నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు. * అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ కొంగ్రొత్త రీతులతో పూరణలు చెప్పడం మీ ప్రత్యేకత. మా మనస్సులను ‘అపహరణము’ చేసే పూరణ మీది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, ఈరోజు మీ పూరణ కూడా వైవిధ్యంగా ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, అందరూ రామాయణాన్ని ఆశ్రయిస్తే మీరు ‘గ్రామాయణాన్ని’ ఆశ్రయించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, జటాయు మరణంపై చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ అద్భుతంగా ఉంది. వృత్త్యనుప్రాసాలంకార చ్ఛాయలూ గోచరిస్తున్నాయి. అభినందనలు.
డా. ఏల్చూరి మురళీధర రావు గారికి శుభాశీస్సులు. మీ స్పందన చాల బాగుగనున్నది. కీ.శే. గిడుగు రామమూర్తి గురించి చక్కని పద్యము వ్రాసేరు. శుభాభినందనలు.
శ్రీ పీతాంబర్ గారు! శుభాశీస్సులు. మీ పద్యము బాగగనున్నది. ఒక్కచోట చిన్న సవరణ చేయాలి: ధరణిజాత సీత దయనీయ స్థితి అనే చోట స్థితి అనె పదమునకు ముందున్న దయనీయ శబ్దములోని చివరి అక్షరము గురువు అగును. కాస్త పరిశీలించండి.
రాజ గృహపు పాల రాలపై నడయాడి ఐశ్వర్యములమధ్య నలరు వాడు పట్టుపానుపుమీద పవళించి తగురీతి సేద తీరెడి వాడు చిన్నివాడు అన్నతోడనె నేను యనుచు నడవి జేరి కఱకు దారుల మీద కాలు మోపి మొండి యెండకు ముద్దు ముఖము కమిలి బోవ ఇడుములన్నిటికి తానెదురు నిలిచి నన్ను నమ్మి వచ్చె నా తమ్ముడీ నాడు దానవారి శక్తి తగిలి పడెనె యనుచు భ్రాత గాంచి , యచటి రక్తపు యావ రణము గాంచి వగచె రామమూర్తి
మిత్రులారా! శుభాశీస్సులు. ఈ నాటి అందరి పూరణలు చక్కగా అలరించుచున్నవి. అందరికీ శుభాభినందనలు. కొందరి గురించి ప్రత్యేకముగా వ్రాసేను. మిగిలిన వారివి కూడా చాల చక్కగా వచ్చినవి. శ్రీ నాగరాజు రవీందర్ గారికి శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి శ్రి మిస్సన్న (దువ్వూరి వేంకట నరసింహ సుబ్బా రావు) గారికి శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారికి తమ్ముడు చి. డా. గన్నవరపు వరాహ నరసింహ మూర్తికి శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారికి డా. కమనీయం గారికి మరీ మరీ అభినందనలు. స్వస్తి.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ ‘అధికరణ’ పూరణ బాగుంది. అభినందనలు. * ఏల్చూరి మురళీధర రావు గారూ, మిత్రుడు పంపిన ఈ సమస్యలోని ‘రామమూర్తి’ శబ్దాన్ని చూడగానే శ్రీరామచంద్రుడు కాకుండా రెండు పేర్లు స్ఫురణకు వచ్చాయి. అవి గిడుగు రామమూర్తి, కోడి రామమూర్తి. మీరు గిడుగు వారి గురించిన వ్రాసిన పద్యం శబ్దాలంకారంత శోభిస్తూ, ప్రశస్తమైన భావంతో అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు. * కమనీయం గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. నేమాని వారి సూచన ననుసరించి ‘దయనీయ దశ గాంచి’ అందాం. * సహదేవుడు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. నేమాని వారు చెప్పినట్లు ‘యెదను’ అనిగానీ, ‘మదిని’ అనిగానీ సవరించండి. * కళ్యాణ్ గారూ, అద్భుతమైన పద్యం చెప్పారు. అభినందనలు. ‘నేను + అనుచు’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘నేనటంచు నడవి జేరి’ అనండి.
గురువు గారికి , అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని వారికి అభివందన పూర్వక ధన్యవాదములు. గిడుగు రామ మూర్తి వారిపై శ్రీ ఏల్చూరి వారి పద్యము అద్భుతముగా నున్నది. ఒక రెండు విషయాలను ప్రస్తావిస్తాను. ఆంగ్ల భాష తెలిసిన వారున్నా తెలియని వారే అన్నిదేశాలలో ఎక్కువ మంది ఉన్నారు. ఇంగ్లాండు,అమెరికా సంయుక్త రాష్ట్రాల లోనే ఆంగ్లము అధికార భాష. ఐరోపాఖండములో మిగిలిన దేశాలకు వారి వారి భాష లున్నాయి. దక్షిణ అమెరికా ఖండములో స్పానిష్ వాడుకలో నుంది.అందుచే ఆంగ్లము లోక భాష కాదు. రెండవది ఆంగ్ల భాషలో కూడా వ్యావహారిక భాషను యధాతధంగా పుస్తకాలలోను పత్రికల లోను ఎక్కించరు, కారణము వ్యావహారికములో వ్యాకరణ దోషాలు సామాన్య ప్రజానీకానికి అధికముగా నుండడము. నా అభిప్రాయము ఎట్టి దోషాలున్నా ఎటువంటి తెలుగు నైనా అతి తక్కువ ఆంగ్ల పదాలతో వ్రాయడము, మాటలాడడము , అన్ని కార్యాలయాలలోను వాడడము మంచిది. అన్ని శాస్త్రాలు తెలుగులో పఠించ గలిగే దినము వస్తే తెగ సంతోషిస్తాను. మనకు ఆ పదజాల మున్నది. ప్రపంచములో ఇన్ని భాష లుండడము వలన అనువాదకుల అవసర మెప్పుడూ ఉంటుంది.
డా. ఆచార్య ఫణీంద్ర గారూ, ఇదేదో సమస్యాపూరణం కోసం మొక్కుబడిగా వ్రాసిన పద్యంలా లేదు. మనోహరమైన భావకవితాఖండిక నుండి ఎత్తి చూపిన శ్రేష్ఠమైన పద్యంలా ఉంది. అంతేకాక ఆటవెలది పాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన మీ నైపుణ్యం అమోఘం. అభినందనలు, ధన్యవాదాలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగుంది. అభినందనలు.
మూర్తిగారు, మీరు చెప్పిన మంచి మాటలకు ఎంతో సంతోషం కలిగినది. తెలిసో తెలియకో కాని ఎక్కువమంది ఆంగ్లము మాట్లాడకున్నా, ఆంగ్లము కలిపి మాట్లాడకున్నా వింతగా చూస్తారు. జాలి పడతారు. అభివృద్ధి అంటే ప్రాథమికమైనది ఆంగ్లము మీద పట్టు ఉండడమనుకుంటారు.
శ్రీపండిత నేమాని గారికి , శ్రీ కంది శంకరయ్య గారికి , నా రచనలు సమీక్షించి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతున్నందుకు సర్వదా కృతఙ్ఞుడను.
శ్రీలక్ష్మీదేవి గారికి, అవునండీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ మధ్య మన బ్లాగ్ చూస్తున్నాను , నా ఈ ' సాఫ్ట్ వేర్ ' ఉద్యోగం తెలియకుండానే ' సాఫ్ట్ సాఫ్ట్ ' గా నా సమయాన్ని హరించేస్తోంది !!! నా పద్యం నచ్చినందుకు ధన్యవాదాలండి
సీత జాడ కొఱకు శ్రీరాము డంతట
రిప్లయితొలగించండివెడలె లక్ష్మణుండు వెంట రాగ
అడవిలో దిరుగుచు నచట జానకి యాభ
రణము గాంచి వగచె రామమూర్తి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినగలు కొన్ని క్రింద నగముపై బడునట్లు
రిప్లయితొలగించండిసీత జార విడిచె భీత యగుచు
కపులు వాని జూప కనుగొని సతియాభ
రణముఁ గాంచి వగచె రామమూర్తి.
చాల పోరు సలుప వాలి సుగ్రీవులం
రిప్లయితొలగించండిదెవ్వడెవడొ రాము డెరుగలేక
సాయ మీయలేక శాంతి గోల్పడుచు నా
రణము గాంచి వగచె రామమూర్తి
లేడి దొరక దాయె లేమను గోల్పోయె
రిప్లయితొలగించండినసుర శక్తి జేసె నకట మాయ
నీడ వోలె వెంట నిలచు సతి యపహ-
రణము గాంచి వగచె రామమూర్తి
unknown నేనే.
