సహదేవుడు గారూ -- వావ్! మీరు మరీ ఇంటి సంగాతులన్నీ బయట పెట్టేస్తున్నారు. కొంచెం సిగ్గుగా ఉంది. మారామేలర? కౌగిలింతలడగన్ మన్నింప జాగేలరా? చేరంబిల్చగ ముద్దు ముచ్చటలవే చేదందువే? చూడగన్
అందరికీ వందనం! నిన్నటి నా చర్చా స్ఫూర్తిని మన "శంకరాభరణం" సభ్యులు తప్పుగా అర్థం చేసుకొన్నట్టున్నారు. ఎవరేమి తప్పులు చేసినా ఎవరూ సరిదిద్దడం లేదు. లక్ష్మీదేవి గారు! మీ పద్యంలో "మనమోహనా" ప్రయోగం తప్పు. అలాగే, "సతిన్ యంచు" అని ధృతం మీద యడాగమం చేయడం తప్పు. వాటిని సరిదిద్దండి. అంచిత రసోత్పత్తికి దోహదపడని ఏ తప్పునైనా సరిదిద్దవలసిందే! నేమాని వారి "మద్ధృదారామ మందారా!", మీ "భక్త మందారా!" ప్రయోగాలు ఉదాత్తంగా ఉన్నాయి. మిస్సన్న గారు! మీ "కారే జంటలు? బిడ్డలుం గలుగరే?" పేరడీ పద్యం హృద్యంగా రూపు దిద్దుకొంది. నేను చూసిన పేరడీ పద్యాలలో వేళ్ళ మీద లెక్కపెట్టదగిన కొద్ది గొప్ప పద్యాలలో ఇది ఒకటి. మీకు నా హృదయ పూర్వకాభినందన! "గోలి" వారు! మీ పద్యం హాస్యస్ఫోరకంగా సాగి గిలిగింతలు పెట్టింది. ముఖ్యంగా "మేకూ" గుండెలో మెత్తగా గ్రుచ్చుకొని అలరించింది. మీకు నా హార్దికాభినందన!
చక్కని పూరణలు చెప్పి అలరించిన కవిమిత్రులు.... పండిత నేమాని వారికి, మిస్సన్న గారికి, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, లక్ష్మీదేవి గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, సహదేవుడు గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, కమనీయం గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, అభినందనలు, ధన్యవాదాలు. * డా. ఆచార్య ఫణీంద్ర గారూ, మీ చర్చాస్ఫూర్తిని ఎవ్వరూ తప్పు పట్టలేదు. మీదు మిక్కిలి స్వాగతించాము. ఇటువంటి చర్చలే సందేహనివృత్తికి, జ్ఞానసముపార్జనకు దోహదం చేస్తాయి. ' ఎవరేమి తప్పులు చేసినా ఎవరూ సరిదిద్దడం లేదు' అన్నారు. నిజమే! ఈమధ్య పనుల ఒత్తిడి, అనారోగ్యం కారణంగా నేను వెంటవెంటనే మిత్రుల పూరణలపై, పద్యాలపై, వ్యాఖ్యలపై స్పందించలేక పోతున్నాను. మిత్రులనే పరస్పర గుణదోష విచారణ చేయవలసిందిగా విన్నవించుకున్నాను. అప్పటికీ నేమాని వంటి పెద్దలు సరి దిద్దుతున్నారు. నిన్నటి పూరణలపై మీ ప్రశంసలకు, సవరణలకు ధన్యవాదాలు. చాలాకాలానికి నిన్న నా యాహూ మెయిల్ చూస్తే మీరిచ్చిన టోరీ రేడియో లింక్ కనిపించింది. మీ ప్రసంగాన్నీ, ఆశు పద్యాలను, శంకరాభరణ ప్రస్తావనను విని సంతోషించాను.
మిత్రులు లక్కరాజు గారికి ధన్యవాదాలు. నా ఊహాత్మకమైన విషయం మీరు భుజాలు తడుముకునేట్లు చేయడం కేవళం యాదృచ్ఛికమే! కవిత్వం మధుర స్మృతులను జ్ఞప్తికి తేవడం మామూలే గదా?
ఆచార్య ఫణీంద్ర గారూ! మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ. అఖండ యతి మీద జరిగిన చర్చ వంటి చర్చలను సాధారణంగా శంకరాభరణ సభ్యులు హర్షిస్తారు తప్ప అపార్థం చేసుకోరు. ఎప్పుడూ మీరలా భావించ వద్దు.
శ్రీరమ్యంబగు నీ శరన్నిశి నిదే శృంగార శోభాఢ్య ది
రిప్లయితొలగించండివ్యారామంబున నీ నికుంజములలో నబ్జాంబక క్రీడలన్
తారాస్థాయి జెలంగ రమ్ము శుభగాత్రా! మద్ధృదారామ మం
దారా! రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్
నేమాని పండితార్యా! యెంత రమ్యమైన పూరణ నిచ్చారండీ!
రిప్లయితొలగించండిఔరౌరా! మన పెళ్లినాడు తగునయ్యా నిద్ర? చాల్చాలు లే
రిప్లయితొలగించండినా రాజా! నిజవల్లభా! ప్రియసఖా! నా ప్రాణమా! చేర రా-
దా? రా! రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగా
తారాచంద్రులు సిగ్గిలంగ తమితో తాంబూల మందించుచున్.
అయ్యా! మీ పద్యములో ఏదో అసహజత్వము కనిపించినది. మొదటి పాదమును ఇలాగ మార్చుదాము. మీ తాంబూలం చాలా బాగుగనున్నది:
రిప్లయితొలగించండి"ఔరౌరా! మదనాభిరామ శుభగాత్రా! శోభనోత్సాహ! లే"
స్వస్తి.
కారుణ్యాత్మకుడై యనాథజనసంఘాలన్ మహాప్రీతితో
రిప్లయితొలగించండిచేరంబిల్చుచు, వారికన్నిగతులన్ క్షేమంబు చేకూర్చుచున్
ధీరత్వంబును నేర్పునట్టి ఘనునిన్ దీనార్థిసౌఖ్యప్రసా
దా! రా రమ్మని పిల్చె నొక్కసతి భర్తన్ ప్రేమ పొంగారగన్.
నేమాని పండితార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిహరిగారూ! అద్భుతమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
పండిత నేమాని వారి పూరణ బాగున్నది.
రిప్లయితొలగించండిరారా మోహనకృష్ణ! నీ మురళిలో రాగమ్ము నేనంచునున్
నీ రామన్ మనమోహనా యనుచు నేనే నీ సతిన్ యంచు వా
రా రాధేశుని పిల్చగా మదన, రారా బ్రోవరా భక్త మం
దారా! రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్.
మిస్సన్నగారూ!
రిప్లయితొలగించండిధన్యవాదములు.
కారే జంటలు? బిడ్డలున్ కలుగరే? కల్యాణముల్ జేయరే?
రిప్లయితొలగించండివారెల్లన్ తమ యిల్లె స్వర్గమని సంభావించరే? చక్కగా
నూరేళ్ళున్ తమి పండి సాగవలె నేనున్నీవు నాబాటలో! కా-
దా? రా! రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్.
ఔరౌరా! మదనాభిరామ శుభగాత్రా! శోభనోత్సాహ! లే
రిప్లయితొలగించండినా రాజా! నిజవల్లభా! ప్రియసఖా! నా ప్రాణమా! చేర రా-
దా? రా! రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగా
తారాచంద్రులు సిగ్గిలంగ తమితో తాంబూల మందించుచున్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిస్వర్గం లాంటి ఇల్లు బాగున్నది. చక్కటి పద్యం కూర్చినారు.
ఈ రంగేళి కలాకలాపములు నుత్కృష్టంబుగాఁ బొల్చె సిం
రిప్లయితొలగించండిగారంబబ్బిన నాదు మోము గని దిగ్భ్రాంతిన్ ననున్ జూచితే
మీరే దీనికి కారణంబు నను సంప్రీతిన్ విలోకింపరా
దా! రా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగాన్.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ మీ పూరణలో వర్ణన చాలా బాగుంది.
