2, మే 2013, గురువారం

పద్య రచన - 329 (విహారయాత్రలు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“విహారయాత్రలు”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

21 కామెంట్‌లు:

  1. అహరహము పరుగు లెట్టుచు
    సహనము నశియించి బ్రతుకు సాగుచు నుండన్
    మహదానందము గూర్చెడు
    విహార యాత్రలు మనసుకు వేడుకఁ జేయున్!

    రిప్లయితొలగించండి






  2. వినుముర విహార యాత్రలు
    అనయము మఱి చేయు నెడల నబ్బును దెలివిన్
    కన వచ్చును రహదారులు
    వినవచ్చును దెలియ రాని విషయము లెన్నో .

    రిప్లయితొలగించండి
  3. శ్రీ సహదేవుడు గారి పద్యము బాగుగనున్నది. చిన్న మార్పులతో ....

    అహరహము పర్వు లిడుచును
    సహనమ్ము నశించి బ్రతుకు సాగుచునుండన్
    మహదానందము గూర్చుచు
    విహార యాత్రలు కరమ్ము వేడుక జేయున్

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  4. శ్రీ సుబ్బా రావు గారి పద్యము బాగుగ నున్నది. కొలది మార్పులతో ....

    వినుముర విహార యాత్రల
    ననయమ్ము నొనర్ప తెలివి యబ్బుచు నుండున్
    కనవచ్చును రహదారులు
    వినవచ్చును క్రొత్త క్రొత్త విషయముల సుధీ!

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  5. కనులను వింతలఁ జూడగ
    జనుచుంద్రు విహారయాత్ర చక్కగ కనగా
    మనమును మురిపించును మరి
    జనులకు వ్యయములనధికము జరిపించునుగా

    రిప్లయితొలగించండి
  6. వినుడు యాత్రలన్న విజ్ఞానయాత్రలు,
    హర్షమొసగు నీ విహారయాత్ర
    లవనిలోన తీర్థయాత్రలు చూడంగ
    కలవు పెక్కులిట్లు క్రమముగాను.

    బాలబాలికలకు పరమాద్భుతంబౌచు
    యువజనాళి లోన జవము బెంచు
    నిద్ధరిత్రిలోన వృద్ధులకైనను
    హాయి నొసగు నీ విహారయాత్ర.

    క్రొత్త దంపతులకు నుత్తమంబీయాత్ర
    ఎదకు నెదనుజేర్చి ముదము గూర్చి
    స్వర్గ సౌఖ్యమిలను చక్కగా చూపించి
    హాయి నొసగు నీ విహారయాత్ర.

    మనములందు బెంచు మమతానురాగంబు
    లోకరిపైన నొకరి కొప్పుమీర
    రోష మణచివేసి ద్వేషభావము ద్రుంచి
    హాయి నొసగు నీ విహారయాత్ర.

    అంతరంగమందు నలసత్వమును బాపి
    యుత్సహింప జేయుచుండు నెపుడు
    చేతమందు నిల్పి నూతనోత్తేజంబు
    హాయి నొసగు నీ విహారయాత్ర.

    నిత్యకర్మలందు నత్యంత వ్యస్తులై
    విసుగుచెందుచుండి రుసరుసలను
    చూపుచుండు వారి కేపట్టునైనను
    హాయి నొసగు నీ విహారయాత్ర.

    రిప్లయితొలగించండి
  7. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    నమస్కారములు!

    శ్రీ కోట వీరాంజనేయశర్మ గారని హైదరాబాదులో గొప్ప శతావధాని, మహాకవి ఒకరుండేవారు, మీకు తెలిసే ఉంటుంది. బహుగ్రంథకర్త. 1970లో వారు మద్రాసులో అష్టావధానం చేసినపుడు నేను విద్యార్థిని. తొలిసారి పృచ్చకునిగా అవధానంలో కూర్చున్నాను. పూజ్యులు శ్రీ దివాకర్ల వేంకటావధాని గారు ఆరోజు ఊళ్ళో ఉన్నందువల్ల అధ్యక్షులుగా సభకు విచ్చేశారు. మా పాఠశాలలో ఆ వారం మేము విహారయాత్రకు వెళ్తున్నాము. అందువల్ల నేను వారిని "విహారయాత్ర" అన్న అంశంపై ఆశువు చెప్పమని మొదటి ఆవృత్తిలో కోరాను. సర్వజ్ఞులు వారు, విషయాన్ని ఊహించి, "ఏం నాయనా! మీ స్కూల్లో సంగతి అడిగావా?" అంటూ, దరస్మేరవదనులై ఈ అద్భుతావహమైన పద్యం చెప్పారు:

