ఈనాటి పద్యరచన శీర్షిక నిచ్చింది మా ఆవిడ (తనకు తెలియకుండానే). ఉదయం బ్లాగు తెరచి శీర్షిక ఏమిద్దామా అని ఆలోచిస్తుంటే “రాత్రి కరెంట్ పోయి, గాలి లేక ఒకటే ఉక్కపోత. నిద్రపట్టలేదు’ అని మా ఆవిడ సణగడం వినిపించింది. ఇంకేం... నాకు శీర్షిక దొరికింది. ఈ శీర్షికపై చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు.... లక్ష్మీదేవి గారికి, సుబ్బారావు గారికి, మిస్సన్న గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, సహదేవుడు గారికి, అభినందనలు, ధన్యవాదాలు. * సుబ్బారావు గారూ, ‘సోక కతన’ను ‘సోకు కతన’ అని, ‘శోష వచ్చెను నొడలంత’ను ‘శోషయే వచ్చె నొడలంత’ అనండి. * రాజేశ్వరి అక్కయ్యా, ‘కిరణము/లెండను..’ అనండి. * గన్నవరపు వారూ, మీలో ఇంతటి హాస్యప్రవృత్తి ఉందనుకోలేదు సుమా! ‘ఇంట రాగ’ అనేది ‘ఇల్లు జేర’ అయితే? * అక్కయ్యా, మీ రెండవ పద్యం చివరి పాదంలో గణదోషం.. ఇలా సవరిద్దాం.... ‘ఎండను/ నే తీరగు లేపనమ్ము లేమి గుణ మిడున్’ ‘నూతన లేపనము లైన నుక్క పోతే మిగులున్ !
చెమటశమియించగ కురియు చినుకు కొఱకు
రిప్లయితొలగించండివేచి యుంటిమి వరుణుడ! వేగ రమ్ము.
దేశమెల్లను మండుచు తీవ్రమగుచు
నెండ వేడిమి యిట మరియింత లయ్యె.
సూర్య కిరణాలు నేరుగ సోక కతన
రిప్లయితొలగించండిఉక్కపోతలు మొదలాయె మిక్కుటముగ
అంతకంతకు వడగాల్పు లధిక మయ్యి
శోష వచ్చెను నొ డలంత శుష్క మయ్యె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచెమట ధారలౌను చితచిత లాడును
రిప్లయితొలగించండిప్రేలి పోవు నొడలు గాలి లేక
నీటి యేన్గు వోలె నీటనుండగ దోచు
నుగ్గడింప దరమె యుక్క బాధ?
మండగ భానుని కిరణము
రిప్లయితొలగించండియెండలు మెండైన కతన నెవ్విధి నైనన్ !
దండుగ శీతల గాలులు
చెండాడు జనుల మిట మిట చమరిం చంగన్ !
రిప్లయితొలగించండిఘర్మజలముఁ దోడఁ గాయమ్ము తడిసిన
మనుజు డింట రాగ మనము లోన
వర్షసిక్తు డనుచు హర్షమ్ము నొందిరి
వానఁ గోరెడు కడు దీనజనులు.
జలవనరులఁ గాచు తలపుల వదలంగ
రిప్లయితొలగించండినాగ్రహించి యినుడు నుగ్రు డయ్యు
జనుల కాయమందు జలమును బీల్చగ
నుడికి పోవ నదియె నుక్క పోత!
శీతలములు సేవించిన
రిప్లయితొలగించండినేతలవలె పీల్చి పీల్చి నీరై పోవున్ !
కాతరు చేయక నెండను
నూతన లేపనము లైన నుక్క పోతే మిగులున్ !
ఈనాటి పద్యరచన శీర్షిక నిచ్చింది మా ఆవిడ (తనకు తెలియకుండానే). ఉదయం బ్లాగు తెరచి శీర్షిక ఏమిద్దామా అని ఆలోచిస్తుంటే “రాత్రి కరెంట్ పోయి, గాలి లేక ఒకటే ఉక్కపోత. నిద్రపట్టలేదు’ అని మా ఆవిడ సణగడం వినిపించింది. ఇంకేం... నాకు శీర్షిక దొరికింది.
రిప్లయితొలగించండిఈ శీర్షికపై చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు....
లక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
మిస్సన్న గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
సహదేవుడు గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
సుబ్బారావు గారూ,
‘సోక కతన’ను ‘సోకు కతన’ అని, ‘శోష వచ్చెను నొడలంత’ను ‘శోషయే వచ్చె నొడలంత’ అనండి.
*
రాజేశ్వరి అక్కయ్యా,
‘కిరణము/లెండను..’ అనండి.
*
గన్నవరపు వారూ,
మీలో ఇంతటి హాస్యప్రవృత్తి ఉందనుకోలేదు సుమా!
‘ఇంట రాగ’ అనేది ‘ఇల్లు జేర’ అయితే?
*
అక్కయ్యా,
మీ రెండవ పద్యం చివరి పాదంలో గణదోషం.. ఇలా సవరిద్దాం....
‘ఎండను/ నే తీరగు లేపనమ్ము లేమి గుణ మిడున్’
‘నూతన లేపనము లైన నుక్క పోతే మిగులున్ !
రిప్లయితొలగించండినిన్న,నేడు మాకు నిండుగా వర్షించి,
యుస్సురనుచునున్న యుక్కపోత
తగ్గి,హాయికల్గె,తరులతల్ తలలూపె,
నిదుర పట్టె నెల్ల నిశిని బాగ.
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిసౌఖశాయనికునకు సమాధానంలా మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
గురువు గారూ ! ధన్యవాదములు. సవరించిన పద్యము.
రిప్లయితొలగించండిఘర్మజలముఁ దోడఁ గాయమ్ము తడిసిన
మనుజు డిల్లుఁ జేర మనము లోన
వర్షసిక్తు డనుచు హర్షమ్ము నొందిరి
వానఁ గోరెడు కడు దీనజనులు.