రిప్లయితొలగించండిసిం
గారంబబ్బిన నాదు మోము గని దిగ్భ్రాంతిన్ ననున్ జూచితే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపారావారము దాటి వెళ్ళితివి నా ప్రాణేశ నన్వీడియున్
రిప్లయితొలగించండిదారా బిడ్డల వీడి నీ వెటుల నుత్థానంబుగున్నావు ? ఈ
ఘోరావస్థలు నీకు , నా కిచట సంక్షోభంబు లే మిగ్లు కా
దా ! రా రమ్మని పిల్చె నొక్క సతి భర్త న్ ప్రేమ పొంగారగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమ్మా లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు. మీకు నా పద్యము నచ్చింది - సంతోషము. మీ పూరణ కూడా మంచి ధారతో చాలా బాగుగనున్నది. స్వస్తి.
రిప్లయితొలగించండిమారామేలర? కౌగిలింతలడగన్ మన్నింప జాగేలరా?
రిప్లయితొలగించండిచేరంబిల్చగ ముద్దు ముచ్చటలవే చేదందువే? చూడగన్
గారాభమ్ములు గుర్తు రావె? మదియే కార్యాలయం వీడ లే
దా? రా! రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్!
శ్రీరామా యనిపల్కి నంతనె మదిన్ సీతా సమేతుండు నై
రిప్లయితొలగించండియారామం బునువీడి భక్త పరిపా లంబంచు వేంచేయు నే
నేరా లెంచక మోదమంది గనుమీ నీరాజ నంబీయ గా
దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగార గన్
రిప్లయితొలగించండిఊరన్ గ్రొత్తది చిత్రరాజమది,యోహోయంచు నుండెన్ గదా!
ప్రారంభింపకముందె పోవలయు సొంపైనట్టి దృశ్యంబులిం
పారంజూడగ బోదమో ప్రియుడ, శంపాళీథియేటర్కు నీ
కారుందీయుము,సత్వరమ్ముగను నుత్కంఠన్ భరింపంగ రా
దా,రారమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్.
దారాసింగను వాడు చేరె నపుడే ధైర్యమ్ము తో సైన్యమున్
రిప్లయితొలగించండిమీరాబాయిని పెండ్లియాడె నెపుడో మేనత్త కూతున్ - "హలో "
' మీరా ' వత్తును రెండు వారములలో "మే.కూ." యనన్ ఫోనులో
" దారా " ! రమ్మని బిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్ !
( మే.కూ. = మేనత్త కూతురు. )
సహదేవుడు గారూ -- వావ్! మీరు మరీ ఇంటి సంగాతులన్నీ బయట పెట్టేస్తున్నారు. కొంచెం సిగ్గుగా ఉంది.
రిప్లయితొలగించండిమారామేలర? కౌగిలింతలడగన్ మన్నింప జాగేలరా?
చేరంబిల్చగ ముద్దు ముచ్చటలవే చేదందువే? చూడగన్
అందరికీ వందనం!
రిప్లయితొలగించండినిన్నటి నా చర్చా స్ఫూర్తిని మన "శంకరాభరణం" సభ్యులు తప్పుగా అర్థం చేసుకొన్నట్టున్నారు. ఎవరేమి తప్పులు చేసినా ఎవరూ సరిదిద్దడం లేదు.
లక్ష్మీదేవి గారు!
మీ పద్యంలో "మనమోహనా" ప్రయోగం తప్పు.
అలాగే, "సతిన్ యంచు" అని ధృతం మీద యడాగమం చేయడం తప్పు.
వాటిని సరిదిద్దండి. అంచిత రసోత్పత్తికి దోహదపడని ఏ తప్పునైనా సరిదిద్దవలసిందే!
నేమాని వారి "మద్ధృదారామ మందారా!", మీ "భక్త మందారా!" ప్రయోగాలు ఉదాత్తంగా ఉన్నాయి.
మిస్సన్న గారు!
మీ "కారే జంటలు? బిడ్డలుం గలుగరే?" పేరడీ పద్యం హృద్యంగా రూపు దిద్దుకొంది. నేను చూసిన పేరడీ పద్యాలలో వేళ్ళ మీద లెక్కపెట్టదగిన కొద్ది గొప్ప పద్యాలలో ఇది ఒకటి. మీకు నా హృదయ పూర్వకాభినందన!
"గోలి" వారు!
