15, మే 2013, బుధవారం

పద్య రచన - 342 (గృహలక్ష్మి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“గృహలక్ష్మి”

10 కామెంట్‌లు:

  1. అబ్జసంభవు రసనపై నలరుచుండు
    తమ్మికంటికి నురముపై తనరుచుండు
    అంబికేశుని కర్థాంగియై చెలంగు
    ప్రథిత గృహలక్ష్మి సకల సౌభాగ్యలక్ష్మి

    భారతీదేవి రూపమ్ములో లెస్సగా
    ....గృహలక్ష్మి సలహాల నిచ్చుచుండు
    కమలా మనోహరాకారమ్మునుం దాల్చి
    ....గృహలక్ష్మి శోభల నెల్ల గూర్చు
    పార్వతీ దేవి రూపమ్ములో కన్పట్టి
    ....గృహలక్ష్మి శుభముల నెల్ల దెచ్చు
    శృంగార రసమహాశేవధియై సదా
    ....గృహలక్ష్మి యాహ్లాద మెసగ జేయు
    అమృతరూపిణి గృహలక్ష్మి అన్నపూర్ణ
    ఏ గృహమ్మున గృహలక్ష్మి యెల్లవేళ
    అనుపమానందసాంద్రయై యలరుచుండు
    నట్టి గేహమ్ము స్వర్గతుల్యమ్ము సుమ్ము

    రిప్లయితొలగించండి
  2. లక్ష్మి యన్నను కళ కళ లాడు లలన
    లలన వలననె గృహమున కలలు పండు
    వలెను నరునికి గృహలక్ష్మివాస మపుడు
    వసుధ ప్రతివాడు వైకుంఠ వాసు డగును.

    రిప్లయితొలగించండి
  3. గురుతుల్యులు శ్రీ నేమాని వారి పెళ్లి రోజు సందర్భముగా ...

    సకల శుభములు గలిగించు శంకరుండు
    ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
    కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
    తనర గురువులు నేమాని దంపతులను .

    రిప్లయితొలగించండి
  4. ఇంటికి వెలుగు నిల్లా లె యెప్పు డైన
    అట్టి వెలుగునె గృహ లక్ష్మి యండ్రు బుధులు
    ఏక దారిని నడిపించి యింటి నామె
    స్వర్గ సుఖముల నొన గూ ర్చు సభ్యులకును .

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సుబ్బా రావు గారూ!
    శుభాశీస్సులు. కృతజ్ఞతలు.
    మీ పద్యములో "ఏక దారి" కి బదులుగా "ఏక బాట" అని మార్చండి బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
    =========*==========
    అందరి చంద్రుని కందగ
    వందనములతోడుగ బహు బంధనపాశం
    కుందేలుగ మారెనతడు,
    కుందేలుకు జాడ జూడ గొమ్ములు రెండే ।
    (చంద్రుడు = మన్మోహన్,బహు బంధనపాశం = బహు విధముల కుంభకోణముల పాపము, గొమ్ములు= మార్గములు )

    రిప్లయితొలగించండి
  7. గృహమే కద స్వర్గ మనుచు
    నిహ పరముల శొభ గూర్తు రింతు లనంగా
    నహరహములు సహ చరియై
    విహరింపగ జేతు రనగ వేలుపు తానై

    రిప్లయితొలగించండి



  8. దీపమ్ము వెలుగని దేహళివంటిది
    గృహలక్ష్మి లేని యా గీము చూవె
    చిరునవ్వుతోచని చెలువ మోమట్టిదౌ
    యర్థాంగి తిరుగాడనట్టి యిల్లు ,
    జలరహితమ్మైన సరసి బోలునుగాదె
    నిండైన యిల్లాలు యుండకున్న
    అమవస దినమున నంధకారపు రాత్రి
    సతి లేక యుండిన సదనమదియు

    వంశ గౌరవమ్మును నిల్పి వర్ధిలంగ,
    యింట నందరి క్షేమమ్ము నెరిగి చూచి,
    యతిథిమర్యాద లమరించు నతివ ,గృహిణి ,
    సకల సౌభాగ్య నిలయ యా సహనశీలి.

    రిప్లయితొలగించండి
  9. పూజ్యులు శ్రీనేమాని గురువర్యుల వివాహదినోత్సవ శుభాకాంక్షలు.
    ***
    పతికి సేవలుజేయుచో పడతిదాసి,
    మరియు మంత్రాంగవేళల మంత్రి తాను,
    కొసరి తినిపించు సమయాన కొమ్మ! అమ్మ!
    చేరి సుఖమును పండింప చెలియ రంభ!

    లలిత సౌందర్యకలితయౌ లక్ష్మి యామె!
    రమణి సౌశీల్య సాద్గుణ్య క్షమకు ధాత్రి!
    అతివ షాడ్గ్యుణ్య కలితయై యలరుచుండు
    నిలచు నిత్యంబు సత్యమై నిఖిల జగతి!

    తల్లి యిల్లాలు చెల్లెలు తనయ యగుచు
    అలరుచుండును నట్టింట నతివ తాను
    కలికి మగవాని పాలిటి కల్ప తరువు
    మగువ లేకున్న మగవాడు మట్టిబొమ్మె!

    రిప్లయితొలగించండి
  10. ‘గృహలక్ష్మి’పై మనోహరమైన పద్యాలను అందించిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    వరప్రసాద్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    కమనీయం గారికి,
    పింగళి శశిధర్ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి