వారిని చూచుటెట్లు? బహుభంగుల సాంత్వనవాక్యజాలమున్ చేరి వచించుటెట్లు? తమచింతను వీడుడటంచు, ప్రేమగా వారల దు:ఖకారణము పల్కుడటంచును వేడు టెట్టు? ల వ్వారలతోడ నున్న పసివానిని కెట్టుల బుజ్జగించుటో?
మేను కృశించిపోయినది, మిక్కిలి దు:ఖముచేత మోమికన్ దీనత నొందియున్నయది, తీర్చెడువారలు, పల్కరించువా రేనియు కానరాక తమ నీవిధి జూచిన దేవదేవునిన్ ధ్యానము చేయలేక పరితాపము చెందిరి వృద్ధదంపతుల్.
ఎండలు మండు చున్న విల నివ్ విధి జాగ్రత పూరి పాకలో నుండెడు పేద వాడ మరి యొక్క రజాగ్రత తోడ వంటలే వండుచు నున్న నిప్పుబడ వాడకు వాడయె బూడిదౌను ' నా ల్రౌండుగ ' మొత్తమే పరశు రాముని ప్రీతిగ మారి పోవుగా !
జాతీయంగా అర్థాన్ని వివరిస్తూ పద్యాలు వ్రాసిన కవిమిత్రులు సుబ్బారావు గారికి, లక్ష్మీదేవి గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, వాచ్యార్థాన్ని గ్రహించి చక్కని పద్యం చెప్పిన పండిత నేమాని వారికి, అద్భుతమైన ఖండికను వ్రాసిన హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, పరశురామ ప్రీతిలో జనహితాన్ని వివరిస్తూ వైవిధ్యంగా వ్రాసిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి, పరశురాముని గురించి పద్యం వ్రాసిన రాజేశ్వరి అక్కయ్యకు అభినందనలు, ధన్యవాదాలు. * హరి వారూ, ‘నోరాపక యేడ్చుచుండె’ అని యడాగమం రావాలని గమనించండి. * అక్కయ్యా, మూడో పాదంలో గణదోషం... ‘క్షత్రియు డయి’ అంటే సరి.
భవన సముదాయములు మఱి ప్రక్క నుండు
రిప్లయితొలగించండిపాక శాలలు నంగడి ప్రాంతములును
దగ్ధ మగుటను నగ్నికి ,దాని నండ్రు
పరశు రాముని ప్రీ తియై బరగె ననుచు
అగ్నికాహుతి యగుటనే యందురిటుల
రిప్లయితొలగించండిపరశురామ ప్రీతి యనుచు; భావమేమి
యనగ భార్గవుండు దలచి యంతమొనర
జేసె రాజ లోకమునెల్ల జృంభణమున.
పరశురామునికి పరమేశ్వరుని సేవించుటే మహాప్రీతి అనే భావముతో:
రిప్లయితొలగించండిపరమేశుండు సమస్త లోకపతి విశ్వశ్రేయముల్ గూర్చు శం
కరుడే ధ్యేయము దేవదేవుడనుచున్ గౌరీవిభున్ గొల్చుటే
తరణోపాయమటంచు భార్గవుడు సోత్సాహంబుగా జేయునా
దరమొప్పన్ గద తద్విధాన మలరున్ తథ్యంబు తత్ప్రీతినాన్
వారిని చూచుటెట్లు? బహుభంగుల సాంత్వనవాక్యజాలమున్
రిప్లయితొలగించండిచేరి వచించుటెట్లు? తమచింతను వీడుడటంచు, ప్రేమగా
వారల దు:ఖకారణము పల్కుడటంచును వేడు టెట్టు? ల
వ్వారలతోడ నున్న పసివానిని కెట్టుల బుజ్జగించుటో?
మేను కృశించిపోయినది, మిక్కిలి దు:ఖముచేత మోమికన్
దీనత నొందియున్నయది, తీర్చెడువారలు, పల్కరించువా
రేనియు కానరాక తమ నీవిధి జూచిన దేవదేవునిన్
ధ్యానము చేయలేక పరితాపము చెందిరి వృద్ధదంపతుల్.