    బడికొక రీతి దుస్తు; లటుపై లఘుభోజనపాత్ర, పొత్తముల్
    తడియకయుందఁ బెట్టెలు, కలంబులు, బస్సుల రాకపోకకై
    పిడికెడు పైస, లా పయిని విందు వినోద విహారయాత్రలున్
    బుడుతల విద్య నేఁటి కిటు మూర్తి ధరించెను చిత్ర మెన్నఁగన్.

    అప్పుడు సభలో మార్మ్రోగిన చప్పట్లు నాకింకా గుర్తున్నాయి. సభాంతంలో నాకు కప్పిన శాలువను వారి పాదాల చెంత ఉంచి, ఆ పుంభావసరస్వతికి ప్రణమిల్లాను. మీరిచ్చిన ఈనాఁటి అంశాన్ని చూడగానే ఆ ఉదంతం జ్ఞాపకం వచ్చి మీకు విన్నవించుకోవా లనిపించింది.

    ఏమి రోజులవి!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  8. శ్రీ హరి....మూర్తి గారు ఒక చక్కని ఖండికను వెలువరించేరు. శుభాభినందనలు. అన్ని పద్యములకు ఒకే మకుటము ఉంచితే ఇంకా బాగుండేది. 6 పద్యము 1వ పాదాంతములో అత్యంత వ్యస్తులై అనుటలో వ్య ముందరి త గురువై గణభంగము అగును. మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి




  9. తలచి యుండ్రి విహారయాత్రలకు బోవ
    వాదులాడిరి సింలాకొ ,వారణాసి
    కా యటంచును దంపతుల్ కడకు,కంచి,
    తిరుపతికి, బోవ నిర్ణయించిరి ,ముదమున.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు. పద్యాన్ని మెచ్చి హృద్యంగా సవరణలు జేసినందులకు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు. పద్యాన్ని మెచ్చి హృద్యంగా సవరణలు జేసినందులకు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు. పద్యాన్ని మెచ్చి హృద్యంగా సవరణలు జేసినందులకు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు. పద్యాన్ని మెచ్చి హృద్యంగా సవరణలు జేసినందులకు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు. పద్యాన్ని మెచ్చి హృద్యంగా సవరణలు జేసినందులకు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  15. చల్లగ సేదను తీరగ
    పిల్లలతో పెద్దలంత ప్రియముగ వెడలన్
    అల్లన విహార యాత్రకు
    అల్లాడక యెండలన్ని హాయిగ గడుచున్.

    రిప్లయితొలగించండి
  16. ఆర్యా!
    నమస్కారములు మరియు ధన్యవాదములు.
    నా చివరి పద్యం మొదటి పాదాన్ని ఇలా మారుస్తున్నాను.

    "నిత్యకర్మలందు నత్యంత మగ్నులై"

    రిప్లయితొలగించండి
  17. విహారయాత్రలు అన్న అంశంపై మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు....
    సహదేవుడు గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    కమనీయం గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    నిన్నటి అంశం మధురస్మృతికి దోహదం చేసినందుకు సంతోషం.
    శ్రీ కోట వీరాంజనేయశర్మ గారి పేరు వినడమే కాని వారి వివరాలు తెలియవని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. అవధానంలో వారి చెప్పిన పద్యం అద్భుతంగా ఉంది. ఆ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ ఖండకృతి హృదయాహ్లాదాన్ని కలిగించింది. మీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి