16, మే 2013, గురువారం

పద్య రచన - 343 (రాదు - పోదు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“రాదు - పోదు”

19 కామెంట్‌లు:

 1. ఏమి వచ్చునో రాదో పోదో
  తెలీదు కాని ఒక్కటి ఖాయం
  e-జిలేబి కి యతి రాదు ప్రాస రాదు
  అయినా వచ్చి కామెంట క పోదు !!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. జిలేబి గారూ క్షమించండి . మీ అభిప్రాయం పద్యంగా వ్రాశాను.

  ఈ జీలేబికి పద్యము
  లేజీ మరి, రాదు వ్రాయ లెక్కకు నొకటిన్
  ఈజీలే కామెంటుట
  రోజూ తా మరచి పోదు లుక్కిటు వేయున్.

  రిప్లయితొలగించండి
 3. మూర్తి గారూ ! 'ముక్కు తుమ్మన ' పద్యం బలే చమత్కారం గా ఉంది..

  రిప్లయితొలగించండి
 4. శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారూ ! మీ చమత్కారము కూడా బాగుంది! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 5. ప్రాప్తి లేనిది యిసుమంత రాదు మనకు
  పోదు మన నుండి , చేసిన పుణ్య మెపుడు
  పాప పుణ్యము లాయవి పరిగ ణిం చ
  పాప శాతము బెరుగును పాపులకును .

  రిప్లయితొలగించండి
 6. రమ్మనంచు బిలువ రాదదృష్టమ్మెప్డు
  పొమ్మనినదినాన బోదు కూడ,
  కారణమ్ములెన్నొ కలవదృష్టమునకు
  మనప్రయత్నమెపుడు మానరాదు.

  రిప్లయితొలగించండి
 7. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
  లీల లందున బొంకులు లేని వాడు,
  లలిత మర్యాదుడైన ప్రహ్లాదు డధిప!
  అనే భావమును మర్చిపోవద్దు. కవితలోనైన అధర్మ భావనలు రానీయవద్దని నా సూచన. తదుపరి మీ ఇఛ్ఛ.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. రాదు రాదని పల్కరాదు దుర్లభమైన
  ....మానవజన్మ సంప్రాప్తమయ్యె
  రాదు రాదన నేల వేదాంత మలవడి
  ....యొదవె ముముక్షుత్వ మొప్పు మీర
  రాదు రాదన నేల లలిత గుణాఢ్యులౌ
  ....జనుల సాంగత్యంబు సంభవించె
  రాదు రాదన నేల ప్రాజ్ఞులౌ సద్గురు
  ....నాశ్రయమను యోగమందెను భువి
  పోదు భవ్యాత్మ చింతన బుద్ధి నుండి
  పోదు విషయ సౌఖ్యములపై బుద్ధి బళిర!
  పోదు నా జన్మ వ్యర్థమై పోదు పోదు
  పొందు తథ్యమ్ము నా యత్నములు జయమ్ము

  (శ్రీ శంకరాచార్యులు రచించిన వివేకచూడామణి అను గ్రంథములోని ఈ క్రింది శ్లోకము ఆధారముగా --

  దుర్లభం త్రయ మేవైతత్
  దైవానుగ్రహ హేతుకం
  మనుష్యత్వం, ముముక్షుత్వం,
  మహాపురుష సంశ్రయః)

  రిప్లయితొలగించండి


 9. ముక్కు తోడ మున్ను మూర్కొన్న పుష్పంపు
  రజము మిక్కుటమ్ము రట్టు జేసె !
  వచ్చు ననగ రాదు, వారింప పోదుగా
  తుమ్ము ! దాని సొమ్ము వమ్ము గాను !!!

  రిప్లయితొలగించండి
 10. నేమాని పండితార్యా! మీ సదుపదేశమునకు ప్రణామ శతము.
  నా పద్యాలను క్రింది విధంగా మార్చుచున్నాను:

  ధర్మ పథమును దప్పెను కర్మ జేత
  జీవిత మ్మెల్ల వృథ యయ్యె చేటు గలిగె
  నొక్క ధూర్తున కయ్యెడ నొక దినాన
  సద్గురుని దివ్య సాంగత్య సౌఖ్య మబ్బె.

