19, మే 2013, ఆదివారం

పద్య రచన - 346 (కొండపల్లి బొమ్మ)

కొండపల్లి బొమ్మ
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. తెలుగింటి పడుచు బల్ క
    న్నుల విందుగ గలదదే పనుల్ సేయుచు నా
    కలికి యొనరించు వంటక
    ముల రుచులే జన్మ జన్మములకగు విందుల్

    రిప్లయితొలగించండి
  2. పల్లియ వాతావరణము
    యుల్లమునే దోచు నీయ నొప్పుగ బొమ్మల్
    పిల్లలకు కొండ పల్లివి
    అల్లరి నే వదలి యాట లాడగ తోచున్.

    రిప్లయితొలగించండి
  3. కొండపల్లి బొమ్మ కోణంగియా ? కాదు
    కొలువు దీర్చి యింట వెలుగు నిచ్చు
    అందమైన బొమ్మ యాటలాడుటె గాక
    పనులు సేయు కూర్మి పసిడి బొమ్మ !

    రిప్లయితొలగించండి
  4. వంట వార్పుఁ జేయు వనితదౌ నా బొమ్మ!
    చూడ ముచ్చటైన సొంపు లమ్మ!
    వాసి కెక్కె వారి ప్రతిబొమ్మ విశ్వాన!
    కొండ పల్లి బొమ్మ కులుకు లమ్మ!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సహదేవుడు గారి పద్యములో "ప్రతిబొమ్మ" అనే సమాసము సాధువు కాదు. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. కొండపల్లి బొమ్మ కోటి కాంతులు గల్గి
    ప్రాణ ముండు దాని వలె ను నుండె
    చూడ చిత్ర మదియ చూడ్కుల కిం పయి
    అంద గించి మదిని హర్ష మొదవె .


    రిప్లయితొలగించండి
  7. కొండపల్లి బొమ్మ కోరి దెచ్చెను మామ
    శిరము నూపు నదియె చిత్రముగను
    పొనికి చెక్క పైన పూసి చింతపొడిని
    చేయుదురట యట్టి శిల్పములను

    రిప్లయితొలగించండి
  8. కొండ పిల్ల వోలె నిండు సంస్కారమ్ము (కొండ పిల్ల = పార్వతి)
    సాధు జీవనంపు సరళి దనర
    వెలుగు లెన్నొ నింపు తెలుగింటి కలికి యీ
    కొండపల్లి బొమ్మ కుందనమ్మె

    రిప్లయితొలగించండి
  9. శ్రీనేమని గురువర్యులకు ప్రణామములు. తమరి సూచన తో సవరించిన పద్యం :

    వంట వార్పుఁ జేయు వనితదౌ
    నా బొమ్మ!
    చూడ ముచ్చటైన సొంపు లమ్మ!
    వాసి కెక్కె వారి
    వర్ణాలు విశ్వాన!
    కొండ పల్లి బొమ్మ
    కులుకు లమ్మ!

    రిప్లయితొలగించండి
  10. కొండ పల్లివా రింటను కొలువు దీరి
    అమ్మ వలె వంట లొండుచు కమ్మ గాను
    కొమ్మ లందున రంగుల బొమ్మ వైన
    రాణి వాసపు సొగసుల రాణి వమ్మ

    రిప్లయితొలగించండి






  11. వండుచున్న రీతిని దీర్చి కొండపల్లి
    బొమ్మను దయారుచేసిరి పొలుపుమీర
    కళలు దేశాన నెన్నియో కలవు గాన
    ప్రభుత,ప్రజలును,ప్రోత్సాహ పరచవలయు.

    రిప్లయితొలగించండి
  12. కొండపల్లికి ఖ్యాతినిఁ గూర్చుబొమ్మ
    తెలుగుదనము నుట్టి పడుచు తిరుగు బొమ్మ
    అందమైన బొమ్మ నగవులందు సాటి
    లేనిదమ్మ మా బొమ్మొక లేమదమ్మ.

    గురువుగారు,
    ఈరోజు నెట్ వచ్చినది.

    రిప్లయితొలగించండి
  13. జీవకళ ఉట్టిపడే కొండపల్లి బొమ్మను చూసి స్పందించి అందమైన పద్యాలను రచించిన కవిమిత్రులు......
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    సహదేవుడు గారికి,
    సుబ్బారావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    కమనీయం గారికి,
    లక్ష్మీదేవి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి