28, మే 2013, మంగళవారం

పద్య రచన - 355 (చంద్రమతి మాంగల్యము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“చంద్రమతి మాంగల్యము”

7 కామెంట్‌లు:

  1. చంద్రమతి హరిశ్చంద్రుని సతి పవిత్ర
    భావ, యా తల్లి పుస్తెలు పతికి దప్ప
    పరులకున్ గానరా వామె పతిని గాటి
    కాపరిగ గాంచ హృదయమ్ము కలత జెందె

    రిప్లయితొలగించండి
  2. పతిని పోల్చుట కానాడు పడతి చంద్ర
    మతికి నుపయోగ పడె నిట్టి మహిమ కాదె
    పుస్తె భర్తయె తా దప్ప పుడమి నెవరు
    చూడ జాలని వరమద్ది చూడుడయ్య.

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    చంద్రమతి పుస్తెల మహిమను గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. చంద్రమతిని మాంగల్యము సాయమునను
    పోల్చెనట హరిశ్చంద్రుడు పుణ్యసతిగ
    పేరుగాంచెనాతని పత్ని ప్రియము గలుగు
    వర్తనము తోడ పతిసేవ పఱగఁ జేసె.

    రిప్లయితొలగించండి
  5. తనదు పతి జూడ సూత్రము తల్ల డిల్లె
    కాటి కాపరి యయ్యెను ఖర్మ కొలది
    అనుచు చంద్రమ తిమిగుల తనదు బాధ
    విశద బఱచెను భర్తకు వివర ముగను .

    రిప్లయితొలగించండి
  6. మరణ మొందిన తనయుని మసన మునకు
    మెండు దుఖము దిగమ్రింగి బండ బారి
    కాటి సుంకము లేదంచు కలత పడగ
    సాద్వ్హి మాంగల్యమును గాంచి సతిగ నెంచె !

    రిప్లయితొలగించండి
  7. పరులు గుర్తించుటకు గాదె పడతి గళము
    పుస్తె కట్టుటాచారమై పుడమి ప్రబలె
    పరులు గుర్తించలేరన్న ప్రాతికూల
    వరము చంద్రమతికి నేల వంద్యులార?

    (భావం నాది, పద్యం చింతలపూడి వెంకటేశ్వర్లు గారిది)

    రిప్లయితొలగించండి