  ఆశ్చర్య మేమొ గానీ
  పశ్చాత్తాపమ్ము గల్గె భావము లోనన్
  దుశ్చింతల బాపుడు నను
  నిశ్చింతుగ జేయుడనుచు నెమ్మది జెప్పెన్.

  దాన మిద్ద మన్న ధనము చేతికి నాకు
  రాదు రానె రాదు వాదు లేల
  దైవ చింత యన్న తసదియ్య నాబుద్ధి
  పోదు పోనె పోదు పొల్లు గాదు.

  మంచి చేద మన్న మంచి యాలోచన
  రాదు రానె రాదు వాదు లేల
  పరుల కుపకరించు పనులందు నాబుద్ధి
  పోదు పోనె పోదు పొల్లు గాదు.

  పరుల సొత్తు నుండి మరలింప నాబుద్ధి
  రాదు రానె రాదు వాదు లేల
  న్యాయ మార్గ మందు నడువగ నామది
  పోదు పోనె పోదు పొల్లు గాదు.

  శాంత మన్న మాట సుంతయు వినబుద్ధి
  రాదు రానె రాదు వాదు లేల
  కోప తాపములవి కూడ దన్నను విన
  బోదు పోనె పోదు పొల్లు గాదు.

  పాప చింత వీడి పాపము నాబుద్ధి
  రాదు రానె రాదు వాదు లేల
  పుణ్య కర్మ వైపు బుధులెన్నిచెప్పినన్
  పోదు పోనె పోదు పొల్లు గాదు.

  మీదు పదము లాన మీరెను హద్దుల
  నాదు నడత దయను నన్ను దిద్ది
  మంచి బాట వైపు మళ్ళించు డని వాడు
  గురు చరణము లంటి కోరుకొనెను.

  వినెను గురువు వాని వేదన దయ గల్గె
  పల్కె నిట్లు తాను బాధ పడకు
  తొల్లి జన్మ లోని దుష్కర్మ లకుతోడు
  కుజన మైత్రి జేసె గొప్ప కీడు.

  నేటి సంపదలును నేటి భోగమ్ముల
  శాశ్వతమ్ము లనెడు సత్య మెరుగ
  చింత లన్ని దీరు జీవున కిలలోన
  శివుని పదము వైపు చిత్త మేగు.

  నేటి నుండి నీకు నిశ్చయమ్ముగ మేలు
  జరుగు ననుచు గురువు కరుణతోడ
  మంత్ర రాజ మిచ్చె మహితాత్మ మైనది
  మారె వాడు బ్రతుకు మారె తుదకు.

  రిప్లయితొలగించండి
 11. ఈనాటి అంశానికి చక్కని పద్యాలను వ్రాసిన కవిమిత్రులు...
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  కమనీయం గారికి,
  పండిత నేమాని వారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  మిస్సన్న గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  జిలేబీ గారూ,
  మీ భావానికి గోలి వారి పద్యరూపాన్ని చూసారు కదా!

  రిప్లయితొలగించండి
 12. సంపదలు దైవ కృపలన
  ఇంపుగ నే కొలిచి నంత యీసున కైనన్
  పెంపున రాదది పోదన
  చంచల కినుక వహించ చెదరును క్షణమే 1

  రిప్లయితొలగించండి
 13. క్షమిం చాలి చివరి పాదం
  చంచల కోపించి నంత జరిగును క్షణమే

  రిప్లయితొలగించండి
 14. మళ్ళీ పొరబాటు
  చంచల కోపించి నంత జరుగును క్షణమే

  హత విధీ ? ఇంకా పొరబడితే ఇం......తే....సంగతులు

  రిప్లయితొలగించండి
 15. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం (సవరణతో) బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి