మిస్సన్న గారు! నేననుకొన్న భావనతోనే మీరు పూరించారు. మీ పద్యం అద్భుతంగా, రసవత్తరంగా ఉంది. ఇక నేను పూరించినా అంత అందంగా రాదేమో! మీకు నా హృదయ పూర్వకాభినందన!
ఆచార్య ఫణీంద్ర గారూ! ధన్యవాదములు. మీ ప్రశంస చాలా సంతోషాన్ని కల్గించింది. మీ బోటి ఆచార్యుల ప్రోత్సాహమే శంకరాభరణ కవిమిత్రులకు ఉత్తేజాన్ని కల్గిస్తున్నది. ఇక మీ పూరణ కూడా వినిపించమని మనవి. ఎప్పుడూ మంచిగంధం మంచిగంధమే.
డా. కమనీయం గారికి శుభాభినందనలు. మీ పద్యము -- "ప్రీతిన్ క్షుద్ర గణార్చనన్....." బాగగనున్నది. 3వ పాదములో ఒక అక్షరము తక్కువగ నున్నది. టైపు పొరపాటు కావచ్చును. హరిన్ కి ముందు శ్రీ అనే అక్షరము జేర్చితే సరిపోవును. స్వస్తి.
కవిమిత్రులకు నమస్కృతులు. రేపు మా తమ్ముని కూతురి పెళ్ళి. రెండు మూడు రోజులుగా పెళ్ళి పనులమీద తిరుగుతూ తీరిక లేకుండా ఉన్నాను. మరో రెండు రోజులవరకు ఇదే పరిస్థితి. దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి. (కొందరు చేస్తున్నారు కూడా.) అందరికీ ధన్యవాదాలు. * నిన్నటి సమస్యకు చక్కని పూరణ లందించిన కవిమిత్రులు... పండిత నేమాని వారికి, మిస్సన్న గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, లక్ష్మీదేవి గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, కమనీయం గారికి, జిగురు సత్యనారాయణ గారికి, అభినందనలు, ధన్యవాదాలు. * డా. ఆచార్య ఫణీంద్ర గారూ, లక్కరాజు వారూ, ధన్యవాదాలు.
భూత ప్రేత పిశాచ సంఘములకే ముప్పౌచు వర్తించుచున్
రిప్లయితొలగించండినేతల్ నేడు బకాసురాధికులరై నీచాతి నీచమ్ముగా
జాతి ద్రోహమొనర్పుచుండిరి గదా!; సంక్షేమమే కోరుచో
భూత ప్రేత పిశాచ సంఘమును సంపూజించినన్ మేలగున్
చేతన్ శూలము, బూది మేన, తలపై చెన్నొందు నెల్వంకయున్,
రిప్లయితొలగించండిభీతిన్ గొల్పెడు సర్పరాజ తతులున్, బెంబేలు పుట్టించు పల్
భూత ప్రేత పిశాచ సంఘమును సంపూజించినన్ మేలగున్
ప్రీతిన్ సాంబసదాశివున్ విరతులై బిల్వంబులన్ నిత్యమున్.
మిస్సన్న గారు!
రిప్లయితొలగించండినేననుకొన్న భావనతోనే మీరు పూరించారు.
మీ పద్యం అద్భుతంగా, రసవత్తరంగా ఉంది.
ఇక నేను పూరించినా అంత అందంగా రాదేమో!
మీకు నా హృదయ పూర్వకాభినందన!
భీతిన్ వీడుడు మానసంబు నికపై ప్రీతిన్ మదిన్ గొల్వ సా
రిప్లయితొలగించండికేతాధీశుని జానకమ్మ భటుడై ఖేదంబులన్ ద్రోలు నా
వాతా సూనుడు జేరి రక్ష నిడు తా వాలంబునన్ గొట్టుగా
భూత ప్రేత పిశాచ సంఘమును, సంపూజించినన్ మేలగున్
భీతిన్ బొంది సమస్త దుష్టమయమై విచ్చిన్నతన్ జెందరే
రిప్లయితొలగించండిభూతప్రేతపిశాచ సంఘముల సంపూజించినన్, మేలగున్
భూతాధీశుడు పార్వతీపతి జగత్పూజ్యున్ మహేశున్ సదా
ప్రీతిన్ కొల్చిన సర్వభద్ర శుభముల్ పెంపొందునెల్లపుడున్.
