25, సెప్టెంబర్ 2010, శనివారం

చమత్కార పద్యాలు - 34

అష్ట దిక్పాలక స్తుతి - 7 ( కుబేరుడు )
చం.
ఉనికఁట వెండికొండ దనయుండఁట రంభకు యక్షరాజు నా
ధనపుఁ డనన్ బ్రసిద్ధుఁడఁట దాప విభుండఁట పుష్పకంబుపైఁ
జనునఁట పార్వతీపతికి సంగతికాఁడఁట యాత్మ సంపదల్
పెనుపుగ నిచ్చి హెచ్చగుఁ గుబేరుఁడు మిమ్ము ననుగ్రహించుతన్.
( ఆజ్ఞాత కవి )

1 కామెంట్‌:

  1. పద్యం చాల బాగుంది సార్, చిన్న చిన్న మాటలలో మంచి భావం. ఈ రోజుల్లో ఆత్మ సంపద కన్నా ధన సంపదలడిగే వాళ్ళే యెక్కువ గదండి.

    రిప్లయితొలగించండి