27, మే 2013, సోమవారం

సమస్యాపూరణం – 1065 (కుపతిని గని మెచ్చె సాధ్వి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్.
('శతావధాన ప్రబంధము' గ్రంథమునుండి)

23 కామెంట్‌లు:


  1. అపరాజితు శ్రీరాముని
    నపార విక్రముని రిపుగణాంతకు స్వామిన్
    నృపవంశాంబునిధి శశాం
    కు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్

    (శశాంకు పతిని, అనేచోట సంధి చేయలేదు, అవధాన ప్రక్రియలలో కుసంధి దోషమగును గాని విసంధి దోషము గాదు).

    రిప్లయితొలగించండి
  2. స్తపతి విదేశము వెడలెను
    నృపులెండరొ కాన్కలీయ నేరుగ దెచ్చెన్
    విపులముగా చూపగ తన
    కు, పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్.

    రిప్లయితొలగించండి
  3. శపియించిన నేమి తనను
    విపరీతంబనగ పగటి వేళ - నిశన్, తా
    నపర తిలోత్తమనని బొం
    కు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్ !

    రిప్లయితొలగించండి
  4. మధ్యాక్కర:
    అపరాధి వాలి గతించె ననెడు వార్తను వినినంత
    నపరిమిత సుఖమ్మునొందె నట రుమ సుగ్రీవు భార్య
    కపిరాజ్య మొదవిన మేటి క్ష్మానాథు తన ప్రాణనాయ
    కు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్ మనమున

    రిప్లయితొలగించండి
  5. తపనను శచియటఁ జనియున్
    విపక్షు వృత్రుని వధించి విజయుండై రాన్
    ద్యుపతిని, జంభారి, నులూ
    కు, పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్

    రిప్లయితొలగించండి
  6. తపమును మెచ్చిన వాడగు
    చు పరమ శివుడు కనిపించుచుండెడువేళన్
    జపఫలితమునిచ్చుశశాం
    కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్

    రిప్లయితొలగించండి
  7. రిపురాజ మదమడంచుచు
    నృపవర్గమునందు మిగుల నేర్పరియై తా
    నపవర్గ దాత కోసల
    కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్.

    అపవర్గ దాత = మోక్ష ప్రదాత యగు శ్రీరాముడు
    కుపతి = భూనాథుడు ( కోసలకుపతి = కోసలరాజగు రామచంద్రుడు )

    కుపతి అంటే రాజు అనే అర్థములో వ్రాయవచ్చో లేదో తెలీదు. గురువుగారే శరణు.

    రిప్లయితొలగించండి
  8. నెప మెన్నక పొరబడి నీ
    కపరా ధము జేసె నంచు గారడి పలుకుల్
    కపటపు ప్రేమను చిలికెడి
    కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్ !

    రిప్లయితొలగించండి
  9. Sree sampat Kumara Saastri gaaroo!
    అయ్యా! శుభాశీస్సులు.
    కు అంటే భూమి అనే అర్థము కనుక, కుపతి అంటే రాజు అనే అర్థములో నుపయోగించ వచ్చును. కు అంటే దుష్టమైన అనే అర్థము కూడా ఉంటుంది కాబట్టి సాధారణముగా కుపతి అని వాడము. అవధాన ప్రక్రియలలో అలా వాడుటకు వెసులుబాటు కలదు. మీరు ఉపయోగించిన కుపతి అనే పదము సమంజసమే. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    నమస్కృతులతో,

    అపురూపమైన యనురా
    గపుఁ బెన్నిధి నిచ్చినావు కాంతామణి నీ
    శ! ప్రణామము నీ కని మ్రొ
    క్కు పతినిఁ గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  11. అపురూప మైన ప్రేమను
    సఫలీ కృతి జేసి నంత సంతస మొందన్ !
    నెపముల నెంచక నా సతి
    కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్ ! !

    రిప్లయితొలగించండి
  12. విపణిని సొమ్ములను మరియు
    విపులముగా చీరలు కొన వేడగ భర్తన్
    అపుడు వెడలు షాపింగున
    కు, పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్

    రిప్లయితొలగించండి
  13. శ్రీ నేమాని గురువర్యులకు ప్రణామములు.

    సందేహ నివృత్తి గావించినందుకు ధన్యవాదాలు. నా ప్రయోగము సరియైనదే అని తెలిపినందుకు సంతోషంగా ఉంది.

    మరొక చిన్న సంశయము. మీ పద్యము వివరణలో "శశాంకు పతిని, అనేచోట సంధి చేయలేదు", అని వ్రాశారు. బోధపడలేదు. కొంచము వివరించగలరా ?

    శ్రమ ఇస్తున్నదుకు క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి
  14. అపురూపముగా జూచుచు,
    కపటమ్ములు లేని ప్రేమ, గాటపు చంద్రా-
    తపమోయన వలపుం జిలు-
    కు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్

    రిప్లయితొలగించండి
  15. అజ్ఞాత కవి పూరణ...... ('శతావధాన ప్రబంధము' గ్రంథం నుండి)

    విపులాక్షి యిందుమతి ధా
    త్రిపతుల గాదని గమించి, తీయని వలపుం
    గపురపు దృక్కుల నిక్ష్వా
    కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్.

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు నమస్కృతులు.
    అనారోగ్యం కారణంగా మిత్రుల పూరణలను, పద్యాలను వెంటవెంటనే సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
    ఒకరిని మించి ఒకరుగా వైవిధ్యంగా, మనోహరంగా పూరణలు చెప్పిన....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    ఏల్చూరి మురళీధర రావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    మిస్సన్న గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    శశాంకు + పతిని అనే చోట శశాంకు + ను + పతిని = శశాంకు బతిని అని వాడవలసి యుంటుంది. కానీ నుగాగమ సంధి చేయలేదు. విసంధిగా శశాంకు పతిని అనినాడను కదా. ఆగమ సంధులు (విధిగా) చేయనక్కరలేని వనియునూ వింటిని. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. సంశయ నివృత్తి చేసినందుకు శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదాలు. ధన్యోస్మి గురువర్యా.

    రిప్లయితొలగించండి
  19. ఇక నాకు చేత గాదని
    యొక సవర విలువను జూచి యోహో యనుచున్
    నకిలీ నగలను కొన జం
    కు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్

    రిప్లయితొలగించండి


  20. కపటపు ధోరణి లేక, య
    క ! పలుకులను తూచ తప్పక వినుచు, మజ, చా
    న పొసగుల యుండెడు పరా
    కు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కెలు మించన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. నెపములు మణులకు చెప్పక
    యెపుడును దుడ్డుకు కరవని యేడవకే పల్
    కపటపు సాకులనిడ జం
    కు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్

    రిప్లయితొలగించండి