23, మే 2013, గురువారం

సమస్యాపూరణం – 1061 (చెట్టుమీది కాకి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
చెట్టుమీది కాకి చుట్టమె గద.

22 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజు మా తమ్ముని కూతురు పెళ్ళి.
    దానికంటే ముందు ఉదయం ఆరు గంటలకు మా కోడలుకు సిజేరియన్ ఆపరేషన్. ఇప్పటికే నా కూతురు నన్ను తాతను చేసింది. ఇప్పుడు కొడుకు నన్ను తాతను చేస్తున్నాడు. నాకైతే మనుమరాలు కావాలని ఉంది.

    రిప్లయితొలగించండి
  2. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మనో వాంఛా ఫల సిద్ధిరస్తు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. పుట్టబోవు నట్టి బొట్టి సంగతి దెల్ప
    చెట్టు పుట్ట దాటి గట్టు చేరి
    కావు కావు మనెను కాబోలు ! గురువర్య
    చెట్టుమీది కాకి చుట్టమె గద!!!

    రిప్లయితొలగించండి
  4. కాకి యఱచి దెలిపె కానుక మీకంచు
    పుట్టు నంచు సొగసు చిట్టి తల్లి
    మనుమ రాలు యింట మహలక్ష్మి యనిజెప్పె
    చెట్టు మీది కాకి చుట్ట మెగద ~

    చాలా సంతోషం . మీ అందరికీ శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  5. మూర్తి మిత్రులు, రాజేశ్వరి గారు సమయోచితమైన చక్కని పూరణలు చెప్పేరు.

    గురువుగారికి శుభమగును.

    రిప్లయితొలగించండి

  6. బ్లాగు మీద కామెంటు చుట్టమె గద
    కామెంటు మీద రిటార్టు చుట్టమె గద
    రిటార్టు మీద చెణుకు చుట్టమె గద
    చెట్టుమీది కాకి చుట్టమె గద!!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. మాస్టరు గారూ ! అభీష్ట సిద్ధి కలగాలని కోరుచూ..

    కోరినట్లు వచ్చు క్రొత్తగా చిట్టెమ్మ
    పడిన యాశలన్ని వమ్ము కావు
    కావు కావననుచు ఖండితముగ చెప్పె
    చెట్టు మీది కాకి చుట్ట మెగద

    రిప్లయితొలగించండి

  8. కోరినట్లు వచ్చు క్రొత్తగా చిన్నారి
    పడిన యాశలన్ని వమ్ము కావు
    కావు కావననుచు ఖండితముగ చెప్పె
    చెట్టు మీది కాకి చుట్ట మెగద

    రిప్లయితొలగించండి
  9. కావు కావు మనుచు గళమెత్తిన పెరటి
    చెట్టు మీది కాకి చుట్టమె గద
    వచ్చునింట నాడు ఖచ్చితముగ నండ్రు ;
    చెట్టు మీది కాకి చుట్టమె గద!

    రిప్లయితొలగించండి
  10. శ్రీ కంది శంకరయ్య గారికి వంశోద్ధారకుడగు పౌత్రుడు ప్రభవించిన శుభ సందర్భమున మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. మనుమండొ మనుమరాలో
    యనునది భగవత్ ప్రసాదమను భావనతో
    గొనుమా సంతోషముతో
    మనుమా శ్రీ శంకరయ్య మాన్యా! శుభమౌ!

    రిప్లయితొలగించండి
  12. కలుగులోన నుండు నెలుకకు నాచెంత
    చెట్టుపైని కాకి చుట్టమె గద
    వారి పొందు కోరి వచ్చెను హరిణమ్ము
    మిత్రలాభ మలరె చిత్ర గతుల

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,గురువు గారికి శుభాకాంక్షలు.
    ఈ దినము చాలా సంతోషకరమైన వార్త వింటిమి. నాకు రెండవ బిడ్డ కూతురు కావలెనని దేవుళ్ళకు మ్రొక్కితిని,కానీ దైవ నిర్ణయము మరొకటి,దైవ నిర్ణయము మనకు వరప్రసాదము.

    అవినీతి జలగల కంటే కాకి చుట్టరికము మంచిదని
    =========*==========
    పట్టు పురుగులెల్ల చుట్టమని దిరుగ
    కట్టు బాట్లు లేని ఖలుడు నేడు
    మెట్టు నెక్కి నిలచె,మేడి పండు దినెడి
    చెట్టు మీది కాకి చుట్టమె గద!
    (పట్టు పురుగు=విలువలు లేని వారు,ఖలుడు= అవినీతి జలగ, మెట్టు=అధికారము )

    రిప్లయితొలగించండి
  14. గురువు గారు మన్నించాలి,మీ
    =====*========
    కలుగులోన నుండు నెలుకకు నాచెంత
    చెట్టుపైని కాకి చుట్టమె గద
    వారి పొందు కోరి వచ్చెను హరిణమ్ము
    మిత్రలాభ మలరె చిత్ర గతుల

    పద్యమునకు నా బావము
    (ఎలుక = అవినీతి పరుడు,చెట్టుపైని కాకి = అధికారముననున్న వాడు ,హరిణమ్ము= సామాన్యులు )

    రిప్లయితొలగించండి
  15. శ్రీ వర ప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగగ నున్నది. మా పద్యమునకు మీ భాష్యము కూడా బాగుగనె యున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. కూడు గుడ్డ యుండ గూడుకు నోచక
    గాలి ధూళు లందు సోలు వార్కి
    చెట్టుపైని కాకి చుట్టమె గదవోయి
    ఆకు లలము లన్న మగును గాదె.

    రిప్లయితొలగించండి

  17. గురువులు శంకరయ్య గారికి

    భర్త యైతిరి యోసామి ! భార్య కునకు
    తండ్రి యైతిరి మీరలు దనయులకును
    తాత యైతిరి మనుమల దరము నకిల
    గురువు లైతిరి మఱి మాకు గొనుడు నతు లు .

    రిప్లయితొలగించండి
  18. చెట్టు మీది కాకి బిట్టున గావు కా
    వనగ చుట్ట మగుదు ననుచు వచ్చు
    బంధు వొకడు మఱి ని బరికించ దీనిని
    చెట్టు మీది కాకి చుట్ట మెకద .

    రిప్లయితొలగించండి
  19. గురువు గారికి మనఃపూర్వక అభినందనలు. మిస్సన్న మహాశయులకు ధన్యవాదములు. నాకు,అక్కయ్య గారికి,శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి ' కాభాష ' సరిగా అర్ధము కాలేదు.బొట్టెడు ని బొట్టి గా విన్నాము.

    రిప్లయితొలగించండి
  20. కంది వారి ఇంట కుంద నంపు ప్రతిమ
    చంద్ర బింబ మంటి చారు వదన
    ముచ్చ టైన పౌత్రి ముదము గా వినుడంచు
    చెట్టు మీది కాకి చుట్టమె గద

    శ్రీ గన్నవరపు వారికి మిస్సన్న గారికి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  21. కట్టుకొనక ముందు బుట్టలోన పడగ
    గట్టి మాటలన్ని మొట్టులవగ
    రెట్ట వేసి నవ్వి తిట్టు వారలబోలు
    చెట్టుమీది కాకి చుట్టమె గద!

    రిప్లయితొలగించండి