26, మే 2013, ఆదివారం

పద్య రచన - 353 (ఛాందసుఁడు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“ఛాందసుఁడు”

6 కామెంట్‌లు:

 1. ఛందస్సనగా వేదము
  ఛాందసుడన వేదములను చదివిన వాడే
  అందదు అర్థంబది గన
  ఛాందసుడమాయ కుడునగు జనులకు నేడే.

  రిప్లయితొలగించండి
 2. ఛాందసుడన్న వేదముల చక్కగ నధ్యయనమ్ము చేసి తా
  నందలి పద్ధతుల్ జనహితార్థము నాచరణమ్మొనర్చి పెం
  పొందిన జ్ఞానతేజమున విశ్వహితుండయి యొప్పు వాడు; నే
  డందరు నట్లుగాక వికటార్థము బల్కుట యేమి చోద్యమో!

  రిప్లయితొలగించండి
 3. ఛంద మనగను నర్ధము నందు రార్య !
  వేద మనుచును , చదివియా వేదసార
  మితరుల కెవడు చెప్పునో నతని నండ్రు
  ఛాం ద సుండని పుడమిని శాస్త్రి గారు .

  రిప్లయితొలగించండి
 4. వేదమ్ముల శ్రద్ధ గలిగి
  మోదముతోడను పఠించు బుధులనె ఇలలో
  నాదరమునఁ బిలుచుదురీ
  భేదము తెలియక పలువురు వేరనుకొనరే!

  రిప్లయితొలగించండి
 5. చందస్సును దెలుసు కొనుట
  అందరికీ సాధ్య పడదు యాచర ణీయం !
  బొందగ కోరిన కొందరు
  అందముగా పొంది తనరి చాందసు డౌగా !

  రిప్లయితొలగించండి
 6. తెలుగులో అపార్థాలకు గురియైన పదాల్లో ఈ 'ఛాందసుడు' ఒకటి. కవిమిత్రులు ఆ అపార్థాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ చక్కని పద్యాలు వ్రాసారు. ధన్యవదాలు.
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  సుబ్బారావు గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు
  అభినందనలు.

  రిప్లయితొలగించండి