26, మే 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1064 (వానర సైన్యమ్మె రక్ష)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వానర సైన్యమ్మె రక్ష పంక్తిముఖునకున్.

18 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 2. మధ్యాక్కర:
  ఆనంద్రసాంద్ర మానసుడు నరివీర సంహారకుండు
  నైన శ్రీరామచంద్రునకు నానాడు తోడైన వారు
  వానర సైన్యమ్మె; రక్ష పంక్తికంథరునకున్ సంగ
  రాన నెవ్వరును లేరైరి ప్రాభవమ్మెల్ల వమ్మయ్యె

  రిప్లయితొలగించండి
 3. చిన్న పొరపాటుతో సమస్యను నింపేను ఇంతకు ముందుగా. ఇప్పుడు మరొక ప్రయత్నము:

  ఆనంద్రసాంద్ర మానసుడు నరివీర సంహారకుండు
  నైన శ్రీరామచంద్రునకు నానాడు తోడైన వారు
  వానర సైన్యమ్మె; రక్ష పంక్తిముఖునకున్ దురాన
  కానరారయ్యె నెవ్వరును గర్వమంతయు నణగారె

  రిప్లయితొలగించండి

 4. రామ రావణ యుద్ధ సమయం లో ఒక లంకావాసి స్వగతం..

  ఆనర పతి రామునకీ
  వానర సైన్యమ్మె రక్ష, పంక్తిముఖునకున్
  మానర భక్షయ యసురులు
  మానరు సరి రక్ష జేయ మాదే గెలుపౌ.  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని వారూ,
  మీ మధ్యాక్కర చక్కగా ఉంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  'మానర భక్షయ'... ?
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. గుండు మధుసూదన్ గారి పూరణ....

  ఆ నృపుఁడు దాశరథికిల
  వానర సైన్యమ్మె రక్ష; పంక్తిముఖునకున్
  దానవ సైన్యమె గతి; యిఁకఁ
  గానఁగ దైత్యేంద్రుఁ డెట్లు ఘనవిజయుఁ డగున్?

  రిప్లయితొలగించండి
 7. మానవ రూపుడు కతనన (raamudu)
  వానర సైన్యమ్మె రక్ష, పంక్తి ముఖునకున్
  దానవ గణములె సేనలు
  మానవులకు దా నవులకు మఱి యౌ పోరున్


  రిప్లయితొలగించండి
 8. కానగ శాపవిమోచన
  మా నరపాలుని శరమున,ననిలో సాయ
  మ్మై నిలిచిన గొప్పదయిన
  వానర సైన్యమ్మె రక్ష పంక్తిముఖునకున్.

  రిప్లయితొలగించండి

 9. ఆర్యా ! ధన్యవాదములు..
  మా నర భక్షక బదులు భక్షయ గా టైపాటు...సవరణతో...

  ఆనర పతి రామునకీ
  వానర సైన్యమ్మె రక్ష, పంక్తిముఖునకున్
  మా నరభక్షక సైన్యము
  మానరు సరి రక్ష జేయ మాదే గెలుపౌ.  రిప్లయితొలగించండి


 10. ఆ నరశ్రేష్ఠున కయ్యెను
  వానర సైన్యమ్మె రక్ష ; పంక్తిముఖునకున్
  బూనె మరణశిక్ష యనిని
  తా నపహరణము నొనర్చ ధరణిజ నటులన్

  రిప్లయితొలగించండి
 11. కానలు బట్టిన దశరథ
  కూనకు సాయమును జేయ కోతులు మీరల్
  ప్రాణములు విడువనేటికి
  వానర! సైన్యమ్మె రక్ష పంక్తిముఖునకున్!!

  రిప్లయితొలగించండి
 12. దానవ వైరి గెలుపునకు
  వానర సైన్యమ్మె రక్ష; పంక్తిముఖునకున్
  వాని సకల నాశమునకు
  వానర సైన్యంబె ప్రముఖ పాత్ర వహించెన్

  రిప్లయితొలగించండి
 13. ఈ నగరి జేరిరి నరుఁడుఁ
  వానర సైన్యమ్మె, రక్ష పంక్తిముఖునకున్
  మానిని మండోదరి మును
  పూనిక చేసిన వ్రతములె; బ్రోచునొ లేదో!

  రిప్లయితొలగించండి
 14. ఈ నర జాతికి సైతము
  ఆనారద శాపమ్ము వలన నా రాముని కైనన్ !
  ఆనర పతి యసురు లకును
  వానర సైన్యమ్మె రక్ష పంక్తి ముఖున కున్ !

  రిప్లయితొలగించండి
 15. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  రామకృష్ణ గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరిచించింది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది పూరణ. అభినందనలు.
  రెండవ పాదంలో గణదోషం.. నా సవరణ...
  .... సైత
  మ్మా నారద శాపహతిని నా రామునకున్!

  రిప్లయితొలగించండి
 16. కానగ మరియా ఢిల్లీ
  వానర సైన్యమ్మె రక్ష పంక్తిముఖునకున్
  వానల కెండల కోర్చుచు
  మానక చూచెదరు లీల మైదానమునన్

  లీల = రామలీల

  రిప్లయితొలగించండి
 17. మీనము మేషము లెంచక
  దీనులు కోతులని నవ్వి తిప్పలు పడకే
  కోనల్ కోనల దునుమన్
  వానర సైన్యమ్మె;...రక్ష పంక్తిముఖునకున్

  రిప్లయితొలగించండి