రిప్లయితొలగించండిసీతఁ గావనెంచి చిత్రవధ పడుచు
రిప్లయితొలగించండినా జటాయువు జనె నవని విడిచి
తండ్రి మిత్రుడనుచు దలచి యా పక్షి మ
రణముఁ గాంచి వగచె రామమూర్తి.
భూమి శిస్తు కొఱకు భూపతి పంపు ,క
రిప్లయితొలగించండిరణము గాంచి వగచె రామ మూర్తి
శిస్తు కట్ట సొమ్ము మస్తుగ దన యొద్ద
లేక పోవు కతన మూకి యయ్యె
సీత నపహరించి చెనటి లంకేశుడు
రిప్లయితొలగించండివెడలుచుండ సీత యడలు వినియు
పోరి ప్రాణ మిడిచె శూర జటాయు, మ
రణము గాంచి వగచె రామ మూర్తి .
తెలిసి దెలియలేక తేటతెల్లము గాక
రిప్లయితొలగించండిపఱుగు లురక లిడుచు వెఱపు జూపు
కనకమృగము మొఱఁగుఁ దన మహీజాపహ
రణము గాంచి వగచె రామమూర్తి
మొఱఁగు = మోసము
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
*
అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ కొంగ్రొత్త రీతులతో పూరణలు చెప్పడం మీ ప్రత్యేకత. మా మనస్సులను ‘అపహరణము’ చేసే పూరణ మీది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
ఈరోజు మీ పూరణ కూడా వైవిధ్యంగా ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
అందరూ రామాయణాన్ని ఆశ్రయిస్తే మీరు ‘గ్రామాయణాన్ని’ ఆశ్రయించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
జటాయు మరణంపై చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. వృత్త్యనుప్రాసాలంకార చ్ఛాయలూ గోచరిస్తున్నాయి. అభినందనలు.
సీత జాడ కొఱకు భూతలంబంతయు
రిప్లయితొలగించండిన్వెదకి జనెడునట్టి వేళయందు
నాజటాయు పక్షి యందించిన యధిక
రణముఁ గాంచి వగచె రామమూర్తి.
అధికరణము = ఆధారము
శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్కృతులతో,
పలుకు పల్కెడి తీరు వ్రాఁత వ్రాసెడి సౌరు సామరస్యముఁ గల్గి సంతరింప
శాసనమ్ముల తీరు శాస్త్రకృతుల తేరు సహజమ్ము సరళమ్ము సహచరింప
వ్యాకరణము తీరు వ్యాకరించినవారు లోకభాషకు మారు లోను గాక
ప్రజల వాడుకఁ గేరు పాండిత్యమునఁ దేరు కవిసంప్రదాయమ్ము కందళింప
నాంధ్రులెల్ల వ్యావహారిక భాషోద్య
మమ్ము సత్ఫలమ్ము వమ్ము గాక
యనుభవించు టెపుడు కనుఁగొందునో! యంచు
రణముఁ గాంచి వగచె రామమూర్తి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
రిప్లయితొలగించండిరావణాసురుండు రథమందు దననుంచి
గగనమార్గమందు గదలుచుండ
జారవిడచినట్టి జానకీసతి యాభ
రణము గాంచి వగచె రామమూర్తి.
ధరణిజాతసీత దయనీయ స్థితిగాంచి
రిప్లయితొలగించండిరావణు నెదిరించె రక్తమోడ్చి
త్యాగజీవియౌ జటాయువువీరమ
రణము గాంచి వగచె రామమూర్తి
డా. ఏల్చూరి మురళీధర రావు గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ స్పందన చాల బాగుగనున్నది. కీ.శే. గిడుగు రామమూర్తి గురించి చక్కని పద్యము వ్రాసేరు. శుభాభినందనలు.
శ్రీ పీతాంబర్ గారు! శుభాశీస్సులు.
మీ పద్యము బాగగనున్నది. ఒక్కచోట చిన్న సవరణ చేయాలి:
ధరణిజాత సీత దయనీయ స్థితి అనే చోట స్థితి అనె పదమునకు ముందున్న దయనీయ శబ్దములోని చివరి అక్షరము గురువు అగును. కాస్త పరిశీలించండి.
స్వస్తి
వాదు లాడి భరత పట్టాభి షేకమ్ము
రిప్లయితొలగించండితండ్రియాజ్ఞ యనగ తల్లి కైక
సంత సించి, మదిన సతికైక పతితోడి
రణము గాంచి వగచె రామ మూర్తి
రాజ గృహపు పాల రాలపై నడయాడి
రిప్లయితొలగించండిఐశ్వర్యములమధ్య నలరు వాడు
పట్టుపానుపుమీద పవళించి తగురీతి
సేద తీరెడి వాడు చిన్నివాడు
అన్నతోడనె నేను యనుచు నడవి జేరి
కఱకు దారుల మీద కాలు మోపి
మొండి యెండకు ముద్దు ముఖము కమిలి బోవ
ఇడుములన్నిటికి తానెదురు నిలిచి
నన్ను నమ్మి వచ్చె నా తమ్ముడీ నాడు
దానవారి శక్తి తగిలి పడెనె
యనుచు భ్రాత గాంచి , యచటి రక్తపు యావ
రణము గాంచి వగచె రామమూర్తి
శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. 3వ పాదములో "మదిన"కి బదులుగా "యెదను" అని మార్చండి.
స్వస్తి.
శ్రీ కళ్యాణ్ గారు
రిప్లయితొలగించండిశుభాశీస్సులు. మంచి సీస పద్యమును వ్రాసేరు. శుభాభినందనలు.
స్వస్తి.
మిత్రులారా!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు. ఈ నాటి అందరి పూరణలు చక్కగా అలరించుచున్నవి. అందరికీ శుభాభినందనలు. కొందరి గురించి ప్రత్యేకముగా వ్రాసేను. మిగిలిన వారివి కూడా చాల చక్కగా వచ్చినవి.
శ్రీ నాగరాజు రవీందర్ గారికి
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి
శ్రి మిస్సన్న (దువ్వూరి వేంకట నరసింహ సుబ్బా రావు) గారికి
శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారికి
తమ్ముడు చి. డా. గన్నవరపు వరాహ నరసింహ మూర్తికి
శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారికి
డా. కమనీయం గారికి
మరీ మరీ అభినందనలు.
స్వస్తి.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ ‘అధికరణ’ పూరణ బాగుంది. అభినందనలు.
*
ఏల్చూరి మురళీధర రావు గారూ,
మిత్రుడు పంపిన ఈ సమస్యలోని ‘రామమూర్తి’ శబ్దాన్ని చూడగానే శ్రీరామచంద్రుడు కాకుండా రెండు పేర్లు స్ఫురణకు వచ్చాయి. అవి గిడుగు రామమూర్తి, కోడి రామమూర్తి.
మీరు గిడుగు వారి గురించిన వ్రాసిన పద్యం శబ్దాలంకారంత శోభిస్తూ, ప్రశస్తమైన భావంతో అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
*
కమనీయం గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
నేమాని వారి సూచన ననుసరించి ‘దయనీయ దశ గాంచి’ అందాం.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
నేమాని వారు చెప్పినట్లు ‘యెదను’ అనిగానీ, ‘మదిని’ అనిగానీ సవరించండి.
*
కళ్యాణ్ గారూ,
అద్భుతమైన పద్యం చెప్పారు. అభినందనలు.
‘నేను + అనుచు’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘నేనటంచు నడవి జేరి’ అనండి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండివాత్సల్యమూర్తులై మిత్రుల పూరణల గుణదోషాలను సమీక్షిస్తున్న మీకు నమస్కృతులు, ధన్యవాదాలు.
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదములు.
కళ్యాణ్ గారు,
రిప్లయితొలగించండిబహుకాల దర్శనం. మంచి పద్యముతో వచ్చినారు.బాగున్నది.
అంధకార గృహము నందు నడలి, యడలి,
రిప్లయితొలగించండితెరచె తలుపు రెక్క నొకింత, తెరపి గోరి -
శూలమటు గ్రుచ్చుకొను సీత చూపు బోలు
రవి కిరణము గాంచి వగచె రామమూర్తి!
గురువు గారికి , అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని వారికి అభివందన పూర్వక ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగిడుగు రామ మూర్తి వారిపై శ్రీ ఏల్చూరి వారి పద్యము అద్భుతముగా నున్నది. ఒక రెండు విషయాలను ప్రస్తావిస్తాను. ఆంగ్ల భాష తెలిసిన వారున్నా తెలియని వారే అన్నిదేశాలలో ఎక్కువ మంది ఉన్నారు. ఇంగ్లాండు,అమెరికా సంయుక్త రాష్ట్రాల లోనే ఆంగ్లము అధికార భాష. ఐరోపాఖండములో మిగిలిన దేశాలకు వారి వారి భాష లున్నాయి. దక్షిణ అమెరికా ఖండములో స్పానిష్ వాడుకలో నుంది.అందుచే ఆంగ్లము లోక భాష కాదు. రెండవది ఆంగ్ల భాషలో కూడా వ్యావహారిక భాషను యధాతధంగా పుస్తకాలలోను పత్రికల లోను ఎక్కించరు, కారణము వ్యావహారికములో వ్యాకరణ దోషాలు సామాన్య ప్రజానీకానికి అధికముగా నుండడము.
నా అభిప్రాయము ఎట్టి దోషాలున్నా ఎటువంటి తెలుగు నైనా అతి తక్కువ ఆంగ్ల పదాలతో వ్రాయడము, మాటలాడడము , అన్ని కార్యాలయాలలోను వాడడము మంచిది. అన్ని శాస్త్రాలు తెలుగులో పఠించ గలిగే దినము వస్తే తెగ సంతోషిస్తాను. మనకు ఆ పదజాల మున్నది. ప్రపంచములో ఇన్ని భాష లుండడము వలన అనువాదకుల అవసర మెప్పుడూ ఉంటుంది.
కనులు మూసు కొనుచు కాన లేదెవరంచు
రిప్లయితొలగించండిమాయ లెన్నొ జేసి మట్టు బెట్టు
దైత్య గణము చేయు దారుణ హింసల
రణముఁ గాంచి వగచె రామ మూర్తి !
సవరణను సూచించిన పూజ్యులు శ్రీపండిత నేమాని గారికి సవరణను చేసిన శ్రీ శంకరయ్య గారికి ధన్య వాదములు.
రిప్లయితొలగించండిడా. ఆచార్య ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండిఇదేదో సమస్యాపూరణం కోసం మొక్కుబడిగా వ్రాసిన పద్యంలా లేదు. మనోహరమైన భావకవితాఖండిక నుండి ఎత్తి చూపిన శ్రేష్ఠమైన పద్యంలా ఉంది. అంతేకాక ఆటవెలది పాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన మీ నైపుణ్యం అమోఘం. అభినందనలు, ధన్యవాదాలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమాతృభాషాభిమానంతో మీరు చేసిన వ్యాఖ్య సహేతుకం, సమర్థనీయం. ధన్యవాదాలు.
మూర్తిగారు,
రిప్లయితొలగించండిమీరు చెప్పిన మంచి మాటలకు ఎంతో సంతోషం కలిగినది.
తెలిసో తెలియకో కాని ఎక్కువమంది ఆంగ్లము మాట్లాడకున్నా, ఆంగ్లము కలిపి మాట్లాడకున్నా వింతగా చూస్తారు. జాలి పడతారు. అభివృద్ధి అంటే ప్రాథమికమైనది ఆంగ్లము మీద పట్టు ఉండడమనుకుంటారు.
గురువర్యులకు, లక్ష్మీదేవి గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువర్యులకు , సహృదయులకు అందరికీ నమస్కారం !
రిప్లయితొలగించండిశ్రీపండిత నేమాని గారికి , శ్రీ కంది శంకరయ్య గారికి ,
నా రచనలు సమీక్షించి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతున్నందుకు సర్వదా కృతఙ్ఞుడను.
శ్రీలక్ష్మీదేవి గారికి,
అవునండీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ మధ్య మన బ్లాగ్ చూస్తున్నాను , నా ఈ ' సాఫ్ట్ వేర్ ' ఉద్యోగం తెలియకుండానే ' సాఫ్ట్ సాఫ్ట్ ' గా నా సమయాన్ని హరించేస్తోంది !!! నా పద్యం నచ్చినందుకు ధన్యవాదాలండి