రాజేశ్వరి అక్కయ్యా, పూరణ బాగుంది. అభినందనలు. కానీ ఏ రాయలు (రాజు) రచించినట్టు? (రాయలు శబ్దానికి రాజు అనే అర్థం ఉంది) * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు. ‘ఉన్నన్నొక’..? ఆ పాదాన్ని ‘వేయి పడగల గనిన కవి...’ అందామా? * రాజేశ్వరి అక్కయ్యా, గోలి వారు చెప్పేదాకా నా దృష్టికి రాలేదు. మీ పద్యంలో ప్రాసను సవరించండి.
రాజేశ్వరి అక్కయ్యా, మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు. రెండవ పాదంలో గణదోషం. ‘ఆయా సుపవిత్ర గాధ...’ అందామా? సవరించిన మొదటి పూరణలో గణదోషాలున్నవి. నా సవరణ.... వేయేల గ్రంధములు పా రాయణమును జేసి నంత రంజిల్ల మదిన్ ! హాయిగ రాముని కధ నొక రాయలు రచి యించె నంట రామాయణ మున్ ! * డా. ఆచార్య ఫణీంద్ర గారూ, విష్ణుచిత్తీయాన్ని ప్రస్తావిస్తూ చక్కని పూరణ చేసారు. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, రామాయణాన్ని రచించి రాయలను మెప్పించిన మొల్ల విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
నాయన జెప్పెను మును, పా-
రిప్లయితొలగించండిరాయణ మొనరింప బ్రోచు రాముడు! ముని పె
ద్దాయన వాల్మీకులు, విను
రాయలు! రచియించెనంట రామాయణమున్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండివిరుపుతో చక్కని పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.
నారాయణ గ్రంధ రచన
రిప్లయితొలగించండిపారాయణ జేసి నంత ఫలితము మెండౌ !
సోయగమగు రామకధను
రాయలు రచియించె నంట రామాయణ మున్ !
ఆయన చరితను వ్రాసిన
రిప్లయితొలగించండిమాయును గా పాపమంచు మాధవు దయతో
వేయిని మించుచు పలు కవి
రాయలు, రచియించెనంట రామాయణమున్.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిపూరణ బాగుంది. అభినందనలు.
కానీ ఏ రాయలు (రాజు) రచించినట్టు? (రాయలు శబ్దానికి రాజు అనే అర్థం ఉంది)
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
ఆయన చరితను వ్రాసిన
రిప్లయితొలగించండిమాయును గా పాపమంచు మాధవు దయతో
వేయిగ నున్నన్నొక కవి
రాయలు, రచియించెనంట రామాయణమున్.
ఆర్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిరాజేశ్వరి గారూ ! ప్రాస....
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
‘ఉన్నన్నొక’..? ఆ పాదాన్ని ‘వేయి పడగల గనిన కవి...’ అందామా?
*
రాజేశ్వరి అక్కయ్యా,
గోలి వారు చెప్పేదాకా నా దృష్టికి రాలేదు. మీ పద్యంలో ప్రాసను సవరించండి.
ఓయి రమణ ! చెప్పుము రా
రిప్లయితొలగించండిమాయణ రచయిత యెవరని మాస్టా రడుగన్
ఓ ! యని పలికె నిటుల "యా
రాయలు రచియించెనంట రామాయణమున్ "
మాయలు వల్లించకు మే
రిప్లయితొలగించండిరాయలు రచియించెనంట? రామాయణమున్
శ్రేయము దలంచి శ్రీరా
మాయణమును వ్రాసె దొల్లి మౌనివరుండే
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
'ఇటుల నా రాయలు...' అనండి.
*
పండిత నేమాని వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
పాయసము వలె మధురముగ
రిప్లయితొలగించండివ్రాయగ నదియే తెనుగున ప్రబలము కాగా
తీయగ బుద్ధుండనియెడు
రాయలు రచియించెనంట రామాయణమున్.
గోనబుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం తెలుగునాట ప్రసిద్ధము.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిగోన బుద్ధారెడ్డి విషయంగా నేను పూరణ చెయ్యాలనుకున్నాను. ఆ పని మీరు సమర్థంగా చేసారు. చక్కని పూరణ మీది. అభినందనలు.
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలండి.
మీరూ వ్రాయండి. మీ పద్యాలు చదవడం మాకెంతో సంతోషదాయకం.
శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిగురువు గారికి ధన్యవాదములు
=========*==========
వేయి విధముల రచనలను
రాయలు రచియించె నంట,రామాయణమున్
గాయకులు భక్తితోడన్
పాయసమని ద్రాగిరి మది బరవశ మొందన్
వేయి విధముల రచనలను
రాయలు రచియించె నంట,రామాయణమున్
గాయకులు భక్తితోడన్
కోయిల వలె బాడె జనులు కూరిమి నొందన్
రిప్లయితొలగించండిపాయక సత్కావ్యము రా
మాయణము రచించి కవులు మాన్యతనొందన్
తీయని ద్విపదను బుద్ధా
రాయలు రచియించె నంట రామాయణమున్.