ఆహా! ఎంత చక్కని పూరణ! మిస్సన్నగారు అభినందనలు !!!
రిప్లయితొలగించండిమిస్సన్న గారు, హనుమచ్ఛాస్త్రి గారు, మీ పద్యాలు బాగా నచ్చినాయండి.
రిప్లయితొలగించండిచైతన్యంబగు శక్తి తానగుచు నా శర్వాణి రక్షించుచో,
శీతాద్రీశుని పుత్రియై కరుణతో క్షేమంబు కోరంగ నా
మాతా పార్వతిఁ జేరి గొల్తుమని సంభావించుచో నమ్మి యా
భూతప్రేతపిశాచసంఘమును సంపూజించినన్ మేలగున్.
మరొక ప్రయత్నము:
రిప్లయితొలగించండిభూత ప్రేత పిశాచ సంఘమును సంపూజించినన్ మేలగున్
ఖ్యాతిన్ గాంచగ వచ్చు నంచు కుమతుల్ గావించు దుర్బోధలన్
నీతి ప్రౌఢిమ మీర ద్రోయుచు; శివున్, విశ్వేశ్వరున్ భక్తితో
బ్రీతున్ జేయుము గాంచు మాతని గృపన్ వేవేల సద్యోగముల్
ఈ నాడు మిత్రులందరు మంచి మంచి పద్యములను వెల్వరించిరి. అందరికీ శుభాశీస్సులు. అభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండినా మొదటి పూరణ నాకు సంతృప్తి నీయలేదు.
రిప్లయితొలగించండిఅందుకే రెండవపూరణ..
భూతేశుండయి శంభుడే ప్రభువుగా బ్రోవంగలేదే మహా
భూతప్రేతపిశాచసంఘమును? సంపూజించినన్ మేలగున్,
మా తప్పుల్ క్షమియింపమంచు కడు దుర్మార్గుండు తా వేడినన్
సంతోషమ్మున కావడే? కరుణతో శాంతుల్ ప్రసాదింపడే?
దుర్మార్గుడు ఏకవచనము "మా" తప్పులు అని బహువచనము వాడినాననిపిస్తున్నది.
ఆచార్య ఫణీంద్ర గారూ! ధన్యవాదములు. మీ ప్రశంస చాలా సంతోషాన్ని కల్గించింది. మీ బోటి ఆచార్యుల ప్రోత్సాహమే శంకరాభరణ కవిమిత్రులకు ఉత్తేజాన్ని కల్గిస్తున్నది. ఇక మీ పూరణ కూడా వినిపించమని మనవి. ఎప్పుడూ మంచిగంధం మంచిగంధమే.
రిప్లయితొలగించండిపీతాంబరధరా! లక్ష్మీ దేవి గారూ! ధన్యవాదాలు.
మరొకటి:
రిప్లయితొలగించండికోతిన్, గాలి కుమారునిన్, క్షణములో కొండంత దేహమ్ముతో
లోతౌ నీటిని దాటు వాని, త్రుటిలో రోగమ్ములన్ బాపుచున్
భీతిన్ మాపెడువాని, మారుతిని దేవీ! విన్ము పోద్రోలగా
భూతప్రేతపిశాచసంఘమును సంపూజించినన్ మేలగున్.
చేతల్ చేయుచు యంత్ర తంత్రములచే జీన్డ్రంపు బాబాలు సం
రిప్లయితొలగించండిప్రేతిన్ బోధొ నరించి మూర్ఖులను ప్రేరేపింతు రీరీతిగన్
"భూత ప్రేత పిశాచ సంఘమును సంపూజించినన్ మేలగున్"
భూతాత్ముండు సదాశివుండ తనినే బూజించ క్షేమంబగున్ .
