19, మే 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1057 (వేసవిలో శీతవాయువే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

34 కామెంట్‌లు:

  1. చూసితివా నే జెప్పనె!
    రా సుశీ! యుదక మండలము రమ్య మగున్!
    యీ సుఖ మెచ్చట నుండును?
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

    రిప్లయితొలగించండి




  2. చేసిన పుణ్యపు ఫలమున
    మీసమ్ములు దువ్వి చనరె మిస్సన్నలుయున్
    వాసిగ ( విశాఖ )సముద్ర తీరము
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

    రిప్లయితొలగించండి
  3. ఈ సుఖ మెచ్చట నుండును?
    వాసిగ మన గన్నవరపు వా రిట నిజమే
    వ్రాసిరి సాయంసమయము
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

    రిప్లయితొలగించండి
  4. మూసీ నది ప్రాంగణమున
    త్రోసుకు జను లరుగుదురట తోయపు కణముల్
    రాసిన మలయజ మనగా
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

    రిప్లయితొలగించండి
  5. ఈ సంసారము వేసవి
    నీ సత్కృప శీతలమ్ము నిత్య సుఖదమౌ
    నో సర్వేశ్వరి! మాకీ
    వేసవిలో శీతవాయువే వీచుగదా!

    రిప్లయితొలగించండి
  6. శ్రీ మిస్సన్న గారి మొదటి పద్యములో 2వ పాదము ఆదిలో గణభంగమును గలదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. ఏసీ లక్కరలేదులె
    వేసిన నేపుగ పెరిగిన వేపయె యున్నన్
    వాసపు ముంగిట జూడగ
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా !

    రిప్లయితొలగించండి
  8. వేసవి వచ్చిన యేమగు?
    నేసీ యంత్రంబమరిన నింటికి మేలౌ!
    నా సుఖ మేమని జెప్పుదు!
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

    రిప్లయితొలగించండి
  9. ఆ సురల వనము లందున
    పూసిన పూలందు సౌరు పులకాంకితమై
    నీ సిగను తురిమి తేచెలి
    వేసవిలో శెత వాయు వే వీచు గదా !

    సోదరులు మిస్సన్న గన్నవరపు వారి సరసములు సౌరులు విరజిమ్ము చున్నవి

    రిప్లయితొలగించండి
  10. అక్కయ్య గారూ ! ధన్యవాదములు. మిస్సన్న గారు విశాఖపట్టణము చేరడము నాకు నిజంగా సంతోషదాయకము.ఈ దినము సమస్య నాకు సమస్య అనిపించ లేదు.సముద్ర తీరములో గడిపిన మంచి రోజులు మరువ లేనివి.

    రిప్లయితొలగించండి
  11. కాసార మెండి పోయెను
    వేసవిలో, శీ త వాయువే వీ చు గదా !
    ఆసా యంత్రము మాకిట
    మూ సీ నది యుండు కతన ముచ్చట గొలుపన్ .

    రిప్లయితొలగించండి
  12. పేసపు కవితలు పాడుచు
    బ్రాసకు నుఱకలను వైచి పరుగుల నడకల్
    యూసులు జెప్పుచు గృష్ణయు
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

    పేసము = రసము

    రిప్లయితొలగించండి
  13. అవును నేమాని పండితార్యా! సరిదిద్దితిని.
    ధన్యవాదములు.

    చూసితివా నే జెప్పనె!
    రా సుమతీ! యుదక మండలము రమ్య మగున్!
    యీ సుఖ మెచ్చట నుండును?
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

    రిప్లయితొలగించండి
  14. నేమాని పండితార్యా! మీ పూరణ లోని భావం నన్ను ముగ్ధుణ్ణి చేసింది.

    మీ యాధ్యాత్మిక భావన
    పీయూషము రీతి జదువ పెంపొన రించున్
    చేయగ నీ దగు పూరణ
    నా యీశ్వరి కృప పరమ్ము నార్యా! మీకౌ!

    రిప్లయితొలగించండి
  15. ఈ సీమ యందు నౌరా !
    వేసవిలో వేడిగాలి వీచును గదరా !
    ఆ సిమ్లాలో నుండిన
    వేసవిలో శీతవాయువే వీచు గదా !

    రిప్లయితొలగించండి
  16. అమ్మా! రాజేశ్వరి గారూ! ధన్యవాదములు.
    మీ పద్యములు కూడా చదువ సొంపుగా నుండి
    అందరికీ ఆనందమును కల్గిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  17. హా ! సెగలను విడు సూర్యుడు
    వేసవిలో ; శీతవాయువే వీచు గదా !
    యా సంక్రాంతి సమయమున ;
    వాసిగ దసరా తఱి గన వానలు గురియున్

    రిప్లయితొలగించండి
  18. మాసపు వేతన మెక్కువ,
    కాసులు కో కొల్లలున్న కలిమి పరుల ఆ
    వాసముల లో 'ఏసీ ' తో
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

    రిప్లయితొలగించండి
  19. ఏ సీమలోన యోగా
    భ్యాసము సత్సంగములును బరగు నిరత మా
    వాసము పవిత్రమై యట
    వేసవిలో శీతవాయువే వీచుగదా!

    రిప్లయితొలగించండి
  20. అవును సంధ్యా సమయం సముద్ర తీరం ,ఇసుక తిన్నెలు , ఈ ప్రకృతి సౌందర్యాలు అనుభ వేద్యమే గానీ వర్ణ నాతీతం నా చిన్నప్పుడు బహుశా పదేళ్ళు , ఉంటా ఏమో రోజూ సాయంత్రాలు ఒక్కదాన్నీ వెళ్ళి కూచునే దాన్ని ఎంత బాగుండేదో . కొన్ని ఏళ్ళు వెనక్కి పంపి నందుకు మీ ఇద్దరికీ ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  21. క్షమించాలి
    చివరి పాదం టైపాటు " శీత " అని ఉండాలి

    రిప్లయితొలగించండి
  22. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ ప్రశంసకు మా సంతోషము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో

    వేసవిలో సమస్యా పూరణలు నిజముగా శీతల వాయువు వలె చల్లగా నున్నvi. గురువు గారి పద్యముపై .
    =========*==========
    పూసిన పూలకు వనమున
    వేసవిలో, శీత వాయు వే వీచు గదా
    వ్రాసిరి పద్యము వాసిగ
    మీసము మెలివేసి జనులు మెచ్చెడి రీతిన్

    రిప్లయితొలగించండి
  24. ఆ సాగర తీరమ్మున
    నో సంద్యా సమయ మందు నొంటరి నేనై
    వాసంతి సరస మాడగ
    వేసవిలో శీత వాయు వే వీచును గదా !

    రిప్లయితొలగించండి




  25. 1.
    ఏ.సీ.జనరేటర్లూ,
    వాసిగ మన యింటనుండ,వగవగ నేలా?
    ఓ సఖులారా,యీ నడి
    ' వేసవిలో శీతవాయువే వీచుగదా '!

    2.
    గాసిలిపోయిన ప్రాణము,
    హా,సుఖమొందగ దొలకరి హాయిగ గురిసెన్
    మా సరిహద్దుల నెల్లను
    ' వేసవిలో శీతవాయువే వీచు గదా!'

    రిప్లయితొలగించండి
  26. పూసిన మల్లెల నొకపరి
    వాసనఁ జూచిన సమీరపరిమళములతో
    నీ సాయంసమయమునన్
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

    రిప్లయితొలగించండి
  27. మిస్సన్న గారూ,
    సరిదిద్దిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదం ప్రారంభంలో యడాగమం దోషమే కదా! వ్యాక్య ప్రారంభం కనుక అచ్చును ప్రయోగించవచ్చు.
    రెండవ పూరణగా గన్నవరపు వారి ప్రస్తావనతో, నేమాని వారల గురించి వ్యాసిన పద్యాలు చాలా బాగున్నవి. ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘మిస్సన్నలుయున్’ అనడం దోషమే... అక్కడ ‘చనడె మిస్సన్న వడిన్’ అందామా?
    రెండవ పూరణలో మూడవ పాదాన్ని యడాగమంతో ప్రారంభించారు.
    *
    పండిత నేమాని వారూ,
    చక్కని అలంకారంతో అద్భుతంగా ఉంది మీ మొదటి పూరణ.
    మీ రెండవ పూరణ కూడా ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘వచ్చిన నేమగు’ అనాలి కదా!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాగున్నవి మీ రెండు పూరణలు. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. గురువు గారూ ! ధన్యవాదములు. నా సవరించిన పద్యము ;

    చేసిన పుణ్యపు ఫలమున
    మీసమ్ములు దువ్వి చనగ మిస్సన్న గరిన్
    వాసిగ ( విశాఖ )సముద్ర తీరము
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

    గరిన్ = అతిశయముగా

    రిప్లయితొలగించండి
  29. గురువుగారూ ధన్యవాదాలు. మీ సూచనను గమనించాను.

    రిప్లయితొలగించండి
  30. కాసింత వేడి నోర్వక
    ఐ.సీ.యూ. బయట నక్కి హాయిని గోరన్
    మూసిన తలుపులు తీయగ
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

    రిప్లయితొలగించండి
  31. మీసపు వేంకయ నాయుడు
    వాసిగ గడగడ గడగడ భాషణమిడగన్
    కాసిని మాటలు వినగనె
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా!

    రిప్లయితొలగించండి


  32. రోసపు వీరరమణులట
    వేసము వేయు మగవాండ్ల విరగన్ దీయన్
    కాసిని లుక్కుల వేయగ
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా! :)


    జిలేబి

    రిప్లయితొలగించండి