మీ పద్యం హాస్యస్ఫోరకంగా సాగి గిలిగింతలు పెట్టింది. ముఖ్యంగా "మేకూ" గుండెలో మెత్తగా గ్రుచ్చుకొని అలరించింది. మీకు నా హార్దికాభినందన!
ఫణీంద్రులవారికి పండితనేమాని వారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసవరించిన పద్యము.
రారా మోహనకృష్ణ! నీ మురళిలో రాగమ్ము నేనంచునున్
నీ రామన్ హృదయేశ్వరా యనుచు నా నీలాంజనా యంచు వా
రా రాధేశుని పిల్చగా మదన, రారా బ్రోవరా భక్త మం
దారా! రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్.
ఫణీంద్రులవారికి పండితనేమాని వారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసవరించిన పద్యము.
రారా మోహనకృష్ణ! నీ మురళిలో రాగమ్ము నేనంచునున్
నీ రామన్ హృదయేశ్వరా యనుచు నన్నేలంగదే యంచు వా
రా రాధేశుని పిల్చగా మదన, రారా బ్రోవరా భక్త మం
దారా! రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్.
చక్కని పూరణలు చెప్పి అలరించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
మిస్సన్న గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
లక్ష్మీదేవి గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
సహదేవుడు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
కమనీయం గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
మీ చర్చాస్ఫూర్తిని ఎవ్వరూ తప్పు పట్టలేదు. మీదు మిక్కిలి స్వాగతించాము. ఇటువంటి చర్చలే సందేహనివృత్తికి, జ్ఞానసముపార్జనకు దోహదం చేస్తాయి.
' ఎవరేమి తప్పులు చేసినా ఎవరూ సరిదిద్దడం లేదు' అన్నారు. నిజమే! ఈమధ్య పనుల ఒత్తిడి, అనారోగ్యం కారణంగా నేను వెంటవెంటనే మిత్రుల పూరణలపై, పద్యాలపై, వ్యాఖ్యలపై స్పందించలేక పోతున్నాను. మిత్రులనే పరస్పర గుణదోష విచారణ చేయవలసిందిగా విన్నవించుకున్నాను. అప్పటికీ నేమాని వంటి పెద్దలు సరి దిద్దుతున్నారు. నిన్నటి పూరణలపై మీ ప్రశంసలకు, సవరణలకు ధన్యవాదాలు.
చాలాకాలానికి నిన్న నా యాహూ మెయిల్ చూస్తే మీరిచ్చిన టోరీ రేడియో లింక్ కనిపించింది. మీ ప్రసంగాన్నీ, ఆశు పద్యాలను, శంకరాభరణ ప్రస్తావనను విని సంతోషించాను.
మాస్టరు గారూ ! ఆచార్య ఫణీంద్ర గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమిత్రులు లక్కరాజు గారికి ధన్యవాదాలు. నా ఊహాత్మకమైన విషయం మీరు భుజాలు తడుముకునేట్లు చేయడం కేవళం యాదృచ్ఛికమే! కవిత్వం మధుర స్మృతులను జ్ఞప్తికి తేవడం మామూలే గదా?
రిప్లయితొలగించండిశ్రీ లక్కరాజు గారికి
రిప్లయితొలగించండిధన్యవాదములండీ.......
లక్ష్మీ దేవి గారూ! ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమీ మోహనదార సుందరంగా ఉంది.
ఆచార్య ఫణీంద్ర గారూ! మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ.
రిప్లయితొలగించండిఅఖండ యతి మీద జరిగిన చర్చ వంటి చర్చలను సాధారణంగా
శంకరాభరణ సభ్యులు హర్షిస్తారు తప్ప అపార్థం చేసుకోరు.
ఎప్పుడూ మీరలా భావించ వద్దు.
బెంగాలు గోకులాష్టమి వేడుకలు:
రిప్లయితొలగించండిచోరుండా వ్రజమోహనుండు వలె భల్ షోగ్గాడుగా వచ్చెనే
కోరండీతడు పాలు వెన్నలనువే కొట్లాడునే నవ్వుచున్
పోరాయన్నను పోడు వీడు రహినిన్ పోరాడుచున్ కోరె చం
దా! రా! రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగన్ 😊