భీతిన్ గొల్పుచు శ్రీ హరుండు వెడలెన్ భేదిల్లు బ్రహ్మాండ మున్
రిప్లయితొలగించండిరాతన్ మార్చుట నేరి కైన తరమే రౌద్రంబు నన్ సిం హ మై
ఏతత్ కేశవుడా హిరణ్య కశిపున్ చెండాడి చంపంగ యా
భూత ప్రేత పిశాచ సంఘమును సంపూజించినన్ మేల గున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిPandita Nemani గారూ మంచి పూరణ చక్కగా చెప్పారు.
రిప్లయితొలగించండిభూత ప్రేత పిశాచ సంఘమును సంపూజించినన్ మేలగున్
ఖ్యాతిన్ గాంచగ వచ్చు నంచు కుమతుల్ గావించు దుర్బోధలన్
రాజేశ్వరి నేదునూరి గారూ పద్యం చాలా బాగుంది.
రిప్లయితొలగించండిభీతిన్ గొల్పుచు శ్రీ హరుండు వెడలెన్ భేదిల్లు బ్రహ్మాండ మున్
రాతన్ మార్చుట నేరి కైన తరమే రౌద్రంబు నన్ సిం హ మై
రిప్లయితొలగించండిప్రీతిన్ క్షుద్ర గణార్చనన్ వికటమౌ భీతావహమ్మే యగున్
భూతప్రేతపిశాచ సంఘమును సంపూజించినన్ ; మేలగున్
ప్రాతః సంధ్యల పంకజాక్షుని జగత్ప్రాణావనున్,హరిన్,
చేతోమోదము కల్గ బూజ సలుపన్ జేకూరు సౌభాగ్యముల్
భూతంబుల్ పెను గాలి దయ్యములు కాష్మోరాలు మోదంబునన్
రిప్లయితొలగించండిప్రీతిన్ జూపును శిష్య! క్షుద్రములు గంభీరంబులౌ జూచినన్
మా తాతల్ కడు మేటి చేత బడిలో, మంత్రాల మారయ్యనేన్
భూతప్రేతపిశాచసంఘమును సంపూజించినన్ మేలగున్!!
శ్రీ లక్కరాజు గారికి ధన్య వాదములు
రిప్లయితొలగించండిడా. కమనీయం గారికి శుభాభినందనలు.
రిప్లయితొలగించండిమీ పద్యము -- "ప్రీతిన్ క్షుద్ర గణార్చనన్....." బాగగనున్నది. 3వ పాదములో ఒక అక్షరము తక్కువగ నున్నది. టైపు పొరపాటు కావచ్చును. హరిన్ కి ముందు శ్రీ అనే అక్షరము జేర్చితే సరిపోవును. స్వస్తి.
శ్రీ లక్కరాజు గారు మా పద్యమును గూర్చి ప్రశంసించుట ముదావహము - వారికి మా కృతజ్ఞతలు. స్వస్తి.
రిప్లయితొలగించండికవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిరేపు మా తమ్ముని కూతురి పెళ్ళి. రెండు మూడు రోజులుగా పెళ్ళి పనులమీద తిరుగుతూ తీరిక లేకుండా ఉన్నాను. మరో రెండు రోజులవరకు ఇదే పరిస్థితి. దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి. (కొందరు చేస్తున్నారు కూడా.) అందరికీ ధన్యవాదాలు.
*
నిన్నటి సమస్యకు చక్కని పూరణ లందించిన కవిమిత్రులు...
పండిత నేమాని వారికి,
మిస్సన్న గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
కమనీయం గారికి,
జిగురు సత్యనారాయణ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
లక్కరాజు వారూ,
ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపండితనేమానివారికి,ధన్యవాదాలు.నా పద్యంలో 3వపాదంలో 'హరిన్ 'కిబదులు 'శ్రీహరిన్ ' అంటే సరిపోతుంది.
నీతుల్ జెప్పెడి రాహులుండ! భడవా! నీవింక జందెమ్ముతో
రిప్లయితొలగించండికోతల్ కోయక బ్రాహ్మణుండ ననుచున్ కొంచెమ్ము సిగ్గొందుచున్
యాతాయాతపు జీవితమ్ము కనుచున్ యాగమ్ములన్ మానుచున్
భూతప్రేతపిశాచసంఘమును సంపూజించినన్ మేలగున్