(గోనబుద్ధారెడ్డి రాజే కదా.రాట్ శబ్దం నుండే 'రెడ్డి ' అన్నపదం వచ్చిందంటారు.)
ఆ యీ గోదా గాధను
రిప్లయితొలగించండిరాయలు రచియించె నంట , రామాయణ మున్
పాయక వా ల్మీ కి యె గా
ఆయా కవులను బుడమిని నారాధింతున్
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కమనీయం గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్కృతులతో,
శ్రీయోష దివ్యగాథ న, జేయకవిత్వమహిమమున సీతాయనమున్
జేయఁగ రఘునాథ మహా, రాయలు రచియించెనంట రామాయణమున్.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఏల్చూరి మురళీధర రావు గారూ,
రిప్లయితొలగించండిరఘునాథ నాయకుని గురించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
ఏయే కవులు రచించిన
రిప్లయితొలగించండిఆయా పలు పవిత్ర గాధ లా రాముని పై !
రాయస మొప్పగ రఘు రామ
రాయలు రచియించె నంట రామాయణ మున్ !
పొరబాటును తెలిపిన శ్రీ గోలి వారికి , గురువులకు ధన్య వాదములు
శ్రేయమునిడు శ్రీరంగడు,
రిప్లయితొలగించండిమా యమ గోదమ్మ కథను మరి వివరింప
న్నాయది రామాయణమగు -
రాయలు రచియించెనంట రామాయణమున్!
ఆ యమ మొల్ల తన చిరు
రిప్లయితొలగించండిప్రాయమునే కవిత జెప్పి, పదుగురు తోడన్
సోయగమని వెస మెచ్చగ
రాయలు, రచియించెనంట రామాయణమున్.
సవరించిన పద్యము
రిప్లయితొలగించండివేయేల గ్రంధ రచనలు పా
రాయణ జేసి నంత రంజిల్ల మదిన్ !
సోయగ మగురామ కధ నొక
రాయలు రచి యించె నంట రామాయణ మున్ !
మాయని రామాయణమిది
రిప్లయితొలగించండిసాయక మూలమున వెలసె సర్వోన్నతమై
యీయవని లోన బర కవి
రాయలు రచియించె నంట రామాయణ మున్ !
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. ‘ఆయా సుపవిత్ర గాధ...’ అందామా?
సవరించిన మొదటి పూరణలో గణదోషాలున్నవి. నా సవరణ....
వేయేల గ్రంధములు పా
రాయణమును జేసి నంత రంజిల్ల మదిన్ !
హాయిగ రాముని కధ నొక
రాయలు రచి యించె నంట రామాయణ మున్ !
*
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
విష్ణుచిత్తీయాన్ని ప్రస్తావిస్తూ చక్కని పూరణ చేసారు. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రామాయణాన్ని రచించి రాయలను మెప్పించిన మొల్ల విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మా అన్నగారు పూజ్యనీయులు శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారు ఆధ్యాత్మిక రామాయణమును వ్రాసినారు కదా ! ఆయన ' కవి రాయలు 'గాదా !
రిప్లయితొలగించండిశ్రీయుతమని యాద్ధ్యాత్మిక
శ్రేయస్సును బోధఁ జేయ శివుడా సతికిన్
ఆయత కీర్తిఁ బడసి కవి
రాయలు రచియించెనంట రామాయణమున్
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీరు చూపిన సవరణ తో...
ఆయన చరితను వ్రాసిన
మాయును పాపమ్మనుచును మరి వేయున్నన్
వేయిపడగలిచ్చిన కవి
రాయలు రచియించెనంట రామాయణమున్.
వ్రాయగ సూరన మెచ్చును
రిప్లయితొలగించండిరాయలు, రచియించె నంట రామాయణమున్
పేయముగ పాండ వీయముఁ
దీయగఁ గలిపి కవులెల్ల ధీమతి యనగన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచూస్తిని నేనొక బుక్కును
రిప్లయితొలగించండితప్పులు పదివేలు గదరా తప్పుల తడకన్!
చూడొక ఉదహరణ మిచట
రాయలు రచియించె నంట రామాయణ మున్!
నా పద్యంలో మరియింత స్పష్టత పెంచే ప్రయత్నం ...
రిప్లయితొలగించండిమా యమ గోదమ్మ కథను
వ్రాయంగ నది యొక పెద్ద రామాయణమౌ!
శ్రీ ’యామున చరిత’ గలిపి,
రాయలు రచియించె నట్టి రామాయణమున్!
సహదేవుడు గారు!
రిప్లయితొలగించండిమీ పద్యం ఉత్కృష్టంగా ఉంది. అభినందన!
తమ్ముడు చి. డా. నరసింహమూర్తికి నాయందు గల ఆదరాభిమానములకు చాల సంతోషము - మా అధ్యాత్మ రామాయణ రచన గురించి ప్రస్తావించుట ముదావహము. స్వస్తి.
రిప్లయితొలగించండిబోయయని కొందరందురు
రిప్లయితొలగించండికాయుచు దారులను దోచు
కఠినుండనుచున్
హాయిగ చీమల పుట్టల
రాయలు రచియించెనంట రామాయణమున్!