కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కామితార్ధమ్ము లొసఁగదు కనకదుర్గ.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కామితార్ధమ్ము లొసఁగదు కనకదుర్గ.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.
తేటగీతి గర్భిత మధ్యాక్కర:
రిప్లయితొలగించండికామితార్థమ్ములొసగదు కనక దుర్గ సమాశ్రితులకు
యేమి నా దోషమో యంచు నేగ నొకడు వగచుచును
మోమునన్ తేజము లుడిగి పోవు నతని మహాభక్తు
ప్రేమతో తల్లి దీవించి శ్రీనిధులిడె విశేషముగ
మహిష మర్దని స్తోత్రమ్ము మనసుదలచి
రిప్లయితొలగించండిపూజ జేయుచు పదముల పూలు వేసి
నీవె దిక్కని వేడగా నెందు కామె
కామితార్ధమ్ము లొసఁగదు ? కనకదుర్గ.
నిశ్చలమ్మైన మనముతో, నిర్మలమగు
రిప్లయితొలగించండిభక్తితోడుత వాంఛిత ఫలములడుగ,
భక్తవరదాయి, యతిశీఘ్ర ఫలద, యేల
కామితార్థమ్ము లొసఁగదు కనకదుర్గ?
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిసమస్యా పూరణంలో గర్భకవిత్వమా? మీ చిత్రకవిత్వ నైపుణ్యానికి నమోవాకాలు. ఇటువంటి ప్రయోగాలు ఔత్సాహికులకు స్ఫూర్తి దాయకాలు. ధన్యవాదాలు.
రెండవ పాదం ప్రారంభంలో యడాగమం దోషమని గుండు మధుసూదన్ గారు ఫోన్ ద్వారా తెలిపారు. ‘సమాశ్రితులకు నేమి’ అని ఉండవలెను కదా!
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సమస్యను ప్రశ్నగా మార్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
సమస్యాపూరణల ‘టెక్నిక్కులలో’ ప్రశ్నార్థకంగా పూరించడం ఒకటి. దానిని సమర్థంగా వినియోగించుకొని ప్రశస్తమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
నేను 2 పద్యములలో (1) తేటగీతి (2) మధ్యాక్కర పూరించుటలో సంధి దోషము చోటుచేసుకొన్నది. తేటగీతి పద్యముగా ఎట్టి దోషమునూ లేదు. మధ్యాక్కరగా చేసినపుడు ఆ దోషమును నేను గమనించ లేదు. అందుచేత విసంధిగా విడిచి పెట్టవచ్చును కదా. యడాగమమును రద్దు చేద్దాము. స్వస్తి.
భక్తిభావంబుతోడ సత్ఫలము కొఱకు
రిప్లయితొలగించండిధ్యాన జపముల చేత సంధానితమగు
పూజలొనరించి వేడగా పుడమినేల
కామితార్థమ్ము లొసఁగదు కనకదుర్గ?.
కామి తార్ధమ్ము లొసగదు కనక దుర్గ
రిప్లయితొలగించండినిజము కాదది , యా తల్లి నిజము గాను
ఎవరు కోరిన వారికి నిడును సుఖము
ఎల్ల వేళల బూజించ నుల్ల మలర
శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,
రిప్లయితొలగించండి=========*==========
భూమిపై రాక్షస గణము భూరి బలము జూపి దిరుగ
కామితార్థమ్ము లొసగదు కనక దుర్గ ఖలుల కెపుడు,
ప్రేమతో పూజలు జేయ బెరుగు సిరులు వారికెపుడు
మోదమగు జనులకెపుడు, మోము గనిన వారి కెపుడు
కలి యుగమ్మున జను లుండ కాల నేమి
రిప్లయితొలగించండికామి తార్ధమ్ము లొసఁ గదు కనక దుర్గ
భక్తి మీరగ ధ్యానించ ముక్తి యనుచు
కలికి మాలక్ష్మి ముంగిట కల్ప తరువు !
ఆత్మ శుద్ధితో భక్తితో డనుదినంబు
రిప్లయితొలగించండినమ్మవారికి అర్చన లాచరించు
శ్రద్ధ గలవారలకునేల సకల సుఖము
కామి తార్థంబు లొసగదు? కనక దుర్గ
నేమాని గారు!
రిప్లయితొలగించండి"వాక్యావసానంబున సంధి లేమి దోషంబు గాదని యార్యులండ్రు" - చిన్నయ సూరి.
ఉదాహరణలు :
" ... సర్వ వేద
సమధి గమము సత్యంబుతో సమము గావు
ఎరుగు మెల్ల ... " - ఆంధ్ర భారతము
"పడగనున్న హనుమ భయవిహ్వలుడు కాడు
అరదమునకు ... " - ఆంధ్ర భారతము
కాబట్టి మీ మధ్యాక్కరలో కూడ విసంధి దోషం కాదు.
అయితే యడాగమం కూడదు.
నేమాని పండితార్యా! అద్భుతమైన పూరణ నిచ్చారు.
రిప్లయితొలగించండిమిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములన్నియునూ అలరించుచు నున్నవి.
శ్రీ వర ప్రసాద్ గారూ! మీ మధ్యాక్కర ప్రశంసనీయము.
నా పద్యము గురించి మిత్రులు చేసిన మంచి సూచనలకు కృతజ్ఞతలు. స్వస్తి.
విసుగు మాటలతోటి మనసు నొచ్చిన పడతి -కంటినీరొలికిస్తు ఇంటనుండ
తొలగించండిఎదురు చూపులతొటి నిను గన్న వారలు -కళ్ళుకాయలు కాచి చూచుచుండ
బెదురు మాటలతోటి నువుకన్న వారల -ముదము మనసున లెక్కసేయకుండ ఎంతచేసిన నీపూజ యేమిఫలము ? కమితార్థములొసగదు కనకదుర్గ