధర్మరాజుతో:-
    "ఇంత జరిగి నింక ఇచ్చకమ్ముల శాంతి
    మంత్రపుష్పమేల? మధ్యముండ!
    ఏనొకండునుండ యెదురెండు భండన
    మ్మునను? మనకు రూఢిఁ మోచు జయము."

    క్షమించాలి. మద్యమును మధ్యముగా మార్చాను.

    రిప్లయితొలగించండి
  3. గౌరవనీయులైన కంది శంకరయ్యగారు,
    నమస్కారములు. నా పూరణ జతపరుచు తున్నాను:

    అప్సరసలదన్ను అతివలిక్కడ,జగ
    దంబపూజదేల రంభ లుండ
    బార్ల తెరిచిపిలుచు బారు్లకోకొల్లలు
    మంత్రపుష్పమేల మద్యముండ

    రిప్లయితొలగించండి
  4. మరో పూరణండీ:

    దివ్య మంగళమ్ము తిరు వేంకటేశుని
    నగలు దొంగిలించి నామ మిడగ
    చింత,కలుగఁ,భీతి, చెరసాల ప్రాప్తికి
    మంత్రపుష్ప మేల మద్యముండ!

    రిప్లయితొలగించండి
  5. రవిగారు మద్యమును మధ్యముడుగా మార్చి మా చేత శీతల పానీయము త్రాగిస్తున్నారు. సరుకులో మోసం ఉన్నా బాగుంది.

    రిప్లయితొలగించండి
  6. సమస్యా పూరణలు వంద పూర్తి చేస్తున్న సందర్భము గా గురువులు శ్రీ శంకరయ్య గారికి అభినందనలు

    రిప్లయితొలగించండి
  7. నరసింహ మూర్తి గారూ,
    మంచి భావంతో సమస్యా పూరణ చేసారు. ధన్యవాదాలు.

    రవి గారూ,
    పూరణ దారి తప్పినా పద్యం బాగుంది. అభినందనలు.

    తెలుగుయాంకి గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    కాకుంటే రెండవ పాదంలో యతి తప్పింది. "అంబ - రంభ" లకు ప్రాస యతి చెల్లదు. "బ - భ" లకు ప్రాసమైత్రి లేదు కదా.

    రిప్లయితొలగించండి
  8. నా పూరణ ..........
    నీతిబాహ్యుఁడయ్యు నియమ నిష్ఠలు వీడి
    జీవితమును గడుపు చెనఁటులకును
    షోడశోపచార శుద్ధ పూజలవేల?
    మంత్రపుష్ప మేల మద్యముండ?

    రిప్లయితొలగించండి
  9. ఆ సూక్ష విషయము మీరు చెప్పేవరకూ గ్రహించలేకపోయాను.ఈ సవరణ సరి పోతుందేమో చూడండి?

    అప్సరసలదన్ను అతివలిక్కడ,దేవ
    ళంబు పూజదేల రంభ లుండ
    బార్ల తెరిచిపిలుచు బారు్లకోకొల్లలు
    మంత్రపుష్పమేల మద్యముండ

    రిప్లయితొలగించండి
  10. చంద్రశేఖర్ గారి పూరణ .........

    మంత్రు ల౦ద రొక్క మాటుగ జేరి దై
    వధన మెట్లు మింగ వలెనని దల
    పట్లు బట్ట మ౦చి పలుకుల జెప్పెడి
    మంత్ర పుష్ప మేల మద్య ముండ!

    రిప్లయితొలగించండి