30, మే 2013, గురువారం

సమస్యాపూరణం – 1067 (చల్లగ నయ్యె నీ ప్రకృతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
చల్లగ నయ్యె నీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చినంతనే.
(ఆకాశవాణి సౌజన్యంతో...)

15 కామెంట్‌లు:

 1. మల్లెల సోయగం బులట మాలతి జాజులు మోద మందగా
  మెల్లని పిల్ల వాయువులు మేలగు సౌరులు మోసి దెచ్చినన్
  అల్లరి కోయిలల్ మదిని ఝల్లని పించగ పాట పాడుచో
  చల్లగ నయ్యెనీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చి నంతనే !

  రిప్లయితొలగించండి
 2. రాజేశ్వరి గారికి అభినందనలు. ఈరోజు వారిదే అగ్ర తాంబూలం.

  జల్లులు కుంభవృష్టి కొనసాగెను శ్రావణ మందు, మేనులన్
  జిల్లనిపించె పౌష్యమున శీతల వాతము, చైత్ర మందునన్
  చల్లగ నయ్యె నీ ప్రకృతి సర్వము, గ్రీష్మము వచ్చినంతనే
  యెల్లెడ వేడి గాడ్పులకు నెల్లరు స్రుక్కిరి జ్యేష్ట మందునన్.

  రిప్లయితొలగించండి
 3. ఉల్లమెలర్ప మేఘములు హోరున వర్షము నిచ్చినంతనే
  జిల్లనె కాలమేఘ పరిశీలిత చేతము, శైశిరమ్మునన్
  చల్లఁగనయ్యె నీ ప్రకృతి సర్వము; గ్రీష్మము వచ్చినంతనే
  చిల్లులువడ్డరీతి మెయిఁ జెమ్మట లుప్పతిలెన్ ఘనమ్ముగన్

  రిప్లయితొలగించండి
 4. ధన్య వాదములు మిస్సన్న గారూ ! కానీ నిర్దో షంగా ఉండాలిగా

  రిప్లయితొలగించండి
 5. ఉల్లములందు నెల్లెడల నొప్పుగ శాంతి సుఖాలు గూర్చు నో
  సల్లలితాంగ! యాశ్రితుల సాకుచు నుందువు, నీ విభూతిచే
  చల్లగనయ్యె నీ ప్రకృతి సర్వము, గ్రీష్మము వచ్చినంతనే
  చల్లదనము పోదనుచు సన్మతి నమ్ముచునుందు శంకరా!

  రిప్లయితొలగించండి
 6. అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగనే యున్నది. 3వ పాదములో యతి మైత్రి కొరకు చిన్న మార్పు చేద్దాం ఇలాగ:
  "ఝల్లనిపించగ"కి బదులుగా: "హాయిని గూర్చెడు" అని అందాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. హాయిని గొల్పుచు అని వ్రాసి మళ్ళీ మార్చేసాను
  గురువులకు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 8. మల్లియ మొల్ల జాజి విరి మాలల వేదిక, మంగళధ్వనుల్
  మెల్లనమిక్కు టమ్ములయి మేనను పుల్కలు రేగ, లగ్నమై
  జల్లుగ నక్షతల్ జనులు చల్లగ, నయ్యెడ క్రొత్త జంటకున్
  చల్లగ నయ్యెనీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చి నంతనే !

  రిప్లయితొలగించండి
 9. అల్లనసాగరమ్మున మహత్తగు నల్పపు పీడనమ్మదే
  మెల్లగ నేర్పడంగను సమీరము వేగముతోడ వీచగా
  జల్లులఁ జెట్లు చేమలును స్నానములాడుచునుండ హాయిగా
  చల్లగ నయ్యె నీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చినంతనే.

  రిప్లయితొలగించండి
 10. మెల్లగ వీచు గాలులకు మేఘము లివ్వగ వర్షధారలన్
  చల్లగ నయ్యె నీ ప్రకృతి సర్వము ; గ్రీష్మము వచ్చి నంతనే
  ఫెల్లున కాయు నెండలకు వేగమె హెచ్చును వేడి గాలులే
  పిల్లలు పెద్ద లెల్లరును వీడక యుందురు యింటి లోపలన్

  రిప్లయితొలగించండి
 11. అల్లన వీచువాయువులు, హాయినొసంగెడి వాన జల్లుచే
  చల్లగ నయ్యె నీ ప్రకృతి సర్వము; గ్రీష్మము వచ్చినంతనే
  మెల్లగ నూష్మ బాధలును మేదిని యంతట నిండె వేడిచే
  పిల్లలు వృద్ధులాదిగను బెక్కు జనుల్ దివి కేగి రక్కటా !

  రిప్లయితొలగించండి
 12. pillalu peddalaMdarunu vEDini taaLaka vEgucuMDagaa
  allana vaayuguMDamadi yaMbudhipainanu tirGucuMDegaa
  nallani mEghamaaalikalu NaaTyamujEyucu noogucuMDagaa
  చల్లగ నయ్యెనీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చి నంతనే !

  రిప్లయితొలగించండి


 13. మల్లెలు,జాజులున్ మధురమౌ ఫలజాతి లభించుచిండినన్
  నెల్లరమున్ భయమ్ముపడ నీపరి వేసవి యుగ్రరూపమె
  ట్లల్లలనాడ జేయునొయటంచు; హఠాత్తుగ కుంభవృష్టిచే
  చల్లగ నయ్యె నీప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చినంతనే .

  రిప్లయితొలగించండి
 14. May 2019:

  దిల్లిని నేలు పోరునట తీవ్రపు రీతిని వేడి హెచ్చగా
  కుళ్ళుచు రాహులుండహహ! కూడలి నందున గోలబెట్టగా
  మెల్లగ మోడి గెల్వగను మేఘము దంచగ కుంభవృష్టినిన్
  చల్లగ నయ్యె నీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చినంతనే

  రిప్లయితొలగించండి