ఆ పసివాడు వారల కులాబ్ధికి వారసుడైనవాడు నో
రాపక నేడ్చుచుండె నత డాకలిదప్పులచేత నేమియో
శాపము పెట్టినట్టు లిల జన్మమునందిన కొన్నినాళ్ళకే
పాపము! తల్లిదండ్రి మును స్వర్గము జేరిరి వాని వీడుచున్.
చేతము లుల్లసిల్లువిధి చిన్నకుటీరమునందు వారలున్
ఖ్యాతి గడించియుండ నొక కాలము వేసవి యాగ్రహాగ్ని సం
భూత భయంకరాకృతికి భోజనమయ్యెను నిద్రనుండగా
రాతిరి వేళలో "పరశురాముని ప్రీతికి" వారి గేహమున్.
శోక మణంగునా? నిలిచి చూచెడువా డొకడుండబోవునా?
చేకొను డంచు పల్కి తమచేతిని వారల కూతమిచ్చి మీ
రాకట నుండరాదనుచు నాదుకొనంగను సాహసించువా
రీకలి నుందురా? తెలియ దేమగునో, యిటువంటివారికిన్.
పరశురామ ప్రీతి :
రిప్లయితొలగించండిభూరి లంకా పురిన్ భూతిపాలుగఁ జేసి
.....హనుమంతుడొనరించెనసమరీతి
ఖాండవదహనముత్కంఠతన్ వెలయించి
....కృష్ణార్జునులు మహిన్ కీర్తిఁ గనిరి
లక్కా గృహంబు సౌలభ్యంబు గాదని
....యగ్నికాహుతిఁ జేసె ననిలజుండు
విష సర్పములనెల్ల విభ్రాంతిఁ వడజేయ
.....జనమేజయుఁడు జేసె సర్పయాగ
మరసి చూడంగ కల్యాణకరములగుచు
బహువిధంబుల సత్కీర్తిఁ వడసి చెలగెఁ
ధైర్యసాహసములకు సంధానమగుచు
కనుము పరశురామప్రీతి కార్యములను.
ఎండలు మండు చున్న విల నివ్ విధి జాగ్రత పూరి పాకలో
రిప్లయితొలగించండినుండెడు పేద వాడ మరి యొక్క రజాగ్రత తోడ వంటలే
వండుచు నున్న నిప్పుబడ వాడకు వాడయె బూడిదౌను ' నా
ల్రౌండుగ ' మొత్తమే పరశు రాముని ప్రీతిగ మారి పోవుగా !
తల్లి శిరమును నరికిన తనయు డనగ
రిప్లయితొలగించండివెల్లువగు క్రోధ మందున ప్రీతి చెంది
క్షాత్ర బుద్ధిని కలిగిన క్షత్రియు నివలె
పరశు రాముడు వరమున బలము నొందె
జాతీయంగా అర్థాన్ని వివరిస్తూ పద్యాలు వ్రాసిన కవిమిత్రులు సుబ్బారావు గారికి, లక్ష్మీదేవి గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
రిప్లయితొలగించండివాచ్యార్థాన్ని గ్రహించి చక్కని పద్యం చెప్పిన పండిత నేమాని వారికి,
అద్భుతమైన ఖండికను వ్రాసిన హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
పరశురామ ప్రీతిలో జనహితాన్ని వివరిస్తూ వైవిధ్యంగా వ్రాసిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
పరశురాముని గురించి పద్యం వ్రాసిన రాజేశ్వరి అక్కయ్యకు
అభినందనలు, ధన్యవాదాలు.
*
హరి వారూ,
‘నోరాపక యేడ్చుచుండె’ అని యడాగమం రావాలని గమనించండి.
*
అక్కయ్యా,
మూడో పాదంలో గణదోషం... ‘క్షత్రియు డయి’ అంటే సరి.
ఆర్యా!
రిప్లయితొలగించండిధన్యవాదములు.
సవరించుకుంటాను.