నాది అనునది ఇదియును లేదు మనది అనునది మరీను లేదు ఉన్నదల్లా ఆ పై అల్లా క్రింద మనం తెలిసుకొనవె జిలేబీ ధన్యమగు జన్మ !జిలేబి
నాదేయన స్వార్థమ్మగు నీదేయన కలసి యుండనేరము కాదా ?కాదే నీదీ నాదీ యేదైనను మనది యనగ నెంతో సుఖమౌ !
శ్రీ కంది శంకరయ్య గారికి వంశోద్ధారకుడగు పౌత్రుడు ప్రభవించిన శుభ సందర్భమున మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.
మనుమండొ మనుమరాలో యనునది భగవత్ ప్రసాదమను భావనతోగొనుమా సంతోషముతోమనుమా శ్రీ శంకరయ్య మాన్యా! శుభమౌ!
మంచి క్షత్ర జాతి మానవ నాథులుమాటలాడు నెడల మనము, మనదియందు; రెన్నడేని ననరు నేనంచును నాదటంచు తెలియునా కవీంద్ర!
గురువులు శంకరయ్య గారికి భర్త యైతిరి యోసామి ! భార్య కునకు తండ్రి యైతిరి మీరలు దనయులకును తాత యైతిరి మనుమల దరము నకిల గురువు లైతిరి మఱి మాకు గొనుడు నతు లు .
నాది నాది యనుచు నగుబాటు నొందకు నాది యనగ బుడమి నేది లేదు నాది మనది యనగ నేదియు లేదుగా ఉన్న దంతయు మఱి యురగ ప్రభుదె .
నీది నాది యనుచు బేధ మెన్న వలదు మనది మనము యనుట మంచి మాట ఏది ఎవరి దైన రాదు వెంట మనకు యశము మిగిలె నేని మసన మునకు
ఏది నీది కాదు యేది నాదియు గాదు నాది మనది యన మనాది యగును స్వంతమైన దనెడు స్వార్థ చింతన మానిపరుల కొరకె నీవు పాటు పడుము
'నాది,మాది 'యటంచు నజ్ఞానతిమిర మందశాంతితో వెదకుచు నరుగనేల ? ప్రకృతి యంతయు దైవకృపాప్రసాద మందరిదను జ్ఞానమ్మున నమరు శాంతి.
రిప్లయితొలగించండినాది అనునది ఇదియును లేదు
మనది అనునది మరీను లేదు
ఉన్నదల్లా ఆ పై అల్లా క్రింద మనం
తెలిసుకొనవె జిలేబీ ధన్యమగు జన్మ !
జిలేబి
నాదేయన స్వార్థమ్మగు
రిప్లయితొలగించండినీదేయన కలసి యుండనేరము కాదా ?
కాదే నీదీ నాదీ
యేదైనను మనది యనగ నెంతో సుఖమౌ !
శ్రీ కంది శంకరయ్య గారికి వంశోద్ధారకుడగు పౌత్రుడు ప్రభవించిన శుభ సందర్భమున మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.
రిప్లయితొలగించండిమనుమండొ మనుమరాలో
రిప్లయితొలగించండియనునది భగవత్ ప్రసాదమను భావనతో
గొనుమా సంతోషముతో
మనుమా శ్రీ శంకరయ్య మాన్యా! శుభమౌ!
మంచి క్షత్ర జాతి మానవ నాథులు
రిప్లయితొలగించండిమాటలాడు నెడల మనము, మనది
యందు; రెన్నడేని ననరు నేనంచును
నాదటంచు తెలియునా కవీంద్ర!
రిప్లయితొలగించండిగురువులు శంకరయ్య గారికి
భర్త యైతిరి యోసామి ! భార్య కునకు
తండ్రి యైతిరి మీరలు దనయులకును
తాత యైతిరి మనుమల దరము నకిల
గురువు లైతిరి మఱి మాకు గొనుడు నతు లు .
నాది నాది యనుచు నగుబాటు నొందకు
రిప్లయితొలగించండినాది యనగ బుడమి నేది లేదు
నాది మనది యనగ నేదియు లేదుగా
ఉన్న దంతయు మఱి యురగ ప్రభుదె .
నీది నాది యనుచు బేధ మెన్న వలదు
రిప్లయితొలగించండిమనది మనము యనుట మంచి మాట
ఏది ఎవరి దైన రాదు వెంట మనకు
యశము మిగిలె నేని మసన మునకు
ఏది నీది కాదు యేది నాదియు గాదు
రిప్లయితొలగించండినాది మనది యన మనాది యగును
స్వంతమైన దనెడు స్వార్థ చింతన మాని
పరుల కొరకె నీవు పాటు పడుము
రిప్లయితొలగించండి'నాది,మాది 'యటంచు నజ్ఞానతిమిర
మందశాంతితో వెదకుచు నరుగనేల ?
ప్రకృతి యంతయు దైవకృపాప్రసాద
మందరిదను జ్ఞానమ్మున నమరు శాంతి.