24, మే 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1062 (మునిహంతకునకు శరణన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మునిహంతకునకు శరణనఁ బుణ్యము గలుగున్.

16 కామెంట్‌లు:

  1. మనమును గలంచు కాముడు
    కన నతడే మొదటి వైరి కద యార్వురిలో
    వినయాదరములతో గా
    ముని హంతకునకు శరణన బుణ్యము కలుగున్

    రిప్లయితొలగించండి
  2. మాస్టరు గారూ ... మునిహంతకునే... అంటే బాగుంటుందేమో...

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,
    శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు .
    =========*==========
    ఆడ పిల్లలను హింసించు కిచకులను చంపినా తప్పు లేదని

    వెనుకటి గుణములు మరువక
    శునకము వలె దిరుగుచున్న శూరుని,మహిలో
    మనుజుడ నను కీచక నా
    ముని,హంతకునకు శరణన బుణ్యము గలుగున్

    రిప్లయితొలగించండి
  4. జనులను తృటిలో వశమునఁ
    గొను కాముని గెలుచుకొనగ ఘోరగతి మసి చే
    సిన శంకరునకు, నా కా
    మునిహంతకునకు శరణనఁ బుణ్యము గలుగున్.

    రిప్లయితొలగించండి
  5. అనయము దుర్గతి గలుగును
    ముని హంతకునకు, శరణన బుణ్యము గలుగున్
    అనిశము సాయిని నార్తిని
    వినతులు నుం జేసికొనిన వీ డును పీ డ ల్ .

    రిప్లయితొలగించండి
  6. శ్రీ లక్ష్మీ దేవిగారు మంచి బావముతొ వ్రాసినారు,
    మీ పద్యము రెండవ పాదములో ఒక లఘువు ఎక్కువైనది సరి జేయగలరు

    రిప్లయితొలగించండి
  7. కవిమిత్రులకు నమస్కారాలు.
    నిన్న మా కోడలు మగబిడ్డనే కన్నది. మనుమరాలయితే బాగుండు అనుకొన్నాను, కానీ దైవనిర్ణయం అలా ఉన్నది.
    శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు.
    క్షణం తీరికి లేదు.. అతి కష్టంమీద ఉదయం సమస్యను, పద్యరచన శీర్షికను పోస్ట్ చేయగలిగాను.
    సమస్య పట్ల అంత సంతృప్తి లేదు. ఏదో ఇవ్వాలికదా అన్న తొందర.. మన్నించండి.
    ఇప్పుడు మా తమ్ముడి అల్లుని ఊరు ‘రిసెప్షన్’కు వెళ్తున్నాను. తిరిగి రావడం ఏ రాత్రికో?
    సెలవు... స్వస్తి!

    రిప్లయితొలగించండి
  8. వరప్రసాద్ గారు,
    ధన్యవాదములండి.

    జనులను తృటిలో వశమునఁ
    గొను కాముని మసిగ చేయ క్రోధముతో చూ
    సిన శంకరునకు, నా కా
    మునిహంతకునకు శరణనఁ బుణ్యము గలుగున్.

    రిప్లయితొలగించండి
  9. వినుటకు వింతగ నుండును
    గని నంతనె కపట మోహ కాముక వరులన్ !
    కని విని యెరుగని దౌష్ట్యపు
    ముని హంతకునకు శరణనఁ బుణ్యము గలుగున్ !

    రిప్లయితొలగించండి
  10. వినుడనె ప్రహ్లాదుడు హరి
    దనుజులకును సురనరులకు దండ్రి గదా! వా-
    నిని మనకు నా జనకునకు
    ముని హంతకునకు శరణనఁ బుణ్యము గలుగున్ !

    రిప్లయితొలగించండి
  11. మునివర మార్కండేయుడు
    ఘన శివ భక్తిన్ జయించె కాలుని, ఆహా!
    త్రినయనుని పొగడ తరమె!
    మునిహంతకునకు శరణనఁ బుణ్యము గలుగున్!!

    రిప్లయితొలగించండి
  12. ముని గణమున నారదుడట కా
    ముని గెలిచితి ననిపలికె పులకాం కితుడై !
    వెను వెంటనె శపియించ హరిని
    ముని హంతకునకు శరణనఁ బుణ్యము గలుగున్ !

    రిప్లయితొలగించండి





  13. మునివర ఖేచర వంద్యుని,
    ఘన హిమగిరి వాసు నీలకంఠుని ,హరు, స
    జ్జనరక్షాపరునిన్ గా
    మునిహంతకునకు శరణన బుణ్యము కలుగున్.

    రిప్లయితొలగించండి
  14. హననము జేసెదననియా
    వనవాసములో వెలసిన వనజాక్షునునిన్
    గనిన ఖరుని, రావణు త
    మ్ముని, హంతకునకు శరణనఁ బుణ్యము గలుగున్

    రిప్లయితొలగించండి