మేకవన్నె పులులు అన్న అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు.... గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, సుబ్బారావు గారికి, లక్ష్మీదేవి గారికి, కమనీయం గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, సహదేవుడు గారికి, నాగరాజు రవందర్ గారికి, అభినందనలు, ధన్యవాదాలు.
ఆకులు తినునట్లుందురు
రిప్లయితొలగించండిమేకలుగా కానుపించి మీదట పులులై
యాకొని రుధిరము ద్రాగెడు
భీకర మతులైన వారి వేషము గనుమా !
మేలు సేత మనుచు మెరిపించు వాక్కుల
రిప్లయితొలగించండిదఱికిఁ జేరి మీద, వెఱపు లేక
నమ్ము జనుల నిండు నట్టేట ముంచెడి
మేకవన్నె పులుల మేఱఁ జనకు .
మేక వన్నె పులులు మేడపాడు చివర
రిప్లయితొలగించండిదట్టమైన నడవి దరిన నుండె
మిగుల శాంతములయి మేక పాల వలెను
చిక్క నైన పాలు చేపి యిచ్చు .
మేక వన్నె పులిని మించినట్టి నటనఁ
రిప్లయితొలగించండిజూపె నొకడు తాను సుందరమగు
జింక రూపమందు సీతనాకర్షించి
రాముఁ జేత చచ్చె రాక్షసుండు.
రిప్లయితొలగించండిమెరమెచ్చులాడుచు మెప్పించి జనులను
పదవి దక్కెడుదాక పదములంటి ,
ఎప్పటికెయ్యది గొప్పదైనను దాని
మార్గాన నడచుచు మాటమార్చి
కస్జ్టకాలమునందు గల్లలాడుచు ,మెల్ల
మెల్లగా దూరమై మెలగుచుండి
'ఆయరాం ,గయరా ' మనునట్లు పార్టీలు
చొక్కాలు మార్చెడు చొప్పు జూడ
వీరికన్నను దలప నే వేళనైన
' మేకవన్నెల బెబ్బులి ' మేలటంచు
దోచు పరిశీలకులకు నీ ధూర్త జనుల
సజ్జనులు దూరముగనుంచి చనగ వలయు.
మాట తేట తనువు తూటాల పాతర
రిప్లయితొలగించండిప్రక్క నుండి ప్రేల్చ భస్మ మాయె
తమిళ నాట నాడు దారుణ కారక
మేక వన్నె నళిని మృత్యు పులియె!
తేనె పూసిన కత్తుల తీపి మాట
రిప్లయితొలగించండిమదిని మురి పించి మరపించి మాయ జేయు
మేక వన్నెల పులులున్న మేధి నందు
జాగ రూకుడవై యున్న జయము గలుగు !
పెదవి మీద నగవు లొదవు చుండునుగాని
రిప్లయితొలగించండిబాహుమూల మందు బాకులుండు
మేకవన్నె పులులు మేదిని యెందరో !
నమ్మరాదు వారి నటన జూచి
మేకవన్నె పులులు అన్న అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
కమనీయం గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
సహదేవుడు గారికి,
నాగరాజు రవందర్ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.