9, మే 2013, గురువారం

పద్య రచన - 336 (రచ్చబండ)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“రచ్చబండ”

7 కామెంట్‌లు:

  1. ఊరివారంద రొకచోట చేరుచుండి
    కష్టసుఖముల నెచ్చోట క్రమముగాను
    పంచుకొనుచుందు రిలలోన బహుళగతుల
    రమ్యమౌ ప్రాంత మయ్యది రచ్చబండ.

    న్యాయ మిక్కడ మీకందజేయబడును
    నమ్ము డీరలు మీకోర్కి వమ్ముగాదు
    సందియంబింత లేకుండ సర్వజనులు
    రండు రండంచు పలుకును రచ్చబండ.

    చిన్న పిల్లల బ్రేమతో చేరబిలిచి
    వివిధరీతుల క్రీడలు విస్తృతముగ
    నేర్పుచుండును దీక్షతో నిత్యమౌర!
    రమ్యమౌ ప్రాంత మయ్యది రచ్చబండ.

    సేద దీర్చును జనులకు మోద మొసగు
    వాదు లెన్నైన సరిజేసి యాదినుండి
    యూరివారల బంధువై యుర్విలోన
    నిచ్చలానంద మొసగదె రచ్చబండ.

    రోష మణచును పోగొట్టు ద్వేషములను
    మమత లొలికింపజేయుచు మనములందు
    శత్రుభావము కూల్చుచు సంతసంబు
    లిచ్చుచుండును జనులకు రచ్చబండ.

    రిప్లయితొలగించండి
  2. కచ్చ లేకను పెద్దలు కనుచు నిజము
    వచ్చి న్యాయము నడిగెడు వారికెపుడు
    బండ వేయక తీరుపు పండ జేయ
    రచ్చ బండగు నిజమగు రక్ష బండ.

    రిప్లయితొలగించండి
  3. రచ్చ బండల బేరున రహి జెలంగి
    తీ ర్పు నిచ్చును నచ్చట తీ యగాను
    శత్రు భావంబు లన్నియు శమయ జేసి
    శాంతి సౌఖ్యము లొన గూ ర్చు సర్వులకును .

    రిప్లయితొలగించండి




  4. గ్రామస్థులందరు కలసి కాలక్షేప
    మొనరించుచుండిరి యొద్దికగను
    తంటాలు,తగవులు,తగుతీర్పు నిచ్చుచు
    పంచాయతీ జేయు ప్రముఖజనులు
    ప్రొద్దంత సోమరిపోతులు,చీట్లాట
    జోరుగా నాడెడి జూదరులును
    ఆటపాటలతోడ నలసి వృక్షఛ్చాయ
    బాలురు గడపెడి బంతులాట

    లట్టి రచ్చబండలె యరుదయ్యె నేడు
    చిత్రశాలలు,పార్కులు చెలగె నేడు ,
    టౌనుహాలులు, క్లబ్బులు కానిపించు
    మంచియో చెడో లోకమ్ము మారుచుండె.

    రిప్లయితొలగించండి
  5. రావి నీడను జేరగ రాచ రికము
    నూరి పెద్దగు మునసబు కరణ మనగ
    తీర్పు జెప్పగ జనులకు నేర్పు గాను
    రచ్హ బండ యనంగను రాజ పధము

    రిప్లయితొలగించండి
  6. ముఖ్య మంత్రి మనల మురిపింప తలబెట్టి
    పదవి కొరకు బెట్టె పధకమొకటి
    ఆచరణయు కలదె ఆర్భాటమే దప్ప
    రాజకీయ మాయ ' రచ్చబండ '

    రిప్లయితొలగించండి
  7. రచ్చబండపై ముచ్చటైన పద్యాలను రచించిన కవిమిత్రులు...
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    కమనీయం గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    కళ్యాణ్ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి