న్యాయవాది యనగ నాగమారుతి శర్మ! కోట్ల నెరను జూప కూడ దనెను! రామ నామ మెపుడు రసన నుండగ చెడు ' గాలి ' యెటుల సోక గలదు ధరణి?
అజ్ఞాత కవిసీ. గెలియనట్టిదియైన గెల్పింతు ననుచునులా జూచి కల్పనలను ఘటించితప్పు జెప్పు మటన్నఁ దప్పుఁ జెప్పనివారినోటి కబద్ధముల్ నూఱిపోసిజెడ్జిగారికి నేను చెప్పుమాటలు పథ్యములు సుమీయని వాని మోసపుచ్చిరేపు ఫీజిచ్చెద మాపిచ్చెద నటన్నగాదు తెమ్మని ముందుగానె కొనియుతే.గీ.వ్యాజ్య మొకవేళ బోయిన వాని సాక్షిమీద నెపమిడి, గెల్చిన మీద బెట్టికొని నటింతురు ప్లీడరుల్ కొంద ఱిలనున్యాయవాదుల మంచు నన్యాయలీల.(‘శతావధాన సారము’ గ్రంథమునుండి)
మిస్సన్న గారూ, చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.అయితే ఒక అభ్యంతరం.... పద్యరచనాంశం ‘న్యాయవాదులు’ అయితే మీరు ‘న్యాయమూర్తి’ గురించి వ్రాసారు.
కలి యుగంబున న్యాయము కలల పంట నల్ల కోటుల మాటున నల్ల ధనము కనులు మూసిన దేవత కలత పడుచు న్యాయ వాదుల వాదన మాయ లందు
కళ్ళున్న న్యాయ వాదులు కళ్ళకు గంతలను గట్టి కళ్ళెము వేయన్ కళ్ళను మూసిన దేవత కళ్ళుండి దండ గనుచును కన్నీ రొలుకన్
( నిజమైన న్యాయ వాదులు క్షమింతురు గాక )నల్లని కోటుయు లోపల తెల్లని డ్రస్సుండు తేట తెల్లమయే ' లా ' నల్లని కోట్లే వారికి తెల్లని ముఖమిచట నెటుయు తేలకను ' హలా ' ! నల్లని కోట్లు = బ్లాక్ మనీ
న్యాయ వాదులు సత్యము నకును మారు పేరు గద మఱి , నిజమగు పేర్మి తోడన్యాయ బధ్ధముగను దీ ర్పు నీ య గలుగకనులు మూసిన దేవత కనులు దె ఱచు .
నిజమే గురువు గారూ!న్యాయమూర్తి యనగ నాగమారుతి శర్మ!కోట్ల నెరను జూప కూడ దనెను!రామ నామ మెపుడు రసన నుండగ చెడు' గాలి ' యెటుల సోక గలదు ధరణి?న్యాయ వాదు లట్టి న్యాయ మూర్తులు జూపు పథము నందు సాగి పరువు నిలుప జయము గలుగు ధర్మ చారులకిలలోన భయము గల్గు భూత దయయు పెరుగు.న్యాయ వాదు లిట్లు న్యాయానుయాయులై న్యాయ మార్గ మందు నడచిరేనిన్యాయ మగును సతము న్యాయార్థులకు దుర-న్యాయ మంతరించు ననఘ నిజము.
మంచిచెడ్డలు గలవెల్ల మానవులను న్యాయవాదులందరిని,నన్యాయవాదు లనగరాదు;విజ్ఞులును బ్రఖ్యాతులైన నీతిపరులు ,సజ్జనులనునెన్నవచ్చు.
ఆస్తి పంపక వ్యాజ్యమ్ము నందె నేనివత్సరమ్ములు వాయిదా పడగఁ జేయనర్జిదారుల యాస్తంత నావిరవ్వబిక్ష గాళ్ళుగ మార్చెడు పెద్దవారు!
న్యాయవాదులపై సానుకూల, ప్రతికూల అభిప్రాయాలను తెలియజేస్తూ చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....మిస్సన్న గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సుబ్బారావు గారికి, కమనీయం గారికి, సహదేవుడు గారికి,అభినందనలు, ధన్యవాదాలు.
న్యాయవాది యనగ నాగమారుతి శర్మ!
రిప్లయితొలగించండికోట్ల నెరను జూప కూడ దనెను!
రామ నామ మెపుడు రసన నుండగ చెడు
' గాలి ' యెటుల సోక గలదు ధరణి?
అజ్ఞాత కవి
రిప్లయితొలగించండిసీ.
గెలియనట్టిదియైన గెల్పింతు ననుచును
లా జూచి కల్పనలను ఘటించి
తప్పు జెప్పు మటన్నఁ దప్పుఁ జెప్పనివారి
నోటి కబద్ధముల్ నూఱిపోసి
జెడ్జిగారికి నేను చెప్పుమాటలు పథ్య
ములు సుమీయని వాని మోసపుచ్చి
రేపు ఫీజిచ్చెద మాపిచ్చెద నటన్న
గాదు తెమ్మని ముందుగానె కొనియు
తే.గీ.
వ్యాజ్య మొకవేళ బోయిన వాని సాక్షి
మీద నెపమిడి, గెల్చిన మీద బెట్టి
కొని నటింతురు ప్లీడరుల్ కొంద ఱిలను
న్యాయవాదుల మంచు నన్యాయలీల.
(‘శతావధాన సారము’ గ్రంథమునుండి)
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిచక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
అయితే ఒక అభ్యంతరం.... పద్యరచనాంశం ‘న్యాయవాదులు’ అయితే మీరు ‘న్యాయమూర్తి’ గురించి వ్రాసారు.
కలి యుగంబున న్యాయము కలల పంట
రిప్లయితొలగించండినల్ల కోటుల మాటున నల్ల ధనము
కనులు మూసిన దేవత కలత పడుచు
న్యాయ వాదుల వాదన మాయ లందు
కళ్ళున్న న్యాయ వాదులు
రిప్లయితొలగించండికళ్ళకు గంతలను గట్టి కళ్ళెము వేయన్
కళ్ళను మూసిన దేవత
కళ్ళుండి దండ గనుచును కన్నీ రొలుకన్
( నిజమైన న్యాయ వాదులు క్షమింతురు గాక )
రిప్లయితొలగించండినల్లని కోటుయు లోపల
తెల్లని డ్రస్సుండు తేట తెల్లమయే ' లా '
నల్లని కోట్లే వారికి
తెల్లని ముఖమిచట నెటుయు తేలకను ' హలా ' !
నల్లని కోట్లు = బ్లాక్ మనీ
న్యాయ వాదులు సత్యము నకును మారు
రిప్లయితొలగించండిపేరు గద మఱి , నిజమగు పేర్మి తోడ
న్యాయ బధ్ధముగను దీ ర్పు నీ య గలుగ
కనులు మూసిన దేవత కనులు దె ఱచు .
నిజమే గురువు గారూ!
రిప్లయితొలగించండిన్యాయమూర్తి యనగ నాగమారుతి శర్మ!
కోట్ల నెరను జూప కూడ దనెను!
రామ నామ మెపుడు రసన నుండగ చెడు
' గాలి ' యెటుల సోక గలదు ధరణి?
న్యాయ వాదు లట్టి న్యాయ మూర్తులు జూపు
పథము నందు సాగి పరువు నిలుప
జయము గలుగు ధర్మ చారులకిలలోన
భయము గల్గు భూత దయయు పెరుగు.
న్యాయ వాదు లిట్లు న్యాయానుయాయులై
న్యాయ మార్గ మందు నడచిరేని
న్యాయ మగును సతము న్యాయార్థులకు దుర-
న్యాయ మంతరించు ననఘ నిజము.
రిప్లయితొలగించండిమంచిచెడ్డలు గలవెల్ల మానవులను
న్యాయవాదులందరిని,నన్యాయవాదు
లనగరాదు;విజ్ఞులును బ్రఖ్యాతులైన
నీతిపరులు ,సజ్జనులనునెన్నవచ్చు.
ఆస్తి పంపక వ్యాజ్యమ్ము నందె నేని
రిప్లయితొలగించండివత్సరమ్ములు వాయిదా పడగఁ జేయ
నర్జిదారుల యాస్తంత నావిరవ్వ
బిక్ష గాళ్ళుగ మార్చెడు పెద్దవారు!
ఆస్తి పంపక వ్యాజ్యమ్ము నందె నేని
రిప్లయితొలగించండివత్సరమ్ములు వాయిదా పడగఁ జేయ
నర్జిదారుల యాస్తంత నావిరవ్వ
బిక్ష గాళ్ళుగ మార్చెడు పెద్దవారు!
న్యాయవాదులపై సానుకూల, ప్రతికూల అభిప్రాయాలను తెలియజేస్తూ చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిమిస్సన్న గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
కమనీయం గారికి,
సహదేవుడు గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.