2, సెప్టెంబర్ 2010, గురువారం

గళ్ళ నుడికట్టు - 49


అడ్డం

1. పొట్టి ఇంటిపేరున్నా "...... నీవే కలవు" అని తలుస్తారు తెలుగువాళ్ళు (4)
3. సంక్రాంతితో ముగిసే ఈ నెల వైష్ణవులకు ముఖ్యం (4)
7. చిలుము (2)
8. కొంచము రుద్దితే జారే తైలం (3)
9. భయంబేల బాలా? (2)
12. ఆ హాలుకు రంది భోజనం కోసం (3)
13. ప్రాపు. దానికోసం ఆపాటి శ్రమ న్యాయం కదా (3)
17. ఈ పక్షి ఏకాకి కాదు. రాముడి బాణం తగిలి ఏకాక్షి అయింది (2)
18. నుదురు (3)
19. బూడిద (2)
22. పడమటి సంధ్యారాగం చిత్రంలో నీగ్రో యువకుడుగా నటించిన డ్రమ్మర్ (4)
23. వసిష్ఠుడులో ఒక అక్షరం మారితే శ్రేష్ఠుడు (4)
నిలువు
1. లక్ష్మికి భర్త (4)
2. చుంబనం (2)
4. పొగడ్త. తిను పదార్థం కాదు (2)
5. కూడిక. కవితలనో, కథలనో, వ్యాసాలనో ఒకచోట ప్రకటించడం (4)
6. ఇది తాగి ముఖం అలా పెట్టావేమిటి? ఆ సంతోషం ఏది? (3)
10. బహిరంగం (3)
11. బ్రహ్మచర్యం, గార్హస్త్యం అనే పర్ణశాల (3)
14. పదకొడవ తిథి (4)
15. కర్నాటకంలో డ్రామా (3)
16. మొదటితో మొదలైన సూర్యుడు (4)
20. పార్వతి (2)
21. అల్లెత్రాడు లాంటి స్త్రీ (2)

7 కామెంట్‌లు:

 1. అడ్డము:
  1)శ్రీరాముని,3)ధనుర్మాసం,7)తుప్పు,8)చమురు,9)బేల,12)ఆహారం,13)ఆశ్రయం,17)కాకి,18)నిటలు,19)నుసి,22)శివమణి,23)వరిష్టుడు.
  నిలువు:
  1)శ్రీకాంతుడు,2)ముద్దు,4)నుతి,5)సంకలనం,6)ఆముదం,10)బాహాటం,11)ఆశ్రమం,14)ఏకాదశి,15)నాటకం,16)అసితుడు,20)ఉమ,21)నారి

  రిప్లయితొలగించండి
 2. అడ్డం: 1.శ్రీరాములు, 2.ధనుర్మాసం, 7.థుప్పు(?) 8.చమురు, 9.బేల,12.ఆహారం, 13.ఆశ్రయం, 17.కాకి, 18.నిటలం, 19.బూది, 22.శివమణి,23.వరిష్ఠుడు
  నిలువు:1.శ్రీనాథుడు, 2.ముద్దు, 4.నుతి,5.సంకలనం, 6.ఆముదం, 10.బాహాటం, 11.ఆశ్రమం, 14.ఏకాదశి, 15.నాటకం, 16.ఆదిత్యుడు,20.ఉమ, 21.నారి

  రిప్లయితొలగించండి
 3. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
  అడ్డం 18 చినరి అక్షరం, అడ్డం 19, నిలువు 16 తప్ప మిగిలినవన్నీ సరిపోయాయి.

  రిప్లయితొలగించండి
 4. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  అడ్డం 7 మొదటి అక్షరం, నిలువు 1 తప్ప మిగిలినవన్నీ కరెక్ట్,

  రిప్లయితొలగించండి
 5. నిలువు: 1.శ్రీకాంతుడు, అడ్డం: 7.తుప్పు

  రిప్లయితొలగించండి
 6. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  సవరణలతో ఇప్పుడు మీ సమాధానాలన్నీ సరిపోయాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. గళ్ళ నుడికట్టు - 49 సమాధానాలు.
  అడ్డం:
  1.శ్రీరాములు, 2.ధనుర్మాసం, 7.తుప్పు, 8.చమురు, 9.బేల, 12.ఆహారం, 13.ఆశ్రయం, 17.కాకి, 18.నిటలం, 19.బూది, 22.శివమణి, 23.వరిష్ఠుడు.
  నిలువు:
  1.శ్రీకాంతుడు, 2.ముద్దు, 4.నుతి, 5.సంకలనం, 6.ఆముదం, 10.బాహాటం, 11.ఆశ్రమం, 14.ఏకాదశి, 15.నాటకం, 16.ఆదిత్యుడు,20.ఉమ, 21.నారి.

  రిప్లయితొలగించండి